#SaiPallavi:'పుష్ప –2'లో సాయి పల్లవి పాత్ర ఇదే, ఎంత సేపు ఉంటుందంటే!

ఇటీవల ‘పుష్ప 2’ చిత్రం పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా లాంఛయింది. సెప్టెంబర్‌లో చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్ళబోతున్నట్టు సమాచారం. రెండో భాగానికి ఫహద్ ఫాజిల్ (Fahad Fazil) ప్రధాన విలన్ అవుతాడని.. బన్నీ, ఫహద్‌ల పోరు నేపథ్యంలో ప్రధాన కథ నడుస్తుందని అందరికీ అంచనా ఉంది. 

 SaiPallavi to play a tribal girl Pushpa2

అల్లు అర్జున్ పుష్ప 2(Pushpa 2) సినిమా గురించి అదిరిపోయే అప్‌డేట్‌ బయటకు వచ్చింది. సుకుమార్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందిన పుష్ప.. ప్యాన్‌ ఇండియా స్థాయిలో సక్సెస్‌  అయ్యింది. దాంతో పుష్ప–2 సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నారు. రీసెంట్ గా పుష్ప 2 సినిమా పూజా కార్యక్రమాలతో మొదలైంది. రెగ్యులర్‌ షూటింగ్‌  ఈ నెలలో (సెప్టెంబర్‌) మొదలుకానుంది. ఈ నేపధ్యంలో తాజాగా ఈ చిత్రం గురించి బయటకు వచ్చింది. ఈ  అప్‌డేట్‌తో అంచనాలు రెట్టింపు అయ్యాయి. అభిమానులు రెట్టింపు ఉత్సాహంతో ఉన్నారు. ఇంతకీ ఏమిటా ఆప్డేట్ అంటే...ఈ చిత్రంలో సాయి పల్లవి చేయబోతోందని.

మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాలో సాయి పల్లవి పాత్ర పది నిముషాలు మాత్రమే ఉంటుంది. అదీ సెకండాఫ్ లో వస్తుంది. ఆమె ఓ గిరిజన యువతిగా కనిపించనుంది. అల్లు అర్జున్ కు సంభందించిన ఓ కీలకమైన సమాచారం కోసం ఆమె దగ్గరకు వస్తారని, ఆ తర్వాత జరిగే పరిణామాలు ఇంట్రస్టింగ్ గా ఉంటాయని చెప్తున్నారు. మొదట సాయి పల్లవి...ఇంత చిన్న గెస్ట్ రోల్ లాంటి పాత్రకు ఒప్పుకోలేదని ,కానీ మొత్తం ఆమెపై డిజైన్ చేసిన సీన్స్ చూసిన వెంటనే ఓకే చెప్పిందని తెలుస్తోంది. అయితే ఈ విషయమై అఫీషియల్ సమాచారం ఏమీలేదు. మరో ప్రక్క సాయి పల్లవి పాత్రకు ఓ పాట ఉంటుందని, అది హైలెట్ అవుతుందని ప్రచారం జరుగుతోంది. 

రీసెంట్ గా సంగీత దర్శకుడు రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌ (Devisri prasad)ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పుష్ప–2 గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. 
పుష్ప చిత్రం ఎవరూ ఊహించని విధంగా ప్యాన్‌ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించింది. గ్లోబల్‌ సినిమాగా గుర్తింపు పొందింది. పుష్ప–2 అంతకుమించి ఉంటుంది. సుకుమార్‌ రాసిన కథ నెక్ట్స్‌ లెవల్లో ఉంది. నాక్కూడా చాలా ఎగ్జైట్‌ చేసిందీ కథ. మైండ్‌ బ్లోయింగ్‌ అనేలా కథ ఉంటుందని చెప్పగలను. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా కాకుండా సినిమా లవర్‌గా చెబుతున్నాను అన్నారు.

ప్రస్తుతం ఇండియా వైడ్‌గా ఎంతో ఆసక్తి కనబరుస్తున్న చిత్రం ‘పుష్ప : ది రూల్’ (Pushpa the rule). మొదటి భాగం సక్సెస్‌తో ఊపందుకున్న అంచనాల్ని అందుకోడానికి సుకుమార్ అండ్ టీమ్ చాలా కష్టపడుతోంది. స్ర్కిప్ట్ మీద చాలా సమయం వెచ్చించడం వల్ల సినిమా అనుకున్న టైమ్‌కు పట్టాలెక్కలేకపోయింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios