#Bimbisara2:'బింబిసార' పెద్ద హిట్,కానీ కళ్యాణ్ రామ్ కు మిగిలింది అంతే?

కళ్యాణ్ రామ్ బింబిసార సినిమాతో మంచి విజయాన్ని సాధించాడు. ఫాంట‌సీ యాక్ష‌న్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ సినిమా భారీ విజయం సాధించింది. మొదటి వారం లోపే సినిమాకి పెట్టిన బడ్జెట్ కలెక్షన్ల రూపంలో వచ్చేసింది.  కానీ ఆ మొత్తం కళ్యాణ్ రామ్ కు చేరింది...ఎంత లాభం వచ్చింది... 

Is Kalyan Ram get profit from Bimbisara?


సినిమా లెక్కలు ఎప్పుడూ విచిత్రంగా ఉంటాయి. సినిమా హిట్ అయినా సూపర్ హిట్ అయినా ఒక్కోసారి నిర్మాతకు పెద్దగా మిగిలేది ఏమీ ఉండదు. సినిమాని కొనుక్కున్న వాళ్లు లాభ పడతారు ...కాని నిర్మాతకు పెద్ద సున్నా మిగులుతుంది. అయితే మార్కెట్లో గుడ్ విల్ క్రియేట్ అవుతుంది. అదే పద్దతిలో ఇప్పుడు  నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన బింబిసార సినిమాకు జరిగిందని ట్రేడ్ వర్గాల్లో వినపడుతోంది.

అందుతున్న సమాచారం మేరకు... బింబిసార  సినిమా ను 40 కోట్ల రూపాయల బడ్జెట్ తో నందమూరి కళ్యాణ్ రామ్ స్వయంగా నిర్మించాడు. కానీ కళ్యాణ్ రామ్ కు వరస ఫ్లాఫ్ లు ఉండటం, డైరక్టర్ కొత్తవాడు కావటంతో  ఏ ఒక్క డిస్ట్రిబ్యూటర్ కూడా సినిమాను కొనుగోలు చేసేందుకు ముందుకు రాలేదు. దాంతో దిల్ రాజు కు సినిమాను చూపించి అతి తక్కువ ధరకు ఆయనకు అమ్మినట్లు వినపడుతోంది. దిల్ రాజు ఈ సినిమాను కేవలం రూ. 16 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసాడంటున్నారు.  

అయితే ఊహించని విధంగా సినిమా పెద్ద హిట్టైంది. ఈ సినిమా దాదాపుగా 50 కోట్ల రూపాయల వసూళ్లను దక్కించుకుంది. అందులో దిల్ రాజుకి భారీ మొత్తం లాభాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. దాంతో నిర్మాతగా  నందమూరి కళ్యాణ్ రామ్ కి పెద్దగా లాభం రాలేదు. సినిమా కి 40 కోట్లకు పైగా ఖర్చు చేసి నిర్మించిన కారణంగా థియేటర్ రిలీజ్ ద్వారా పాతిక నుండి 16 కోట్లు, ఓటీటి మరియు ఇతర రైట్స్ ద్వారా మరో రూ. 15 కోట్ల వరకు వచ్చినట్లుగా సమాచారం అందుతుంది. మిగతావన్నీ కలిసి మొత్తంగా సినిమా పెట్టిన పెట్టుబడి వెనక్కు రాబట్టింది కానీ నందమూరి కళ్యాణ్ రామ్ కి లాభాలను అయితే తెచ్చిపెట్ట లేదని  అంటున్నారు.

అయితే ఇప్పుడు ఆయన బింబిసార 2 తో పూర్తిగా రికవరీ అవ్వనున్నారు.  ప్రస్తుతం నందమూరి కళ్యాణ్ రామ్ బింబిసార 2 సినిమాకు సంబంధించిన వర్కులో బిజీగా ఉన్నాడు. ఆ సినిమాకు దాదాపుగా రూ. 50 కోట్ల వరకు ఖర్చు చేయాలని కళ్యాణ్ రామ్ భావిస్తున్నట్లు సమాచారం. బింబిసార హిట్ అయ్యింది కాబట్టి ఈ సెకండ్ పార్ట్ సినిమా ను 40 నుండి 50 కోట్ల వరకు థియేట్రికల్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ను చేసే అవకాసం ఉంది. ఓటిటికు కూడా మంచి రేటు వస్తుంది. దాంతో ఖచ్చితంగా ఈ సీక్వెల్  సినిమాతో భారీ ఎత్తున లాభాలను దక్కించుకుంటాడని ట్రేడ్ నమ్మకంగా ఉంది.  ఈ పార్ట్ 2 చిత్రం అక్టోబర్ నుంచి మొదలు కానుంది. సీక్వెల్ కాదని ప్రీక్వెల్ అని తెలుస్తోంది. లేడీ విలన్ కీలక పాత్ర పోషించబోతోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.

పార్ట్ 2 లో.. అస‌లు బింబిసారుడు ఎవ‌రు? త‌న త‌మ్ముడిని ఎందుకు చంపాలి అనుకున్నాడు? బింబిసార విల‌న్‌గా మార‌డానికి కార‌ణం ఏంటి? త‌న చిన్నప్పటి జీవితం గురించి ఉంటుందని చెప్పాడు. ఈ స్టోరీ లైన్ మీదే ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలైపోయింది అని తెలిపాడు. ‘బింబిసార-2′ మరింత విజువ‌ల్‌ గ్రాండియ‌ర్‌గా ఉండ‌బోతుంది అని కూడా చెప్పడంతో ఇప్పట్నుంచే పార్ట్‌-2 పై ప్రేక్ష‌కుల‌లో అంచనాలు నెలకొన్నాయి.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios