వేసవిలో ఏసి వాడినా కరెంట్ బిల్లు తక్కువగా రావాలా? అయితే ఈ చిట్కాలు పాటించండి
వేసవిలో సాధారణంగా ఏసి వాడకం పెరుగుతుంది... దీంతో కరెంటు బిల్లులు పెరుగుతాయి. అయితే కొన్ని చిట్కాలు వాడితే ఏసి వాడకం ఎక్కువైనా కరెంట్ బిల్లు తక్కువగా వస్తుందట.. ఆ చిట్కాలేంటో చూద్దాం.

Summer Energy Saving Tips
వేసవి రాగానే ప్రజలు భయపడిపోతుంటారు... ఎండలు మొదలవుతాయన్నది కొందరి భయమైతే ఈ వేడి నుండి ఉపశమనం కోసం ఉసయోగించే ఫ్యానులు, కూలర్లు, ఏసిలతో కరెంట్ బిల్లు వాచిపోతుందన్నది చాలామంది భయం. మరీముఖ్యంగా ఏసిల వాడకంతో కరెంట్ బిల్లు చాలా ఎక్కువగా వస్తుంది.

ఏసి వాడితే కరెంట్ బిల్లు వాచిపోతుంది...
వేడి నుంచి తప్పించుకోవడానికి AC వాడితే ఆ నెల కరెంట్ బిల్లు వేడి గాలి కంటే ఎక్కువగా వస్తుంది. దీంతో ఏం చేయాలో తెలియక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అటు ఎండలను, వేడి గాలులను తట్టుకోలేరు... ఇటు కరెంట్ బిల్లును భరించలేరు... అలాంటివారు ఏసి వాడినా కరెంట్ బిల్లును తక్కువగా రావాలంటే ఈ చిట్కాలు పాటించాలి.
కరెంటు బిల్లు తగ్గించుకోవడం ఎలా?
ఏసీని 24 డిగ్రీల వద్ద వాడితే కరెంట్ వినియోగం కాస్త తగ్గుతుంది... తద్వారా బిల్లు తక్కువగా వచ్చే అవకాశాలున్నాయి. ఇక ఇంట్లో ఎవరూ లేనిసమయంలో ఏసిని ఆపేయాలి.. అనవసరంగా ఏసి వాడకూడదు.
ఏసి టైమర్ సెట్ చేసుకోవాలి. అంటే అవసరం ఉన్నంతసేపు ఆన్ లో ఉండి ఆటోమెటిక్ గా ఆఫ్ అయ్యేలా టైమ్ సెట్ చేయాలి. తద్వారా ఏసి వినియోగం తగ్గుతుంది.
ఏసిని రెగ్యులర్ గా సర్విసింగ్ చేయించడంవల్ల దాని పనితీరు మెరుగుపడుతుంది. కాబట్టి ఏసిని తక్కువ టెంపరేచర్ లో పెట్టాల్సిన అవసరం ఉండదు. ఇలా కూడా విద్యుత్ భారం తగ్గుతుంది.