MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Telangana
  • భర్త జల్సాలకు అలవాటు పడి.. అప్పులు చేస్తున్నాడని.. సుపారీ ఇచ్చి హత్య చేయించిన భార్య..

భర్త జల్సాలకు అలవాటు పడి.. అప్పులు చేస్తున్నాడని.. సుపారీ ఇచ్చి హత్య చేయించిన భార్య..

భర్త జల్సాలకు అలవాటు పడి.. అప్పులు చేస్తూ ఇంటిని పట్టించుకోవడంలేదని విసుగుచెందిన ఓ భార్య దారుణానికి ఒడిగట్టింది. సుపారీ ఇచ్చి మరీ అతడిని హత్య చేయించింది. 

2 Min read
Author : Bukka Sumabala
Published : Jul 01 2023, 11:42 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

నల్గొండ : నాలుగు రోజుల క్రితం నల్గొండలో జరిగిన హత్యోదాంతంలో భార్య నిందితురాలిగా తేలడంతో అందరూ నివ్వెరపోయారు. పట్టణ శివారులోని మిషన్ కాంపౌండ్ దగ్గర రఘురాములు అనే వ్యక్తి హత్య జరిగింది. అతడి హత్యకు భార్యే కారణమని తేలింది. దేవరకొండ పోలీస్ కార్యాలయంలో డిఎస్పి నాగేశ్వరరావు ఈ హత్యకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

రఘురాములు స్టాంప్ వెండర్ గా పనిచేస్తున్నాడు. నగరంలోని విష్ణు కాంప్లెక్స్ లో కిడ్స్ వేర్ దుకాణం కూడా ప్రారంభించాడు. ఈ దుకాణం బాధ్యతను భార్య శ్రీలక్ష్మి చూసుకునేది. అటు ఉద్యోగం, ఇటు దుకాణంతో రఘురాములు జల్సాలకు అలవాటుపడ్డాడు. అప్పులు  చేయడం మొదలుపెట్టాడు. కుటుంబాన్ని పట్టించుకోవడం లేదు. కిడ్స్ వేర్ బాధ్యత చూసుకుంటున్న శ్రీలక్ష్మికి ఇది చాలా విసుగును పుట్టించింది. భర్త ప్రవర్తన ఎప్పటికీ మారకపోవడంతో అతడిని అంతమొందించాలని భావించింది.

36

దీనికోసం హైదరాబాదులో ఉంటున్న స్నేహితురాలి భర్తతో పరిచయం పెంచుకుంది. భర్తను చంపడం కోసం అతడి సహాయం కావాలని కోరింది. దీనికోసం అతనితో ఇంస్టాగ్రామ్ కాల్ లో మాట్లాడేది. అలా చిలక రాజు అరుణ్ అనే అతనితో భర్తను చంపడం కోసం రూ.5 లక్షలకు  సుపారి మాట్లాడుకుంది. 

46

పథకంలో భాగంగా చిలక రాజు అరుణ్ దగ్గర తన భర్త రఘురాములకు అప్పు ఇప్పించింది. వారిద్దరూ పరిచయమై దగ్గరయ్యేలా చూసింది.   ఇక అతడిని చంపే పథకంలో భాగంగా.. మూడు నెలల క్రితం రఘురాములకు మధ్యంలో టాబ్లెట్ కలిపి ఇచ్చింది. కానీ అది పనిచేయలేదు. ఆ తర్వాత రెండోసారి ఓ వాహనంతో ఢీ కొట్టి చంపాలని ప్రయత్నించినా..  దానికి ఎక్కువ డబ్బులవుతాయని వెనకాడారు. 

56

చివరికి జూన్ 26వ తేదీన చిలక రాజు అరుణ్ తన స్నేహితులు హైదరాబాదులోని సంతోష్ నగర్ కు చెందిన ముక్కెర భాను,  సరూర్నగర్ కు చెందిన పెనుగొండ రవితేజలతోపాటు మరో గుర్తు తెలియని మహిళతో కలిసి దేవరకొండకు వచ్చారు. ఆ తర్వాత తన దగ్గర తీసుకున్నరూ.50వేలు కావాలని రఘురాములుకి ఫోన్ చేశాడు.అతను స్కూటీ మీద మిషన్ కాంపౌండ్ దగ్గరికి వచ్చిన తర్వాత అతనితో గొడవపడి.. బండి మీద నుంచి కింద పడేశారు. 

66

ఆ తర్వాత కదలకుండా చేసి రఘురాములు నోట్లో, ముక్కులో అరుణ్ సైనేడ్ పోశాడు. దీంతో రఘురాములు ఊపిరాడక చనిపోయాడు. ఆ తర్వాత అక్కడి నుంచి హైదరాబాద్ కు పారిపోయారు. రాత్రి 10 గంటల సమయంలో శ్రీలక్ష్మికి ఇన్స్టాగ్రామ్ కాల్ చేసి నీ భర్తను హత్య చేశామని అరుణ్ చెప్పాడు.  రఘురాములు  హత్య విషయంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులు భార్యను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా ఈమెరకు వివరాలు తెలిసాయి. 

About the Author

BS
Bukka Sumabala

Latest Videos
Recommended Stories
Recommended image1
RTC: తెలంగాణ ఆర్టీసీ మ‌రో కీల‌క నిర్ణ‌యం.. ఇక‌పై బ‌స్సుల్లో మెట్రో త‌ర‌హా ఏర్పాట్లు
Recommended image2
హైద‌రాబాద్‌లో రూ. 70 వేల కోట్ల‌తో భారీ ఏఐ డేటా సెంట‌ర్‌.. ఈ ప్రాంత రూపురేఖ‌లు మార‌డం ఖాయం
Recommended image3
Now Playing
దుమ్ములేపే స్పీచ్ CM Revath Reddy Next Level Speech At Teachers Day Meeting | Asianet Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved