MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Telangana
  • వీడు మామూలోడు కాదు గురూ... కోడి మాంసంతో నెమలి కూర వండేసాడు..!!

వీడు మామూలోడు కాదు గురూ... కోడి మాంసంతో నెమలి కూర వండేసాడు..!!

కోడి మాంసంతో రుచికరమైన చికెన్ వండటంగురించి అదరికీ తెెలుసు. కానీ కోడి మాంసంతో నెమలి కూరను వండేసాడో యూట్యూబర్. అదెలాగో యూట్యూబ్ లో వీడియో కూడా పెట్టేసాడు. 

2 Min read
Author : Arun Kumar P
| Updated : Aug 13 2024, 05:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Peacock Curry

Peacock Curry

Peacock : యూట్యూబ్ రాకతో ప్రతి ఒక్కరిలో నటులు మేల్కొన్నారు... ఈ వీడియోల ద్వారా చాలామంది ట్యాలెంట్ బయటకు వచ్చింది. ఇలా యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని ప్రజలను ఎంటర్టైన్ చేసేవారు, ఎడ్యుకేట్ చేసేవారు చాలామంది వున్నారు. ఇది మంచి పరిణామమే. కానీ ఇదే సమయంలో యూట్యూబ్ లో కేవలం వ్యూస్ కోసం ఎంతకయినా తెగించే బ్యాచ్ ఒకటి తయారయ్యింది. ఏది పడితే అది వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టేస్తున్నారు... ఇందులో చాలా ప్రమాదకరం, అసభ్యకరమైన వీడియోలు కూడా వుంటున్నాయి.  తాజాగా ఇలాంటి ఓ యూట్యూబర్ ఏకంగా భారత జాతీయ పక్షి నెమలి కూరను వండుతున్న వీడియోను యూట్యూబ్ లో పెట్టేసాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Peacock Curry

Peacock Curry

ఏ కోడినో,మేకనో, చేపనో కోసినంత ఈజీగా భారత జాతీయ పక్షి నెమలిని కోసేసినట్లుగా బిల్డప్ ఇచ్చాడు సదరు యూట్యూబర్. చికెన్, మటన్ ఎలా వండాలో అందరికీ తెలుసు... కొత్తగా వుండాలంటే ఎవరూ చేయంది చేయాలనుకుని నెమలి కూర వండేసాడు. ఇదంతా వీడియోతీసి యూట్యూబ్ లో పెట్టేసాడు. ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో సదరు యూట్యూబర్ జైలుపాలయ్యాడు. ఇలా అతడు అనుకున్నట్లే ఫేమస్ అయ్యాడు... కానీ నెమలి కూర వల్ల కాదు అరెస్ట్ కావడం వల్ల. ఈ యూట్యూబ్ వీడియో వ్యవహారం తెలంగాణలో వెలుగుచూసింది. 
 

35
Peacock Curry

Peacock Curry

నెమలి కూర యూట్యూబ్ వీడియో కథేంటి..?

తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలో కోడం ప్రణయ్ కుమార్ యూట్యూబర్. చాలామంది మాదిరిగానే వంట వీడియోలను చేసేవాడు... వాటిని తన 'శ్రీటీవి' ఛానల్ లో పెట్టుకునేవాడు. అయితే చాలాకాలంగా యూట్యూబ్ వీడియోలు చేస్తున్నా అనుకున్నస్థాయిలో అతడు సక్సెస్ కాలేకపోయాడు. అతడి చేసే వంట వీడియోలకు వ్యూస్ రావడంలేదు... ఛానల్ సబ్ స్క్రైబర్లు పెరగడం లేదు. 
 

45
peacock curry

peacock curry

చాలాకాలంగా తాను చేసే సాధారణ వంట వీడియోలు అనుకున్న స్థాయిలో ప్రజల్లోకి వెళ్లకపోవడంతో ఈసారి ఏదయినా కొత్తగా చేయాలని భావించాడు. అందులో భాగంగానే గత శనివారం భారత జాతీయ పక్షి నెమలి కూరను వండడానికి సిద్దమయ్యాడు. నెమలి మాంసంతో రుచికరమైన కూర రెడీ చేసినట్లుగా ఓ వీడియో తీసి తన శ్రీటీవి యూట్యూబ్ ఛానల్లో పెట్టుకున్నాడు. 'ట్రెడిషనల్ ఫికాక్ కర్రీ రెసిపీ' అంటూ ప్రణయ్ పెట్టిన యూట్యూబ్ వీడియో వైరల్ గా మారింది. దీంతో ఈ వీడియో అటవీ అదికారుల దృష్టికి వెళ్లింది.  

జాతీయ పక్షిని నెమలి మాంసంతో కూర వండినట్లుగా యూట్యూబ్ లో వీడియో పెట్టిన ప్రణయ్ కుమార్ ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతడి ఇంట్లో లభించిన కూరను కూడా స్వాధీనం చేసుకున్నారు. అది నిజంగానే నెమలి మాంసమేనా అన్నది నిర్దారించేందుకు ల్యాబ్ కు పంపినట్లు అటవీ అధికారులు తెలిపారు. 

55
peacock curry

peacock curry

నెమలి కూర వీడియోపై యూట్యూబర్ ట్విస్ట్ : 

యూట్యూబ్ లో పెట్టిన నెమలి కూర వీడియోపై ప్రణయ్ కుమార్ ట్విస్ట్ ఇచ్చాడు. అది నెమలి మాంసం కాదు....  కోడి మాంసమని చల్లగా బయటపెట్టాడు. యూట్యూబ్ లో వ్యూస్ కోసమే కోడి మాంసంతో కూర వండి నెమలి మాంసంగా బిల్డప్ ఇచ్చాడట. అటవీ అధికారులు కూడా అతడి ఇంట్లో నెమలిని చంపిన ఆనవాళ్ళు ఏమీ లేవన్నారు. కోడి ఈకలు మాత్రం లభించాయి... కాబట్టి అతడు వండింది చికెన్ అయివుంటుందని అనుమానిస్తున్నట్లు  తెలిపారు. టెస్టుల్లో అది నెమలి మాంసం అని తేలితేమాత్రం సదరు యూట్యూబర్ ను కఠినంగా శిక్షిస్తామని హెచ్చరిస్తున్నారు.

యూట్యూబ్ వీడియోలో పిచ్చిలో ఎంతకు తెగించాడు... కోడికూరను నెమలికూర చేసేసాడంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. జాతీయ దినోత్సవం వేళ జాతీయ పక్షి నెమలి కూర వీడియో వ్యవహారం దుమారం రేపింది.   
 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్‌ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ... ఎందుకో తెలుసా?
Recommended image2
School Holidays : విద్యార్థులు, ఉద్యోగులు ఎగిరిగంతేసే మ్యాటర్.. వినాయక నిమజ్జనానికి మూడ్రోజులు సెలవులే
Recommended image3
ఒక‌ప్పుడు గ్రామీణ ప్రాంతం, ఇప్పుడు అభివృద్ధికి కేరాఫ్‌.. జెడ్ స్పీడ్‌తో దూసుకెళ్తున్న హైదరాబాద్‌లోని ఈ ప్రాంతం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved