#Prabhas:మారుతి ప్రాజెక్టుకి ప్రభాస్ పెట్టిన కండీషన్ ? ముందు జాగ్రత్త

 ప్రభాస్, మారుతి కాంబినేషన్‌లోని సినిమా ప్రారంభోత్సవం   క్రితం బుధవారం హైదరాబాద్‌లో జరిగింది. టాలీవుడ్ లో ఇప్పుడిప్పుడు ఎదుగుతున్న ప్రముఖ చిత్ర నిర్మాణసంస్థ పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ కార్యాలయంలో పూజా కార్యక్రమాల జరిగాయి. 

 Prabhas condition to Director Maruti Movie


గత కొంతకాలంగా ప్రభాస్‌ హీరోగా మారుతి దర్శకత్వంలో ఓ సినిమా రూపుదిద్దుకోనుందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలు నిజమే. పక్కా కమర్షియల్ చిత్రం రిలీజ్ అయ్యాక ప్రాజెక్టు ఆగిపోతే బాగుండును అని చాలా మంది మ్రొక్కుకున్నారు కూడా. బాయ్ కాట్ మారుతి అంటూ ట్రెండ్ కూడా ట్విట్టర్ లో నడిచింది. ఏదైమైనా ...ఎవరు ఎలా స్పందించినా, ప్రభాస్, మారుతి కాంబినేషన్‌లోని సినిమా ప్రారంభోత్సవం మాత్రం క్రితం బుధవారం హైదరాబాద్‌లో జరిగింది. టాలీవుడ్ లో ఇప్పుడిప్పుడు ఎదుగుతున్న ప్రముఖ చిత్ర నిర్మాణసంస్థ పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ కార్యాలయంలో పూజా కార్యక్రమాల జరిగాయి. ఇటలీలో ఉండటంవల్ల ప్రభాస్‌ ఈ ప్రారంభోత్సవంలో పాల్గొనలేదు. ఇదిలా ఉండగా...ఈ ప్రాజెక్టు గురించి ఓ విషయం బయిటకు వచ్చింది. అది ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ ని ఆనందపరుస్తోంది. అదేమిటంటే...

ఈ సినిమా అతి తక్కువ షెడ్యూల్ లో పూర్తి అవుతుంది. మేజర్ షెడ్యూల్ రామోజీ  ఫిలిం సిటీలోనే ఉంటుందని తెలుస్తోంది. కాబట్టి మధ్యలో గ్యాప్ వచ్చే అవకాసం లేదు. అలాగే   ఈ సినిమాకి 50 కోట్లు బడ్జెట్ కేటాయించినట్లు సమాచారం. ఇక ఈ సినిమాకు ప్రభాస్ ఒకే ఒక కండీషన్ పెట్టారట. అదేమిటంటే....ఈ సినిమా కేవలం రీజనల్ గానే రిలీజ్ చేయాలి. సినిమా అద్బుతంగా ఉందని అనిపించి, ఇక్కడ వర్కవుట్ అవుతూనే దేశం మొత్తం డబ్ చేసి రిలీజ్ చేస్తారు. అంతేకానీ  ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అని పాన్ ఇండియాలో అయితే సినిమా రిలీజ్ చెయ్యకూడదు. తెలుగు వారికి తగ్గ కథ ఇది అని, కేవలం తెలుగు వారికోసమే ఈ సినిమాని ఓకే చేసారట ప్రభాస్. అందుకు నిర్మాత, మారుతి ఇద్దరు ఓకే చేసారట. ఇంతకు ముందు అనుకున్న నిర్మాత దానయ్య... ఈ కండీషన్ తోనే వెనక్కి తిరిగాడని సమాచారం.

ఇక ఇందులో డార్లింగ్ కి జోడీగా మాళవిక మోహనన్ ని ఎంపిక చేసారుట. హారర్‌–కామెడీ జానర్‌లో తెరకెక్కనున్న ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటించ నున్నారని, ‘రాజా డీలక్స్‌’ అనే టైటిల్‌ అనుకుంటున్నారనే ప్రచారం వినిపిస్తోంది.  ఇప్పటికే హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో ఓభారీ థియేటర్ సెట్ ని నిర్మించినట్లు తెలుస్తోంది. ఆ సెట్ కోసమే 6 కోట్లు కేటాయించారుట. కథ అంతా థియేటర్ చుట్టూనే తిరుగుతుంది కాబట్టి పెద్దగా లోకేషన్ల పని ఉండదని తెలుస్తోంది. సినిమా మొత్తం రెండు షెడ్యూల్స్ లో పూర్తిచేస్తారుట. ప్రభాస్ సినిమా కోసం తక్కువగానే డేట్లు కేటాయించినట్లు సమాచారం.

యూవీ క్రియేషన్స్-పీపూల్స్ మీడియా  ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం ప్రభాస్   సలార్..ప్రాజెక్ట్ కె చిత్రాల షూటింగ్ లో  బిజీగా ఉన్న సంగతి  తెలిసిందే. ఈ రెండింటి తర్వాత పూర్తిగా సందీప్ వంగ స్పిరిట్ చిత్రానికి  సమయం కేటాయిస్తారు. ఈ గ్యాప్ లోనే  డార్లింగ్ డీలక్స్ రాజా షూటింగ్ పూర్తి చేసి రిలీజ్ చేసే అవకాశం ఉంది.   
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios