MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Telangana
  • వీడెంత మంచి దొంగో..!: దోపిడీకి వెళ్లినచోట చిలిగవ్వ లేదని... తన జేబులో డబ్బులే పెట్టేసాడు...

వీడెంత మంచి దొంగో..!: దోపిడీకి వెళ్లినచోట చిలిగవ్వ లేదని... తన జేబులో డబ్బులే పెట్టేసాడు...

వీడు దొంగే... కానీ మరీ అంత దుర్మార్గుడిలా కనిపించడంలేదు. అందరు దొంగల్లా కాకుండా వీడికి కాస్తో కూస్తో మంచిగుణం వున్నట్లుంది. ఇలా ఓ దొంగను పొగడడానికి కారణమేంటో తెలుసా..? 

2 Min read
Author : Arun Kumar P
| Updated : Jul 27 2024, 12:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Hyderabad Robbery

Hyderabad Robbery

Hyderabad : మానవత్వమే లేకుండా వ్యవహరిస్తారు... డబ్బుల కోసం ప్రాణాలు తీయడానికి వెనకాడని  రాక్షసులు... ఇదే దొంగలపై ప్రతిఒక్కరి అభిప్రాయం. దొంగతనానికి వెళ్లిన ఇంటిని ఊడ్చేయడమే దొంగల పని. డబ్బులు, విలువైన వస్తువులే వారి టార్గెట్. ఒక్కసారి దొంగలు దోపిడీకి ఫిక్స్ అయ్యారంటే ఏమాత్రం జాలి, దయ లేకుండా ఉన్నదంతా దొంగిలిస్తారు. ఇదే ఏ దోపిడీ  దొంగయినా చేసేది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Hyderabad Robbery

Hyderabad Robbery

అయితే హైదరాబాద్ శివారులోని మహేశ్వరం ఓ విచిత్ర దొంగ సిసి కెమెరాలకు చిక్కాడు. ఓ హోటల్లో జరిగిన ఈ దొంగతన చాలా ఫన్నీగా వుంది. దీంతో ఈ దొంగతనం వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

36
Hyderabad Robbery

Hyderabad Robbery

వీడు దొంగే... కాని మంచి దొంగ :  

రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని ఓ హోటల్లోకి అర్థరాత్రి ఓ దొంగోడు ప్రవేశించాడు. తాళం పగలగొట్టి హోటల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ముఖం కనిపించకుండా ఓ టవెల్ కట్టుకుని, తలకు క్యాప్, చేతికి గ్లౌజులు ధరించి చాలా పకడ్బందీగా దొంగతనాని వచ్చాడు. హోటల్ కౌంటర్ లోని డబ్బులను దోచుకోవాలని భావించాడు. 

46
Hyderabad Robbery

Hyderabad Robbery

ఎంత డబ్బుందో అని భావించిన అతడికి నిరాశే ఎదురయ్యింది. హోటల్ కౌంటర్ లోనే కాదు మొత్తం వెతికినా చిల్లిగవ్వ దొరకలేదు. దీంతో తీవ్ర నిరాశకు గురయిన అతడు సిసి కెమెరాను చేస్తూ కొన్ని సంజ్ఞలు చేసాడు. చివరకు ప్రిజ్ లోని ఓ వాటర్ బాటిల్ తో సరిపెట్టుకున్నాడు. అదికూడా ఫ్రీగా తీసుకోకుండా రూ.20 టెబుల్ పై పెట్టి వెళ్లిపోయాడు.  

56
Hyderabad Robbery

Hyderabad Robbery

ఇలా దొంగతనానికి వచ్చినవాడే డబ్బులు పెట్టి వెళ్లిపోయిన వీడియో ఫన్నీగా వుండటంతో సోషల్ మీడియాతో వైరల్ గా మారింది. 'ఏంది సామీ ఇది... ఒక్క రూపాయి కూడా లేదు' అనేల ఆ దొంగ సంజ్ఞలు వున్నాయి. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.హోటల్ యజమాని దీనస్థితి చూసి దొంగోడే చలించిపోయాడని కొందరు... వీడు దొంగోడే కానీ మహానుభావుడు అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. 
 

66
Hyderabad Robbery

Hyderabad Robbery

అయితే సిసి కెమెరాలను చూసికూడా సదరు దొంగ ఏమాత్రం భయపడకపోవడం కాస్త ఆందోళన కలిగించే అంశమే. అలాగే అతడు ఓ రాడ్డు చేతబట్టి వచ్చినట్లు వీడియోను బట్టి తెలుస్తోంది. దొంగలు ఇంత విచ్చలవిడిగా వ్యవహరిస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నట్లు అని ప్రశ్నిస్తున్నారు. ఈ వీడియో ఆధారంగా అయినా దొంగను పట్టుకోవాలని మహేశ్వరం వాసులు కోరుతున్నారు. 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Ration Card: రేషన్ కార్డు కట్ కావొద్దంటే ఇలా చేయండి.. అంతా ఇంటి నుంచే !
Recommended image2
Weather Update: అల్పపీడనం ఎఫెక్ట్.. కుండపోత వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ బిగ్ అలర్ట్
Recommended image3
Konda Surekha: పదవి పోయిందని ఇంట్లో కూర్చోం.. కొండా సురేఖ కీల‌క వ్యాఖ్య‌లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved