తెలంగాణ బడ్జెట్ లో అత్యధిక నిధులు పొందిన టాప్ 5 శాఖలివే... వీటికే రూ.1,40,870 కోట్లు
Telangana Budget 2025 : తెలంగాణ బడ్జెట్ 2025-26 మొత్తం 3 లక్షల కోట్ల రూపాయలు... అందులో సగం అంటే దాదాపు లక్షన్నర కోట్లు కేవలం ఓ ఐదు శాఖలకే దక్కాయి. ఆ శాఖలేవో తెలుసాా?
- FB
- TW
- Linkdin
Follow Us
)
Telangana Budget 2025
Telangana Budget 2025 : తెలంగాణ వార్షిక బడ్జెట్ 2025-26 ను రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి మొత్తం బడ్జెట్ రూ.3,04,965 కోట్లుగా అంచనా వేయగా ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2,26,982 కోట్లు, మూలధన వ్యయం రూ.36,504 కోట్లుగా పేర్కొన్నారు. వ్యవసాయ, విద్యుత్, రోడ్లు భవనాలు, హోం, పట్టణాభివృద్ధి, పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలకు భారీగా నిధులు కేటాయించారు.
అయితే ఈ బడ్జెట్ లో అత్యధికంగా షెడ్యూల్ కులాల (ఎస్సి) సంక్షేమానికి ఏకంగా రూ.40,234 కోట్లు కేటాయించారు. ఇక షెడ్యూల్ తెగల (ఎస్టి) సంక్షేమానికి మరో రూ.17,169 కోట్లు కేటాయించారు. ఇలా కేవలం ఎస్సి, ఎస్టిల కోసమే ఈ బడ్జెట్ లో సింహభాగం కేటాయించారు. ఇప్పటికే ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలిపడంతో రేవంత్ సర్కార్ పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి... ఇప్పుడు బడ్జెట్ లో కూడా వారికి భారీగా నిధులు దక్కడంతో ఆ ప్రశంసలు మరింత పెరిగాయి.
బడ్జెట్ లో తమ వర్గాలకు భారీగా నిధులు దక్కడంపై ఎస్సీ,ఎస్టి ఎమ్మెల్యేలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రజల సంక్షేమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన చర్యలు, ప్రభుత్వ పథకాలు అద్భుతమని వారు కొనియాడుతున్నారు. తెలంగాణలోని బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని... అందులో భాగంగానే ఎస్సీ వర్గీకరణ, బడ్జెట్ లో నిధులు కేటాయింపు అని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పేర్కొంటున్నారు.
Telangana Budget 2025
తెలంగాణ బడ్జెట్ 2025లో అత్యధిక నిధులు దక్కిన టాప్ 5 శాఖలివే :
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో వచ్చాక రెండోసారి పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క రాష్ట్ర బడ్జెట్ 2025 ను శాసన సభలో ప్రవేశపెడితే మరో మంత్రి శ్రీధర్ బాబు శాసన మండలిలో ప్రవేశపెట్టారు. ఇలా అసెంబ్లీ సాక్షిగా ప్రజలముందుకు వచ్చిన తెలంగాణ వార్షిక బడ్జెట్ 2025 లో ఏఏ శాఖలకు అత్యధిక నిధులు దక్కాయో తెలుసుకుందాం.
1. ఎస్సి సంక్షేమం - రూ.40,232 కోట్లు
2. పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి - రూ.31,605 కోట్లు
3. వ్యవసాయ శాఖ - రూ.24,439 కోట్లు
4. నీటిపారుదల శాఖకు రూ.23,373 కోట్లు
5. విద్యుత్ శాఖకు రూ.21,221 కోట్లు
Telangana Budget 2025
కేవలం ఆ నాలుగు వర్గాలకే రూ.72,397 కోట్లు
ఎస్సీ ఉపకులాల వర్గీకరణ చట్టాన్ని అమలుచేస్తున్న మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ అని భట్టి పేర్కొన్నారు. అలాగే కులగణన చేపట్టి బిసి జనాభాకు తగినట్లు రిజర్వేషన్లు అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఇక ఎస్టి, మైనారిటీల సంక్షేమానికి కూడా అనేక పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ నాలుగు వర్గాలకు ఈ బడ్జెట్ లో ఏకంగా రూ.72,397 కోట్లను రేవంత్ సర్కార్ కేటాయించిందిజ
షెడ్యూల్ కులాల సంక్షేమంకు రూ.40,232 కోట్లు, షెడ్యూల్ తెగల సంక్షేమానికి రూ.17,169 కోట్లు కేటాయించారు. అలాగే బిసి సంక్షేమ శాఖకు రూ.11,405 కోట్లు కేటాయించారు. మైనారిటీ సంక్షేమానికి రూ.3,591 కోట్లు ఇచ్చారు. ఇలా అన్ని కులాలు. అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ బడ్జెట్ కేటాయింపులు చేపట్టారుజ
సమగ్ర, సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వే పేరిట తెలంగాణ ప్రభుత్వం కుల గణన చేపట్టిన విషయం తెలిసిందే... ఈ సర్వే వివరాలను కూడా ఆర్థిక మంత్రి భట్టి బడ్జెట్ ప్రసంగంలో బైటపెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ సర్వేలో మొత్తం 1.12 కోట్ల కుటుంబ వివరాలు సేకరించామని.... 96 శాతం కవరేజ్ తో సామాజిక, ఆర్థిక డేటా సేకరించామన్నారు. రానున్న పంచాయితీ ఎన్నికల్లో వెనుకబడిన తరగతులను జనాభా ఆధారంగా రిజర్వేషన్లు కేటాయిస్తామని మంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు.