#Liger: ‘లైగర్‌’ స్పెషల్ ఫ్యాన్స్ షో లు...ప్లానింగ్ లో టీమ్ ?

పూరీ జగన్నాథ్‌ డైరెక్ట్‌ చేసిన లైగర్‌ మూవీ ఆగస్టు 25న విడుదల కాబోతోంది. ఇందులో బాలీవుడ్‌ హీరోయిన్‌ అనన్యపాండే కథానాయికగా నటించింది. లైగర్‌ సినిమా  కోసం ఫ్యాన్స్ ఓ రేంజిలో ఎదురుచూస్తున్నారు.  ఈ నేపధ్యంలో స్పెషల్ ఫ్యాన్స్ షోలకు టీమ్ ప్లాన్ చేస్తున్నట్లు ఓ వార్త వైరల్ అవుతోంది.

Liger makers to have special fan shows?

ప్రస్తుతం ఎక్కడ చూసిన 'లైగర్‌' మూవీ జోరు కనిపిస్తోంది.రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ-పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 25న విడుదల కానుంది. బాక్సింగ్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలోలో విజయ్‌కు జోడీగా అనన్య పాండే నటించింది. పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా రిలీజ్‌ డేట్‌ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్‌ జోరు పెంచింది చిత్ర టీమ్. మరో ప్రక్క ఈ చిత్రంకు సంభందించిన ఓ వార్త  సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతోంది. 

ఈ సినిమాకు సంభందించిన స్పెషల్ ఫ్యాన్ షోలు 24  వ తేదీ మిడ్ నైట్ వేయబోతున్నారని ఈ వార్తల సారాంశం. అయితే ఈ విషయమై టీమ్ ఏమీ కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. నిజంగా కనుక అలాంటి షో ఉంటే ముందుగా ఫర్మిషన్ తీసుకుంటారు. ఆ వార్త ఖచ్చితంగా మీడియాలో వస్తుంది. లైగర్ పై దేశవ్యాప్తంగా ప్రస్తుతం భారీ స్థాయిలో హైప్ ఉంది. ముఖ్యంగా రౌడీ ఫ్యాన్స్ మాత్రమే కాదు, అటు సాధారణ ఆడియన్స్ సైతం లైగర్ రాక కోసం ఎదురు చూస్తున్నారు. ట్రైలర్, సాంగ్స్, టీజర్ లైగర్ పై మరింతగా అంచనాలు ఏర్పరచడంతో భారీ మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ మూవీ తప్పకుండా అందరి అంచనాలు అందుకుంటుందని అంటోంది యూనిట్.

పూరి జగన్నాథ్‌ మాట్లాడుతూ–‘‘ మీరందరూ ఒక్కొక్క టిక్కెట్‌ కొంటే చాలు మా సినిమా బ్లాక్‌బస్టర్‌. ఈ సినిమాలో విజయ్‌  ఇరగదీశాడు.. అనన్య చింపేసింది. రమ్యకృష్ణ ఉతికి ఆరేసింది. ఈ సినిమాలో హైలైట్‌ మైక్‌ టైసన్‌. ఈ సినిమా ఇంకా రిలీజ్‌ కాలేదు.. ఎంత వసూలు చేస్తుందో తెలియదు. ఇవన్నీ పక్కనపెట్టి ఇంతకంటే డబుల్‌ బడ్జెట్‌తో విజయ్‌తో ‘జనగణమణ’ సినిమా ఇప్పటికే ఒక షెడ్యూల్‌ కూడా పూర్తి చేశాం.. అది మా నమ్మకం’’ అన్నారు.

విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘నాకు అరవై ఏళ్లు వచ్చి, సినిమాలు మానేసి   ఇంట్లో కూర్చొని ఉన్నా కూడా ‘లైగర్‌’ ప్రమోషన్స్‌లో పాల్గొన్న 20రోజులు, మీ   (అభిమానులు) ప్రేమని మరచిపోలేను.. ఆలోచిస్తుంటాను. అంత స్ట్రాంగ్‌ మెమొరీ నాకు ఇచ్చారు. అంతే మెమొరీ మీకు తిరిగి ఇవ్వడం నా బాధ్యత. మీకు గుర్తుండిపోయే సినిమా ‘లైగర్‌’. ఈ సినిమాకి మూడేళ్లు పట్టింది. ఈ చిత్ర  కుమ్మేస్తుంది. ఆగస్టు 25న మీరు (అభిమానులు) షేక్‌ చేయాలి’’ అన్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios