#Bimbisara:మూడు కోట్లు సరే, ఎగ్రిమెంట్ సంగతేంటి?
బింబిసార సినిమాకు దర్శకుడు వశిష్ట ఎంత పారితోషికం తీసుకున్నాడు అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారుతొంది. ఇక అతనికి ఒక ఫిక్స్ అమౌంట్ అయితే ఏమీ ఇవ్వలేదట. షూటింగ్ జరుగుతున్నన్ని రోజులు కూడా నెలకు ఇంత అని జీతం మాదిరిగా ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
తెలుగులో ఒక్క హిట్ ఇస్తే చాలు ...ఆ డైరక్టర్ రెమ్యునరేషన్ ఒక్కసారిగా ఊహించని మొత్తానికి పెరిగిపోతుంది. నిర్మాతలు అంతా ఆ డైరక్టర్ చుట్టూ ప్రదక్షణాలు చేస్తూంటారు. ఇప్పుడు బింబిసార దర్శకుడు వశిష్ట పరిస్దితి అదే అంటున్నారు.
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన సోసియో ఫాంటసీ చిత్రం `బింబిసార` ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై హరికృష్ణ నిర్మించిన ఈ సినిమాతో శ్రీ వశిష్ఠ్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. కేథరిన్ థ్రెసా, సంయుక్త మీనన్ ఇందులో హీరోయిన్లుగా నటించారు. ఆగస్టు 5న రిలీజ్ అయిన ఈ చిత్రం.. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో బీభత్సం సృష్టించింది.
డబ్యూ మూవీ అయినప్పటికీ.. `బింబిసార`ను అద్భుతంగా తెరకెక్కించి వశిష్ఠ్ విమర్శకుల నుండి ప్రశంసలు అందుకున్నారు. ఇకపోతే `బింబిసార`కు సీక్వెల్ ఉంటుందని విడుదలకు ముందే మేకర్స్ ప్రకటించారు. డైరెక్టర్ వశిష్ఠ్ `బింబిసార 2`కు కళ్లు చెదిరే రెమ్యునరేషన్ డిమాండ్ చేశాడని వినిపిస్తోంది. బింబిసార సినిమాకు వశిష్ఠ్ తక్కువ పారితోషికానికే పని చేశారు. కేవలం జీతం ఇచ్చారట. అయితే ఈ సినిమా ఊహించని రీతిలో సక్సెస్ అయింది. అందుకే వశిష్ఠ్ `బింబిసార 2`కు రూ. 3 కోట్లు రెమ్యునరేషన్‌ను డిమాండ్ చేశాడని వార్తలు వస్తున్నాయి.
అదే సమయంలో బింబిసార సినిమా ప్రారంభం సమయంలో ...బింబిసార 2 చేస్తే రెమ్యునరేషన్ ఎంత ఉండాలనే విషయమై ఎగ్రిమెంట్ ఉందని, ఇప్పుడు వేరే ఆఫర్స్ వచ్చినా బయిట చేయడని, ఎగ్రిమెంట్ లో ఎంత ఉందో అంతకే చేస్తాడంటున్నారు. అయితే అది మూడు కోట్లు మాత్రం ఉండదని, మీడియా హైప్ అని మాత్రమే ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి. ఏది నిజమే డైరక్టర్ కు, కళ్యాణ్ రామ్ కు తప్ప వేరే బయిట వాళ్లకు తెలిసే అవకాసం మాత్రం లేదు.