#Liger:బాయ్ కాట్‌ ట్రెండ్ కు కౌంటర్ గా కరుణ్ జోహార్ స్కెచ్

 కరణ్ జోహార్ పై సోషల్ మీడియాలో విపరీతమైన నెగిటివిటి ఉంది. కరణ్ జోహార్ పై ఉన్న వ్యతిరేకతని నెటిజెన్స్ లైగర్ మీద చూపిస్తున్నారు. లైగర్ మూవీ ని బాయ్ కాట్ చెయ్యాలంటూ #BoyCottLigerMovie  హాష్ టాగ్ ని ట్రెండింగ్ లోకి తెచ్చారు. 

 Liger Special Premiere is being planned in Mumbai

 


అమీర్ ఖాన్ లాల్‌సింగ్‌ చడ్డా మూవీతో మొదలైన  బాయ్ కాట్‌ సెగ.. ఆ తర్వాత రిలీజ్‌ అయ్యే సినిమాలకూ తగులుతున్న సంగతి తెలిసిందే. తాజాగా సోషల్‌ మీడియాలో 'లైగర్‌' మూవీకి  బాయ్ కాట్‌  ట్యాగ్‌లైన్‌ ట్రెండ్‌ అవుతుంది. అయితే ఈ ట్రెండ్ ఎంతవరకూ ఓపినింగ్స్ పై పడుతుందని చెప్పలేని పరిస్దితి. కాకపోతే ఈ ట్రెండ్ విషయమై విజయ్ కూడా వర్రీ అవుతున్నారని ఆయన మాటలని బట్టి అర్దమవుతోంది. అయితే సినిమా బాగుంటే ఎన్ని ట్రెండ్ లు వచ్చినా ఎవరూ ఏం చేయలేరనేది నిజం. ఈ నేపధ్యంలో  కొంతమంది నెటిజన్లు విజయ్ కి సపోర్టుగా నిలుస్తున్నారు. సినీ ఇండిస్టీలో ఎవరి సపోర్టు లేకుండానే విజయ్ ఈ స్థాయికి వచ్చారని తనకి మద్దతిస్తున్నారు. కాగా, ఆగస్టు 25న లైగర్‌ మూవీ విడుదల కానున్న నేపథ్యంలో సినీ ప్రమోషన్స్‌ జోరందుకున్నాయి. 

తమ సినిమాకి బాలీవుడ్ అండదండలు ఉంటే ఆ సినిమా నార్త్ లో మంచి ప్రమోషన్స్ చేసుకుని.. అక్కడి ప్రేక్షకులు ఆసక్తితో మంచి హిట్ అవుతుంది అని విజయ్ దేవరకొండ నమ్మారు. అందుకే విజయ్ దేవరకొండ కూడా కరణ్ జోహార్ ని తన ప్రాజెక్ట్ లోకి తీసుకువచ్చాడు. విజయ్ దేవరకొండ తో కరణ్ జోహార్ స్ట్రయిట్ బాలీవుడ్ మూవీ చేద్దామంటే.. దానికన్నా ముందు లైగర్ మూవీ కథ వినిపించి అందులో నిర్మాతగా కరణ్ ని చేర్చాడు. దానితో లైగర్ మూవీకి బాలీవుడ్ లో హెల్ప్ అవుతుంది.. మంచి ఓపెనింగ్స్ దక్కుతాయని విజయ్ దేవరకొండ తో పాటుగా పూరి కూడా అనుకున్నాడు.

 కానీ ఇప్పుడు కరణ్ జోహార్ లైగర్ కి హెల్ప్ అవడం అటుంచి.. అతని వల్ల నార్త్ లో ఓపెంగ్స్ దక్కేలా కనిపించడం లేదు. కారణం కరణ్ జోహార్ పై సోషల్ మీడియాలో విపరీతమైన నెగిటివిటి ఉంది. కరణ్ జోహార్ పై ఉన్న వ్యతిరేకతని నెటిజెన్స్ లైగర్ మీద చూపిస్తున్నారు. లైగర్ మూవీ ని బాయ్ కాట్ చెయ్యాలంటూ #BoyCottLigerMovie  హాష్ టాగ్ ని ట్రెండింగ్ లోకి తెచ్చారు. అది కేవలం కరణ్ జోహార్, హీరోయిన్ అనన్య పాండే పై ఉన్న వ్యతిరేఖత కారణంగానే అని అర్దమవుతోంది. అయితే దీనికి కరుణ్ జోహార్ ఓ ప్లాన్ చేసారని తెలుస్తోంది.

లైగర్ చిత్రం స్పెషల్ ప్రీమియర్ ని ముంబై లో 24 వ తేదీన భారీ ఎత్తున జరపాలని ఫిక్స్ అయ్యినట్లు సమాచారం. కరుణ్ జోహార్ కు ఉన్న పరిచయాలతో బాలీవుడ్ మొత్తం ఈ ప్రీమియర్ రానుంది. ఆ రకంగా మొత్తం బాలీవుడ్ సెలబ్రెటీల అండతో ఈ బోయ్ కాట్ ట్రెండ్ కు కౌంటర్ ఇద్దామని ప్లాన్ చేసారట. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయని తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ అంతా ఈ సినిమా చూసి, మాట్లాడేలా చేసి, వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేయాలని డిసైడ్ అయ్యినట్లు బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. మరి ఇది వర్కవుట్ అయితే మంచిదే. మరో ప్రక్క విజయ్ దేవరకొండ....తెలుగు కన్నా హిందీలో ఈ సినిమాని ఎలాగైనా సక్సెస్ చేయాలని ఓ రేంజిలో సీరియస్ గా ప్రమోట్ చేస్తున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios