#Prabhas:ప్రభాస్ కొత్త సినిమా రేపే లాంచ్, హడావిడిగా వెనక అసలు విషయం ఇదీ

 ప్రభాస్ తన బిజీ షెడ్యూల్‌లో కూడా ప్రతి నెలా ఈ చిత్రానికి కొన్ని రోజులు కేటాయించి వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు ప్లాన్ చేశారట. థమన్ సంగీతం సమకూర్చనున్నారు.

 Prabhas,Maruthi film launch tomorrow


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) వరస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.   కేవలం తెలుగు దర్శకులే కాకుండా తమిళ, హిందీ డైరెక్టర్స్ సైతం డార్లింగ్‏తో మూవీస్ చేసేందుకు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ షూటింగ్ కంప్లీట్ చేసేసారు. మరో ప్రక్క ప్రాజెక్ట్ కె, సలార్ చిత్రాలు ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుండగా.. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించాల్సిన స్పిరిట్ చిత్రం త్వరలోనే ప్రారంభం కానుంది.  ఈ గ్యాప్ లో ఓ చిన్న చిత్రం చేస్తున్నారు ప్రభాస్.

రీసెంట్ గా పక్కా కమర్షియల్ చిత్రంతో పలకరించిన  దర్శకుడు మారుతి దర్శకత్వంలోనూ ఓ మూవీ చేయనున్నాడు ప్రభాస్. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమాపై లేటెస్ట్ ఓ  అప్డేట్స్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే... ఈ సినిమా రేపే లాంచ్ కానుంది. ఈ సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మించనున్నారు. ప్రస్తుతం ప్రభాస్ ఫారిన్ లో ఉన్నారు. దాంకో కొద్ది మంది యూనిట్ సభ్యులు, నిర్మాత, దర్శకుడు సమక్షంలో ఈ ఓపినింగ్ జరనుంది. త్వరలో మంచి రోజులు ఏమీ లేకపోవటం,మూఢం వస్తూండటంతో హడావిడిగా ఈ లాంచ్ చేస్తున్నట్లు సమాచారం. 

ఇక ప్రభాస్ ఇలా దర్శకుడు మారుతితో  సినిమా చేయటం ఫ్యాన్స్ లో చాలా మందికి ఇష్టం లేదు. దాంతో వారంతా సోషల్ మీడియాలో ఈ కాంబినేషన్ వద్దంటూ గత కొద్ది కాలంగా వరసగా తమ నిరసన తెలియచేస్తూనే ఉన్నారు. అయితే ప్రభాస్ మాట ఇస్తే వెనక్కి తిరగరు.

లేటేస్ట్ అప్డేట్ ప్రకారం సలార్ సినిమా పూర్తైన తర్వాత ప్రభాస్ మారుతి మూవీ షూటింగ్ స్టార్ట్ కానుందిట. ఈలోగా మారుతి స్క్రిప్టు వర్క్ పూర్తి చేస్తారు. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. ఇక సలార్ పూర్తైన వెంటనే డార్లింగ్..మారుతి మూవీ రెగ్యూలర్ షూట్ స్టార్ట్ కానుందని..ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు… స్క్రిప్ట్ వర్క్‏తో డైరెక్టర్ బిజీగా ఉన్నాడట. మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ రాబోతుందని తెలుస్తోంది. ఇటీవలే మ్యాచో హీరో గోపిచంద్ ప్రధాన పాత్రలో మారుతి తెరకెక్కించిన పక్కా కమర్షియల్ మూవీ ప్లాఫ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios