మెల్లిగా మోహన్ బాబుని లాగుతున్న అల్లు అరవింద్
ఆహా పెట్టినప్పుడు అది మెగా హీరోల సినిమాలకు,షోలకు ఒక అడ్డాగా ఉండబోతోందని అందరూ భావించారు. కానీ అల్లు అరవింద్ తీసుకునే నిర్ణయాలు ప్రూవ్ చేస్తున్నాయి.
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ స్ట్రాటజీలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఆయన ఆలోచనలు చాలా వరకూ సక్సెస్ అవుతూంటాయి. అందుకే అరవింద్ ఏం చేస్తున్నారా అని మీడియా, ఇండస్ట్రీ ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచుతుంది. ఆయన ఇప్పుడు తన దృష్టి మొత్తం ఓటీటి ప్లాట్ ఫామ్ ఆహా పై పెట్టారు. ఆహా పెట్టినప్పుడు అది మెగా హీరోల సినిమాలకు,షోలకు ఒక అడ్డాగా ఉండబోతోందని అందరూ భావించారు. కానీ అల్లు అరవింద్ తీసుకునే నిర్ణయాలు ప్రూవ్ చేస్తున్నాయి. ఆయన తెలుగు ఓటీటి మార్కెట్ లో మేజర్ షేర్ ని పొందేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అందులో భాగంగా స్టార్స్ ని తీసుకొచ్చి వెబ్ సీరిస్ లు, టాక్ షోలు ప్లాన్ చేస్తున్నారు.
ఆ క్రమంలో ఇప్పటికే బాలయ్యతో ఓ టాక్ షో ప్లాన్ చేసారు. ఆ షో ప్రారంభం కాకముందే క్లిక్ అయ్యినంత క్రేజ్ తెచ్చుకుంది. దాంతో బాలయ్య ఫ్యాన్స్ అంతా ఆ షో కోసం ఆహా కు వస్తారు. అలాగే సమంతతో భారీగా ఓ వెబ్ సీరిస్ ప్లాన్ చేస్తున్నారు. ఫ్యామిలీ మ్యాన్ తర్వాత ఆమెకు వెబ్ మార్కెట్లో ఏర్పడ్డ క్రేజ్ తో ఈ సీరిస్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇక ఇప్పుడు అల్లు అరవింద్ మరో స్టెప్ వేయబోతున్నట్లు సమచారం. అదే మోహన్ బాబు నిసైతం తమ ఆహా కు తీసుకొచ్చే ప్రయత్నం.
Also read జబర్దస్త్ అవినాష్ పెళ్లి... హాజరైన బిగ్ బాస్ సెలబ్రిటీలు!
మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు మోహన్ బాబుతో అల్లు అరవింద్ ఓ వెబ్ సీరిస్ ప్లాన్ చేయబోతున్నారు. ఈ మేరకు టాక్స్ జరుగుతున్నాయి. తమిళ ఫిల్మ్ మేకర్ ఒకరు ఈ సీరిస్ నిమిత్తం కథ తో ఆహాని ఎప్రోచ్ అయ్యారని, సత్యరాజ్ తో చేద్దామని వాళ్ల ఆలోచన అయితే అల్లు అరవింద్ మాత్రం మోహన్ బాబు తో చేస్తే బాగుంటుందని చెప్పి టీమ్ తో ఎప్రోచ్ అవుతున్నట్లు సమచారం. ఇప్పటికే మంచు లక్ష్మి ఆహా లో ఓ షో చేస్తోంది. త్వరలోనే మోహన్ బాబు సైతం ఆహాతో చేతులు కలిపే అవకాసం ఉందని వినికిడి.
Also read మూడు ఛానళ్లపై పరువు నష్టం దావా.. సమంతకు కోపానికి కారణం అదే, కుప్పలు తెప్పలుగా రూమర్లు!