నువ్వు మనసున్న సీఎంవయ్యా..! దిక్కులేని ఆ ఆడబిడ్డకు పెద్దదిక్కయ్యావు..!!
తెెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గొప్పమనసు చాటుకున్నారు. దిక్కులేని ఆడబిడ్డకు అండగా నిలిచి తెలంగాణ ప్రజానీకాానికి మరింత దగ్గరయ్యారు.
Revanth Reddy
Revanth Reddy : ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తే నాయకులు కాస్త గొప్ప నాయకులు అవుతారు. కానీ కష్టాల్లో వున్నవారికి నేనున్నానంటూ భరోసా ఇచ్చేవారు మహా నాయకులుగా వారి గుండెల్లో నిలిచిపోతారు. ఇలా ప్రతిఒక్కరు 'మన సీఎం నిజంగా గొప్పవాడు, మనసున్న మారాజు'అనుకునేలా రేవంత్ రెడ్డి వ్యవహరించారు. ఓ అనాధ ఆడపిల్ల పరిస్థితి చూసి చలించిపోయిన తెలంగాణ సీఎం ఆమెకు అండగా నిలిచారు... బాలిక బాధ్యతను ప్రభుత్వమే చూసుకునేలా అధికారులను ఆదేశాలిచ్చారు.
mother and child
అసలు ఏం జరిగింది..:
తెలంగాణలోని నిర్మల్ జిల్లా తానూరు మండలం బేల్‌తరోడా గ్రామంలో గంగామణి(36) నివాసం వుండేది. భర్తకు దూరమైన ఆమె తన పదకొండేళ్ళ కూతురు దుర్గను అల్లారుముద్దుగా పెంచుకునేది. ఒకరి కోసం ఒకరు అన్నట్లుగా తల్లీకూతురు జీవించేవారు. కూలీనాలి చేసుకుంటూ ఉన్నంతలో కూతురికి ఏ లోటు రాకుండా చూసుకునేది ఆ తల్లి.
Nirmal
అయితే సడన్ గా ఏమయ్యిందో తెలీదుగానీ గంగామణి ఆత్మహత్య చేసుకుంది. దీంతో పదకొండేళ్ల ఆమె కూతురు అనాధగా మారింది. తల్లి మృతితో ఆ పసిహృదయం తల్లడిల్లిపోయింది. ఏ దిక్కులేని ఆ బాలిక తల్లి అంత్యక్రియల కోసం భిక్షాటన చేసింది. తోచినంత డబ్బు ఇవ్వాలంటూ పుట్టెడు దు:ఖాన్ని దిగమింగుకుంటూ గ్రామస్తులను వేడుకుంది. ఇలా తల్లి మృతదేహం వద్ద చిన్నారి దుర్గ కన్నీంటిపర్యంతం అవుతూ భిక్షాటన చేపట్టడం అక్కడున్నవారితో కంటతడి పెట్టించింది.
Nirmal Durga
ఇలా దుర్గ పరిస్థితి చూసి చలించిపోయిన కొందరు సోషల్ మీడియా ద్వారా సాయాన్ని కోరారు. తల్లి మృతదేహం వద్ద ఓ దుప్పటి పరిచి బిక్షాటన చేస్తున్న బాలిక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇలా దుర్గ దీన పరిస్థితి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరకు చేరింది. దీంతో వెంటనే ఆయన బాలికకు అండగా నిలిచారు... స్వయంగా జిల్లా కలెక్టర్ ను బాలికకు అన్నిరకాలుగా సాయం అందేలా చూడాలని ఆదేశించారు.
Revanth Reddy
తల్లిని కోల్పోయి అనాధగా మారిన దుర్గకు అవసరమైనవన్నీ సమకూర్చాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష్ అభినవ్ ను సీఎం రేవంత్ ఆదేశించారు. ముఖ్యంగా ఆమెకు మంచి విద్య, అవసరమైనప్పుడు వైద్యం అందేలా చూడాలన్నారు. ఇప్పటికి ఆ బాలికకు అండగా నిలిచి ధైర్యం ఇవ్వాలని సూచించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో స్వయంగా దుర్గ బాధ్యతలను చూస్తున్నారు కలెక్టర్.
దుర్గకు ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటామని కలెక్టర్ అభినవ్ తెలిపారు. ప్రస్తుతం ఆమెకు ఉచితంగానే వసతి కల్పించి విద్యను అందించేలా గురుకుల పాఠశాలలో చేర్చనున్నట్లు తెలిపారు. ఇతర సమస్యలేమైనా ఉంటే వాటిని వెంటనే పరిష్కరిస్తామని కలెక్టర్ తెలిపారు. బాలికను తన కాళ్లపై తాను నిలబడేలా తీర్చిదిద్దుతామని ... అందుకోసమే ఆమెకు మంచి విద్య అందించే ఏర్పాటు చేసామన్నారు కలెక్టర్ అభినవ్.
revanth reddy
అయితే 11 ఏళ్ల బాలిక దీనస్థితి గురించి తెలిసినవెంటనే స్పందించిన సీఎం రేవంత్ రెడ్డిపై ప్రజలు ప్రశంసిస్తున్నారు. ఓ ఆడకూతురికి అండగా నిలిచి తన గొప్ప మనసును చాటుకున్నారు... ప్రజా నాయకుడిగా రేవంత్ రెడ్డి మరో మెట్టు ఎక్కేసారంటూ కొనియాడుతున్నారు. ఏ దిక్కులేని దుర్గకు నేనున్నానంటూ ఆయన అండగా నిలవడం చిన్నవిషయమే కావచ్చు... చాలా గొప్పదంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.