MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • Weather : తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు : ఆకాశంలో మేఘాలతో కూల్ కూల్

Weather : తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు : ఆకాశంలో మేఘాలతో కూల్ కూల్

మండుటెండల సమయంలో తెలుగు రాష్ట్రాలకు కూల్ న్యూస్. మంగళవారం ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుందో తెలుసా?

1 Min read
Author : Arun Kumar P
| Updated : Mar 04 2025, 08:33 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
11
Telugu States Weather Updates

Telugu States Weather Updates

weather : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు భగ్గుమంటున్నాయి. వేసవి ఆరంభంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో తెలుగు ప్రజలు పగటిపూట రోడ్డుపైకి వచ్చేందుకు జంకుతున్నారు. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో మంగళవారం ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం కాస్త చల్లగానే ఉండవచ్చని వాతావరణ విభాగం పేర్కొంది. 

ఇప్పటికే తమిళనాడు, కేరళ, లక్షద్వీప్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇదే సమయంలో ఉత్తర భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్,  జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో భారీ మంచు కురుస్తోంది. ఇలా దేశవ్యాప్తంగా నెలకొన్న వాతావరణ పరిస్థితుల ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఉండనుంది. 

మంగళవారం తెలుగు రాష్ట్రాల్లో మేఘాలతో నిండివుంటుందని సూచించారు. ఇలా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మేఘాలు విస్తరించడంతో కాస్త ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

తెలంగాణలో ఉష్ణోగ్రతలు : 

తెలంగాణలో మంగళవారం 34 నుండి 36 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతల నమోదవతాయి. అంటే ఎండ నిరంతరాయంగా కాకుండా మేఘాలు అడ్డురానున్నాయి. దీంతో ఈ ఎండల నుండి కాస్త ఉపశమనం లభిస్తుంది. 

ఆంధ్ర ప్రదేశ్ వాతావరణం : 

ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఉష్ణోగ్రతలు కాస్త తక్కువగానే నమోదు కానున్నాయి. ముఖ్యంగా రాయలసీమ మేఘావృత వాతావరణం ఉంటుంది. దీంతో ఆ ప్రాంతంలో ఎండల తీవ్రత తక్కువగా ఉండే అవకాశాలున్నాయి. మొత్తంగా ఏపీలో 35 నుండి 36 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.

Latest Videos
Recommended Stories
Recommended image1
ఉద్యోగం చేశావా.? పైస‌లు ప్రింట్ చేశావా.? హైదరాబాద్‌లో చిక్కిన భారీ అవినీతి తిమింగ‌ళం
Recommended image2
తెలంగాణలో ట్రాఫిక్ ఫైన్స్ పై బిగ్‌ అప్‌డేట్.. నెల రోజుల్లోగా ఇలా చేయ‌క‌పోతే కుదరదు
Recommended image3
Weather Update : రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు డేంజర్ బెల్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved