MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Telangana
  • టిఆర్ఎస్ పార్టీ చీఫ్ అరెస్ట్... కాళ్లుచేతులు పట్టి ఈడ్చుకెళ్లిన పోలీసులు

టిఆర్ఎస్ పార్టీ చీఫ్ అరెస్ట్... కాళ్లుచేతులు పట్టి ఈడ్చుకెళ్లిన పోలీసులు

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెను కాళ్లుచేతులు పట్టుకుని ఈడ్చుకుంటూ తీసుకెళ్లడంతో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. 

2 Min read
Author : Arun Kumar P
| Updated : Jul 02 2026, 02:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
కల్వకుంట్ల కవిత అరెస్ట్
Image Credit : X/ddyadagirinews

కల్వకుంట్ల కవిత అరెస్ట్

Kalvakuntla Kavitha : తెలంగాణ ఉద్యమకారుల కోసం కల్వకుంట్ల కవిత పోరాటం చేపట్టిన విషయం తెలిసిందే. ఆమె పిలుపు మేరకు తెలంగాణ రక్షణ సేన (TRS) నాయకులు, కార్యకర్తలు ఉద్యమానికి సిద్దమయ్యారు. హైదరాబాద్ ఉప్పల్ పరిధిలో ఉద్యమకారులతో కలిసి టిఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత భూపోరాటం చేపట్టారు... ఇందుకోసం టిఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివచ్చాయి. దీంతో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా కవితను అరెస్ట్ చేశారు పోలీసులు. ఆమెతో పాటు మరికొందరు టిఆర్ఎస్ నాయకులను కూడా అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
కాంగ్రెస్ సర్కార్ పై కవిత సీరియస్
Image Credit : Asianet News

కాంగ్రెస్ సర్కార్ పై కవిత సీరియస్

తెలంగాణ ఉద్యమకారుల కోసం పోరాడుతున్న టిఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేయడంపై కవిత సీరియస్ అయ్యారు. అరెస్ట్ తర్వాత బొల్లారం పోలీస్ స్టేషన్ వద్ద ఆమె మీడియాతో మాట్లాడారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు లాఠీ చార్జ్ చేయడం దారుణమని... ప్రభుత్వ ఆదేశాలతోనే ఇదంతా జరిగిందని అన్నారు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని... విచక్షణారహితంగా లాఠీలతో కొడుతూ రక్తం కళ్లజూశారని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related Articles

Related image1
Now Playing
Kalvakuntla Kavitha: సీఎం రేవంత్ రెడ్డిపై రెచ్చిపోయిన కల్వకుంట్ల కవిత | Asianet News Telugu
Related image2
Now Playing
Kalvakuntla Kavitha: కొడంగల్‌లో 22 వేల డూప్లికేట్ ఓట్లు? కవిత సంచలన కామెంట్స్| Asianet News Telugu
34
టిఆర్ఎస్ పోరాటం దేనికోసం?
Image Credit : X

టిఆర్ఎస్ పోరాటం దేనికోసం?

గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులకు పలు హామీలు ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చాక వీటిని నెరవేర్చడం లేదంటూ కవిత ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా స్వరాష్ట్రం కోసం ఉద్యమించినవారికి 250 గజాల ఇంటిస్థలం ఇస్తామన్న హామీ ఏమయ్యిందని కవిత ప్రశ్నిస్తున్నారు. ఈ హామీని వెంటనే నెరవేర్చాలని... ప్రతి ఉద్యమకారుడికి ఇచ్చిన మాట ప్రకారం ఇంటిస్థలం కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఉప్పల్ లో ఆందోళన చేపట్టారు. టిఆర్ఎస్ శ్రేణులు, ఉద్యమకారులతో కలిసి నిరసనకు సిద్దమైన కవితను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

44
కాంగ్రెస్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ : కవిత
Image Credit : X

కాంగ్రెస్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ : కవిత

ఉద్యమకారుల రక్తం చిందడంతోనే కాంగ్రెస్ సర్కార్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యిందని కవిత హెచ్చరించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్తశుద్దితో తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు... లేదంటే ఆయన గద్దె దిగడం ఖాయమన్నారు.

తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన అమరులను గౌరవించుకోవాల్సిన అవసరం అందరిపై ఉందని... వారి కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు కవిత. ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను టిఆర్ఎస్ గుర్తుచేస్తూనే ఉంటుందని... ఉద్యమకారుల పక్షాన పోరాటం కొనసాగుతుందని... అరెస్టులతో భయపెట్టి తమను ఆపలేరని కల్వకుంట్ల కవిత అన్నారు.

ప్రజాపాలన ముసుగులో అరాచక పాలన సాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే ఘోరి కడతారు pic.twitter.com/NZx3jhShby

— Kavitha Kalvakuntla (@RaoKavitha) July 2, 2026

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
తెలంగాణ
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
RTC: తెలంగాణ ఆర్టీసీ మ‌రో కీల‌క నిర్ణ‌యం.. ఇక‌పై బ‌స్సుల్లో మెట్రో త‌ర‌హా ఏర్పాట్లు
Recommended image2
హైద‌రాబాద్‌లో రూ. 70 వేల కోట్ల‌తో భారీ ఏఐ డేటా సెంట‌ర్‌.. ఈ ప్రాంత రూపురేఖ‌లు మార‌డం ఖాయం
Recommended image3
Now Playing
దుమ్ములేపే స్పీచ్ CM Revath Reddy Next Level Speech At Teachers Day Meeting | Asianet Telugu
Related Stories
Recommended image1
Now Playing
Kalvakuntla Kavitha: సీఎం రేవంత్ రెడ్డిపై రెచ్చిపోయిన కల్వకుంట్ల కవిత | Asianet News Telugu
Recommended image2
Now Playing
Kalvakuntla Kavitha: కొడంగల్‌లో 22 వేల డూప్లికేట్ ఓట్లు? కవిత సంచలన కామెంట్స్| Asianet News Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved