ఎన్నో అంచనాలతో సినిమా థియేటర్లకు వెళ్లిన అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురయ్యింది. మొత్తంగా సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. రిలీజ్ కు ముందే ఓటీటీలో భారీ ఆఫర్ వచ్చినా థియేటర్‌లో అంతకుమించి వసూళ్లు సాధిస్తామని మూవీ యూనిట్ ధీమా వ్యక్తం చేసింది. ప్రస్తుతం సీన్ రివర్స్ అయింది.
ఒక హీరో చేద్దామనుకున్న సినిమా రకరకాల కారణాలతో మరో హీరో దగ్గరకు వెళ్తుంది. అలా వెళ్లినప్పుడు ఆ సినిమా వర్కవుట్ కాకపోతే...సదరు హీరో కు పెద్ద డిజాస్టర్ తప్పిన ఫీలింగ్ వస్తుంది. అలాంటివి చాలా సార్లు ఇండస్ట్రీలో జరుగుతూంటుంది. రీసెంట్ గా నాగార్జున చెయ్యాల్సిన రామారావు ఆన్ డ్యూటీ సినిమాని రవితేజ చేసాడు. పెద్ద ప్లాఫ్ అయ్యింది. అదే మాదిరిగా హీరోలు వదులుకున్న సినిమాలు ...వేరే హీరోతో సూపర్ హిట్ అవుతూంటాయి. అప్పుడు ప్రాణం చివుక్కుమంటుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే ఎన్టీఆర్ ఓ పెద్ద డిజాస్టర్ ని తప్పించుకున్నారని ఫిల్మ్ నగర్ వర్గాల కథనం. సోషల్ మీడియాలోనూ ఈ విషయం హల్ చల్ చేస్తోంది.
అందుతున్న సమాచారం మేరకు...పూరి జగన్నాథ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన టెంపర్ సూపర్ హిట్ అవ్వటంతో ... 2017 లో మరో సారి ఇదే కాంబోలో సినిమా చేద్దామమనుకున్నారు. ఆ సినిమా టైటిల్ భాక్సర్. అయితే రకరకాల కారణాలతో ఆ ప్రాజెక్టు ముందుకు వెళ్లలేదు. ఎన్టీఆర్ దర్శకుడు బాబితో కలిసి జై లవకుశ చిత్రం చేసారు. ఆ సినిమా మంచి విజయం సాధించింది. ఇప్పుడు ఆ విషయం మరో సారి బయిటకు వచ్చింది.
అప్పట్లో పూరి జగన్నాథ్ ..భాక్సర్ పేరుతో చేద్దామనుకున్న స్క్రిప్టు మరేదో కాదుట. అదే లైగర్ అంటున్నారు. ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్ అవటంతో పూరి జగన్నాథ్ కొన్ని మార్పులు చేసి అదే కథను విజయ్ దేవరకొండకు చెప్పటం జరిగిందిట. అందుకే జై లవకుశలో హీరో ఉన్న నత్తిని...అప్పట్లో పూరి స్క్రిప్టులో నత్తి హీరో కథ నుంచి తీసుకున్నాడని అప్పుడు మీడియాలో ఓ రేంజిలో ప్రచారం జరిగింది. అదంతా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానులు ...లైగర్ తమ హీరోతో చేయకపోవటం మంచిదైందని అంటున్నారు. ఎన్టీఆర్ అప్పట్లోనో ఈ కథలో విషయం లేదని రిజెక్ట్ చేసాడని అంటున్నారు. చేసి ఉంటే ఎన్టీఆర్ కెరీర్ లో భయంకరమైన డిజాస్టర్ వచ్చేదని,లైఫ్ లాంగ్ యాంటి ఫ్యాన్స్ ట్రోలింగ్ చేస్తూనే ఉందురని, ఆ ప్రమాదం తప్పిపోయిందని చెప్తున్నారు.
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా పాన్ ఇండియన్ మూవీగా ‘లైగర్’ తెరకెక్కింది. రౌడీ హీరో సరసన అనన్య పాండే హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రికార్డులను బద్దలు కొడుకుంది అని సినీ జనాలు భావించినా.. అట్టర్ ఫ్లాపై అందిరినీ షాక్ కు గురిచేసింది. అటు విజయ్, పూరి కాంబోలో ‘జన గణ మణ’ సినిమా తెరకెక్కుతుంది. లైగర్ ప్రభావం ఈ సినిమా మీద భారీగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
