#Nithin:డిపాజిట్ దక్కలేదు...నిద్రలేని రాత్రులతో నితిన్, స్ట్రాంగ్ డెసిషన్?
సినిమా మార్నింగ్ షోకే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాపై అంతటా నెగిటివ్ కామెంట్స్ వినపడ్డాయి. రివ్యూలు చాలా దారుణంగా వచ్చాయి. పక్కా రొటీన్ మార్క్ ఫిల్మ్ అని తేల్చేసారు. ఈ నేపధ్యంలో....
సాధారణంగా హీరోలందరికీ తాము మాస్ హీరోలు అనిపించుకోవాలని కోరిక ఉంటుంది. అందుకోసం ప్రయత్నిస్తూంటారు. పాటలు, ఫైట్స్ తో జనాల్లోకి వెళ్లిపోవాలని కలలు కంటారు. అదే కోవలో హీరో నితిన్ ఇప్పటికే ఎన్నో సార్లు యాక్షన్ చిత్రాలు చేశారు. ఫలితం మాత్రం దక్కలేదు. ‘అఆ’, ‘ఇష్క్’, ‘గుండె జారీ గల్లంతయ్యిందే’ వంటి సక్సెస్ లు నితిన్ కి ఇంట్రస్ట్ గా అనిపించవు. యాక్షన్ హీరోగా, మాస్ హీరోగా నిలబడాలనేది లక్ష్యం తీరేటట్లు కనపడటం లేదు. ఆ విషయం మరోసారి మాచర్ల నియోజక వర్గంతో ప్రూవ్ అయ్యింది.
గత వారం విడుదలైన ‘మాచర్ల నియోజకవర్గం’ మార్నింగ్ షోకే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ రోజుతో మొదటి వారం పూర్తి చేసుకుంది. తండ్రి డిస్ట్రిబ్యూటర్ కాబట్టి చాలా ఏరియాల్లో సినిమాని ఈ వారం తియ్యకుండా ఉంచుతున్నారని అంటున్నారు. సినిమా థియేటర్ లో ఉంది కదా అని జనం వెళ్లటం లేదు. రెండో వారం దాక సినిమాని థియేటర్లలో ఉన్నా ఫలితం లేదు లేదు. మొదటి వారం ఈ సినిమా 10 కోట్ల కలెక్షను కూడా రాబట్టలేదు.
మాచర్ల నియోజకవర్గం 6 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఏరియా ల వారీగా..
ఏరియా కలెక్షన్స్
నైజాం 3.01కోట్లు
సీడెడ్ 1.43కోట్లు
ఉత్తరాంధ్ర 1.22కోట్లు
ఈస్ట్ 83లక్షలు
వెస్ట్ 38లక్షలు
గుంటూరు 88 లక్షలు
కృష్ణా 64లక్షలు
నెల్లూరు 44లక్షలు
ఏపీ అండ్ టీఎస్ 6 డేస్ షేర్: 8.83 కోట్లు
ఇతర ప్రాంతాల్లో 43లక్షలు
ఓవర్సీస్ 39లక్షలు
ప్రపంచ వ్యాప్తంగా 6 డేస్ కలెక్షన్స్ - 9.65 కోట్లు షేర్
ఈ సినిమా రిజల్ట్ చూసాక అయినా నితిన్ మరికొంతకాలం అయినా రొటీన్ ‘మాస్’మసాలా సినిమాల మాట మర్చిపోవాలి. ఫ్యామిలీ, రొమాన్స్, కామెడీ ఎలిమెంట్స్ తో కూడిన చిత్రాలు చేస్తేనే ఫలితం ఉంటుందని తేల్చి చెప్పినట్లు అయ్యింది. ఆ దిశగానే నితిన్ ఆలోచిస్తున్నట్లు, నిద్రలేని రాత్రులు గడుపుతున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. తన సినిమా కథలు మారకపోతే ఇక కష్టమని నితిన్ కు అర్దమైందంటున్నారు.