MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Telangana
  • Telangana Jobs : నెలకు రూ.60,000 సాలరీతో తెలంగాణలోనే ఉద్యోగం .. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నోటిఫికేషన్

Telangana Jobs : నెలకు రూ.60,000 సాలరీతో తెలంగాణలోనే ఉద్యోగం .. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నోటిఫికేషన్

Telangana Jobs : తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ భారీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సొంత రాష్ట్రంలో మంచి సాలరీతో ప్రభుత్వరంగ సంస్థలో ఉద్యోగాన్ని పొందే అద్భుత అవకాశం నిరుద్యోగ యువతకు వచ్చింది. 

3 Min read
Author : Arun Kumar P
Published : Sep 18 2025, 05:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
తెలంగాణలో భారీ ఉద్యోగాలు
Image Credit : iSTOCK

తెలంగాణలో భారీ ఉద్యోగాలు

Telangana Jobs : తెలంగాణ నిరుద్యోగ యువతకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది... భారీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) 1,743 (1000 డ్రైవర్, 743 శ్రామిక్స్) ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఇలా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ చేపడుతున్న ఈ భర్తీ ప్రక్రియలో ఉద్యోగాలన్నీ తెలంగాణ ఆర్టిసికి చెందినవే. తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పోరేషన్ (TGSRTC) లో డ్రైవర్లతో పాటు ఇతర టెక్నికల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.

కేవలం పదో తరగతి చదివుంటే చాలు… రాతపరీక్ష లేకుండానే ఈ ఉద్యోగాలకు భర్తీ చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగం, మంచి సాలరీ ఉంటుంది కాబట్టి పోటీ ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి. అయితే ఈ జాబ్ సాధిస్తే లైఫ్ లో సెటిల్ కావచ్చు. కాబట్టి తెలంగాణ ఆర్టిసి ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకొండి... ఉద్యోగాలను పొందండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
తెలంగాణ ఆర్టిసి డ్రైవర్ ఉద్యోగానికి అర్హతలు
Image Credit : Asianet News

తెలంగాణ ఆర్టిసి డ్రైవర్ ఉద్యోగానికి అర్హతలు

తెలంగాణ ఆర్టిసిలో డ్రైవర్ ఉద్యోగాలకు కేవలం పురుషులే కాదు మహిళలు కూడా అర్హులే. తాజా నోటిఫికేషన్ లో ప్రకటించిన ఉద్యోగాలకు మహిళలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

వయోపరిమితి :

ఆర్టిసి బస్ డ్రైవర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 22 ఏళ్ల వయసుండాలి. అలాగే 35 ఏళ్లలోపు వయసున్నవారు అర్హులు. జూలై 1, 2025 నాటికి వయసును పరిగణలోకి తీసుకుంటారు. రిజర్వేషన్ కలిగిన అభ్యర్థులకు వయో పరిమితి సడలింపు ఉంటుంది.

ఎస్సి, ఎస్టి, బిసి, ఈడబ్ల్యుఎస్ అభ్యర్థులకు 5 ఏళ్ల సడలింపు ఉంటుంది. మాజీ సైనికులకు (ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ పోర్స్ వంటి విభాగాల్లో పనిచేసినవారు) 3 ఏళ్ల సడలింపు ఉంటుంది. పదో తరగతి సర్టిఫికెట్స్ లేదా అందుకు సమానమైన స్టడీ సర్టిఫికెట్స్ లో డేట్ ఆఫ్ భర్త్ ను పరిగణలోకి తీసుకుంటారు.

37
తెలంగాణ ఆర్టిసి ఉద్యోగాలకు విద్యార్హతలు
Image Credit : X/@ram_views

తెలంగాణ ఆర్టిసి ఉద్యోగాలకు విద్యార్హతలు

రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు కలిగిన విద్యాసంస్థల నుండి పదో తరగతి లేదా అందుకు సమానమమైన చదువు చదివుండాలి. జూలై 1, 2025 నాటికి ఈ విద్యార్హతలు కలిగివుండాలి.

డ్రైవింగ్ లైసెన్స్ :

తప్పనిసరిగా హెవీ ప్యాసింజర్ మోటార్ వెహికిల్ (HPMV) లైసెన్స్ కలిగివుండాలి. హెవీ గూడ్స్ వెహికిల్ (HGV) లేదా ట్రాన్స్ పోర్ట్ వెహికిల్ నడిపించిన 18 నెలల అనుభవం ఉండాలి.

శారీరక అర్హతలు :

అభ్యర్థులు మంచి శారీరక, మానసిక ఆరోగ్యం కలిగివుండాలి. కంటిచూపు, వినికిడి బాగుండాలి... ముఖ్యంగా కలర్ బ్లైండ్ నెస్ ఉండకూడదు. మెడికల్ టెస్ట్ తర్వాతే అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపికచేస్తారు.

47
తెలంగాణ ఆర్టిసి శ్రామిక్స్ ఉద్యోగాలకు అర్హతలు
Image Credit : freepik

తెలంగాణ ఆర్టిసి శ్రామిక్స్ ఉద్యోగాలకు అర్హతలు

తెలంగాణ ఆర్టిసి శ్రామిక్స్ ఉద్యోగాలకు కూడా పురుషులతో పాటు మహిళలు కూడా అర్హులే.

వయోపరిమితి :

18 ఏళ్లనుండి 30 ఏళ్లలోపు వయసుగలవారు అర్హులు. ఎస్సి, ఎస్టి, బిసి, ఈడబ్ల్యుఎస్ అభ్యర్థుకు 5, మాజీ సైనికులకు 3 వయసు సడలింపు ఉంటుంది.

విద్యార్హతలు :

ఐటిఐ లో మెకానిక్ (డీజిల్ లేదా మోటార్ వెహికిల్) లేదా షీట్ మెటల్/ఎంవిబిబి లేదా ఫిట్టర్ లేదా ఎలక్ట్రిషియన్ లేదా పెయింటర్ లేదా వెల్డర్ లేదా కట్టింగ్ వంటివి పూర్తిచేసివుండాలి.

57
ఆర్టిసి ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ
Image Credit : Ai Photos

ఆర్టిసి ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ

తెలంగాణ ఆర్టిసిలో డ్రైవర్ లేదా శ్రామిక్స్ ఉద్యోగాలపై ఆసక్తి, అన్ని అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబర్ 8వ తేదీ 8AM నుండి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం అవుతుంది. అక్టోబర్ 28, 2025 సాయంత్రం 5PM వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. TSLPRB అధికారిక వెబ్ సైట్ www.tgprb.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు :

డ్రైవర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే ఎస్సి, ఎస్టి అభ్యర్థులకు కేవలం రూ.300 ఫీజు ఉంటుంది. ఇతరులకు రూ.600 ఫీజు ఉంటుంది.

శ్రామిక్స్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే ఎస్సి, ఎస్టి అభ్యర్థులకు రూ.200 ఫీజు ఉంటుంది. ఇతరులకు రూ.400 ఫీజు ఉంటుంది.

67
తెలంగాణ ఆర్టిసి ఉద్యోగాలకు సాలరీ
Image Credit : Asianet News

తెలంగాణ ఆర్టిసి ఉద్యోగాలకు సాలరీ

డ్రైవర్ ఉద్యోగాన్ని సాధిస్తే నెలకు రూ.20,960 నుండి రూ.60,080 వరకు జీతం పొందవచ్చు.

శ్రామిక్స్ ఉద్యోగులకు నెలకు రూ.16,550 నుండి 45,030 వరకు జీతం లభిస్తుంది.

77
అత్యధిక ఉద్యోగాలు హైదరాబాద్ లోనే
Image Credit : TGSRTC@X

అత్యధిక ఉద్యోగాలు హైదరాబాద్ లోనే

తెలంగాణ ఆర్టిసిలో భర్తీ చేయనున్న డ్రైవర్ ఉద్యోగాల్లో అత్యధికం హైదరాబాద్ లోనే ఉన్నాయి. మొత్తం 1000 డ్రైవర్ ఉద్యోగాల్లో 148 హైదరాబాద్, 93 మేడ్చల్, 88 రంగారెడ్డి, 59 సంగారెడ్డి, 41 హన్మకొండ, 31 నల్గొండ, 34 వికారాబాద్, 34 కొత్తగూడెం, 30 కామారెడ్డి, 49 నిజామాబాద్, 44 ఖమ్మం, 24 మంచిర్యాల, 22 సూర్యాపేట, 29 వరంగల్, 31 మహబూబాబాద్, 21 జనగామ, 21 ఆదిలాబాద్ జిల్లా పరిధిలో ఉన్నాయి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఉద్యోగాలు, కెరీర్
తెలంగాణ
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bank Holidays : సెప్టెంబర్ 25 నుంచి 30 వరకు బ్యాంకులు బంద్‌.. ఏరోజు, ఎందుకు సెలవు?
Recommended image2
Farmer ID: రైతులకు బిగ్ అలర్ట్.. పీఎం కిసాన్, రైతు భరోసా ఆగిపోవద్దంటే వెంటనే ఇలా చేయండి
Recommended image3
Heavy Rains Alert: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ఈ ప్రాంతాల్లో వారం రోజులు వర్షాలే వర్షాలు
Related Stories
Recommended image1
Railway Jobs 2025 : తెలుగు యువతకు బంపరాఫర్ .. సికింద్రాబాద్ రైల్వేలో జాబ్ ఛాన్స్, ఫుల్ డిటెయిల్స్
Recommended image2
Bank Jobs : రాతపరీక్ష లేకుండానే ప్రభుత్వరంగ బ్యాంకులో మేనేజర్ ఉద్యోగాలు... వెంటనే అప్లై చేసుకొండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved