#Liger:ప్రీ రిలీజ్ గుంటూరులో, చిరుని గెస్ట్ గా రావద్దంటూ ట్రెండ్


సోషల్ మీడియా వచ్చాక ఎవరి ఇష్టమొచ్చివాళ్లు కామెంట్స్ ,అభిప్రాయాలు చెప్తున్నారు. తాము సరదాగా అనుకునేవి కూడా సీరియస్ నోట్ లా ప్రెజెంట్ చేసేస్తున్నారు. ముఖ్యంగా యాంటి ఫ్యాన్స్ రచ్చ ఓ రేంజిలో ఉంటోంది. ఇప్పుడు లైగర్ ని అడ్డం పెట్టి చిరుని టార్గెట్ చేస్తున్నారు.
 

Pre-release event of Liger film will happen in Guntur


సినీ ప్రియులు ఎక్జ‌యిటింగ్‌గా ఎదురుచూస్తున్న‌ మోస్ట్ ఎవెయిటెడ్  చిత్రం లైగ‌ర్ (Liger). పూరీ జ‌గ‌న్నాథ్ (Puri Jagannadh)దర్శకత్వం వహించిన  ఈ చిత్రంలో విజ‌య్‌దేవ‌ర‌కొండ (Vijay Deverakonda) టైటిల్ రోల్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ అన‌న్య‌పాండే (Ananya Pandey) హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ సినిమా నుంచి ఇప్ప‌టికే రిలీజైన పాట‌లు, ట్రైల‌ర్ క్యూరియాసిటీని పెంచాయి. ఆగ‌స్టు 25న విడుద‌ల కానుంది. రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతున్న నేప‌థ్యంలో దేశ‌వ్యాప్తంగా ప‌లు ప్ర‌ధాన న‌గ‌రాల్లో ప్ర‌మోష‌న్స్ తో బిజీగా ఉంది లైగ‌ర్ టీం. రీసెంట్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ వేదిక‌ను హ‌న్మకొండ‌-ఖాజీపేట‌లోని జరిపారు. ఇప్పుడు ఆంధ్రాలోనూ ప్లాన్ చేసారు.

గుంటూరులో ఈ చిత్రం ప్రీ రిలీజ్ పంక్షన్ ఈ వారంలో జరగనుందని సమాచారం. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే అదే సమయంలో చిరంజీవి ఈ ఈవెంట్ కు గెస్ట్ గా పిలిచారనే వార్త వైరల్ అయ్యింది. అయితే అందులో నిజమెంత ఉందో కానీ ....కొందరు యాంటి ఫ్యాన్స్ మాత్రం ...చిరంజీవి గెస్ట్ గా  వస్తే సినిమా ఫ్లాఫ్ అవుతుందని, కాబట్టి తమ హీరోకు హిట్ కావాలి కాబట్టి రావద్దని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. దీనికి మెగా ఫ్యాన్స్ గట్టిగా కౌంటర్స్ ఇస్తున్నారు. 

 పూరి జగన్నాథ్‌ మాట్లాడుతూ... విజయ్‌లో నాకు నచ్చేది నిజాయితీ. 'లైగర్‌'లో ఎంత ఎలివేషన్‌ పెట్టినా కొంచెం పొగరు కూడా కనిపించదు. చాలా నిజాయితీగా చేశాడు. విజయ్‌  లాంటి హీరోని నేను చూడలేదు. అనన్య ఫైర్‌ బ్రాండ్‌. అద్భుతంగా నటిస్తుంది. రమ్యకృష్ణ గారు రెబల్‌ తల్లిగా కనిపించినా స్ఫూర్తినిచ్చే పాత్ర. ఛార్మి సినిమా కోసం చాలా కష్టపడుతుంది. కరణ్‌ జోహార్‌ ఎంతో సహకరించారు. ఎంతో కష్టపడి తీసిన 'లైగర్‌' ఈ నెల 25న వస్తోంది. ఇది ఫుల్లీ లోడెడ్‌ మసాలా మూవీ అని అన్నారు.

సీనియ‌ర్ న‌టి ర‌మ్య‌కృష్ణ, వ‌ర‌ల్డ్ బాక్సింగ్ లెజెండ్ మైక్ టైస‌న్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. లైగ‌ర్‌ను ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్, పూరీ కనెక్ట్స్ బ్యాన‌ర్ల‌పై అపూర్వ మెహ‌తా, క‌ర‌ణ్ జోహార్, ఛార్మీ కౌర్‌, పూరీ జ‌గ‌న్నాథ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు, త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో థియేట‌ర్ల‌లో గ్రాండ్‌గా విడుద‌ల కానుంది లైగ‌ర్‌.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios