వాతావరణం : ఫిబ్రవరిలోనే మార్చి ఎండలు ... ఇక్కడ ఉష్ణోగ్రత 38°C చేరింది
తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే వేసవి వాతావరణం కనిపిస్తోంది. నడి వేసవిలో నమోదయ్యే అత్యధిక ఉష్ణోగ్రతలు ఇప్పుడే నమోదవుతున్నాయి. అక్కడ ఏకంగా 38 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదవుతోంది.

Today Weather Updates in Telugu States
Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే ఎండలు మండిపోతున్నాయి. శీతాకాలం ఇంకా చివరిదశలో ఉంది... సాధారణంగా మార్చిలో వేసవి ప్రారంభం అవుతుంది. కానీ ఫిబ్రవరిలోనే వేసవిని తలపించేలా ఎండలు కాస్తున్నాయి. మధ్యాహ్నం సమయంలో ఇళ్లలోంచి బయటకు రావాలంటే ప్రజలు జంకేలా ప్రస్తుతం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
నేటి తెలంగాణ వాతావరణ సమాచారం :
ఫిబ్రవరి 20 (గురువారం) తెలంగాణలో వాతావరణం ఎలా ఉండనుందో IMD ప్రకటించింది. అత్యల్పంగా 22 డిగ్రీలు, అత్యధికంగా 34 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవవుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ... పగటిపూట జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
నేడు ఆంధ్ర ప్రదేశ్ వాతావరణ సమాచారం :
తెలంగాణ కంటే ఆంధ్ర ప్రదేశ్ లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. నేడు ఫిబ్రవరి 20న ఇక్కడ అత్యల్పంగా 23 డిగ్రీలు, అత్యధికంగా 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుందని ఐఎండి అంచనా వేస్తోంది. నిన్న అత్యధికంగా 37.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది.