- Home
- Telangana
- చరిత్రలో మొట్టమొదట తెలుగులో మాట్లాడింది ఎవరు, ఎక్కడో తెలుసా? టాప్ 5 తెలుగు విశేషాలు, వ్యక్తులు
చరిత్రలో మొట్టమొదట తెలుగులో మాట్లాడింది ఎవరు, ఎక్కడో తెలుసా? టాప్ 5 తెలుగు విశేషాలు, వ్యక్తులు
తెలుగువారి చరిత్ర చాలా గణమైనది. ఈ గడ్డపై పుట్టిన మహనీయులు చరిత్రపుటల్లో తమకంటూ ప్రత్యేక ఫేజీలను దక్కించుకున్నారు. ఇలాంటి తెలుగు మహనీయుల, విశేషాల గురించి తెలుసుకుందాం.

చరిత్రలో మొదటి తెలుగువారు...
తెలుగు రాష్ట్రాలు వేరు కావచ్చు... కానీ ప్రజలు మాత్రం ఒకటే. వివిధ కారణాలతో ఉమ్మడి రాష్ట్రం విడిపోయింది... కానీ తెలుగు భాష మాత్రం విడిపోలేదు... ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో మాట్లాడేది తెలుగే. ఇరురాష్ట్రాల మధ్య నిధులు, నీళ్ల విషయంలో విబేధాలుండవచ్చు... యాస, సంస్కృతి సాంప్రదాయాల్లో కొంచెం తేడాలు ఉండవచ్చు... కానీ తెలుగువాళ్లు అనే పదం రెండురాష్ట్రాల ప్రజలను ఒక్కటిచేస్తుంది. తెలుగు భాష, తెలుగు మహనీయుల గురించి ఎక్కడైనా చదివినా, ఎప్పుడైనా విన్నా ప్రతి తెలుగోడు గర్వపడతాడు. ఇలా తెలుగోళ్లకు సంబంధించి చరిత్రలో కొన్ని ముఖ్యమైన విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
1. చరిత్రలో మొదట తెలుగు మాట్లాడింది ఎవరు, ఎక్కడో తెలుసాా?
'దేశ భాషలందు తెలుగు లెస్స' అని ఇతర ప్రాంతాల రాజుల నుండి ప్రశంసలు పొందిన కమ్మనైన భాష తెలుగు. ఈ తెలుగు భాష చరిత్ర చాలా ఘనమైనది... దాదాపు 2,400 సంవత్సరాల ప్రాచీనమైనది. మొట్టమొదటి తెలుగు మాట్లాడింది శాతవాహనుల కాలంలో అని చరిత్ర చెబుతోంది. వీరి కాలంలో రచించిన 'గాథాసప్తశతి" అనే మహారాష్ట్రీ ప్రాకృత పద్య సంకలనంలో తెలుగు పదాలు మొట్టమొదట కనిపించాయి. కాబట్టి శాతవాహనుల కాలంలో గోదావరి, కృష్ణా నదులు పరివాహక ప్రాంతంలో తెలుగువారు ఉండేవారని... వారే మొట్టమొదట తెలుగు భాషను మాట్లాడారని చరిత్ర చెబుతోంది.
మొద్దమొదటి తెలుగు కవి ఎవరు?
తెలుగు సాహిత్యంలో నన్నయ్యను ఆదికవిగా పేర్కొంటారు... ఆయనే మొదటి తెలుగు కవి. మహభారతాన్ని రచించిన ముగ్గురు కవులతో నన్నయ్య మొదటివారు. ఈ మహాభారతమే తెలుగులో మొదటి రచనగా ప్రసిద్దిచెందింది. ఈయన రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి.
భారత దేశానికి మొదటి తెలుగు రాష్ట్రపతి ఎవరు?
ఇప్పటివరకు భారతదేశంలోనే అత్యన్నత పదవిలో అంటే రాష్ట్రపతిగా పనిచేసిన ఏకైక తెలుగు నాయకుడు నీలం సంజీవరెడ్డి. ఈయన ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. నీలం సంజీవరెడ్డి తెలుగు రాజకీయాల్లోనే కాదు దేశ రాజకీయాల్లోనూ కీలకంగా వ్యవహరించిన నాయకుడు... ఈయన లోక్ సభ స్పీకర్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కూడా కీలక బాధ్యతలు నిర్వర్తించారు.
నీలం సంజీవరెడ్డి స్వస్థలం అనంతపురం జిల్లా ఇల్లూరు గ్రామం. 1913, మే 18న సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన సంజీవరెడ్డి తెలుగువారు గర్వించేస్థాయికి ఎదిగారు. 1996 లో ఈయన మరణించారు.
మొట్టమొదటి తెలుగు ప్రధాని ఎవరు?
పాములపర్తి వెంకట నరసింహరావు (PV నరసింహారావు)... ఈ పేరు తెలుగు ప్రజలకు సుపరిచితమే. భారత ప్రధానిగా పనిచేసిన మొదటి, ఏకైక తెలుగు వ్యక్తి నరసింహారావు... దక్షిణాది రాష్ట్రాల నుండి కూడా ఈయనే మొదటివారు. ఈయన ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా పనిచేశారు. భారతరత్న పొందిన మొదటి తెలుగు వ్యక్తి కూడా పివి నరసింహారావే. ఈయన స్వస్థలం ఆనాటి ఆంధ్ర ప్రదేశ్ (ప్రస్తుత తెలంగాణ) లోని వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లి... 1921 జూన్ 28న ఓ సాధారణ వ్యవసాయ కుటుంబలో జన్మించారు.
ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి ఎవరు?
స్వాతంత్య్ర సమరయోధులు టంగుటూరి ప్రకాశం పంతులు ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగా పనిచేశారు. మద్రాసు రాష్ట్రం నుండి తెలుగు మాట్లాడేవారితో 1953 లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది... దీనికి మొదటి సీఎం ఈయనే. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈయన మద్రాస్ రాష్ట్రానికి కూడా కొన్నాళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు.