శభాష్ కలెక్టర్ సాబ్ : నిరుపేద తెలుగు బిడ్డకు ఐఐటి సీటు... ఫీజు చెల్లించిన చౌదరిగారు...
ఓ నిరుపేద విద్యార్థి చదువుకు ఆర్థిక కష్టాలు అడ్డురాగా సిద్దిపేట కలెక్టర్ మను చౌదరి గొప్పమనసును చాటుకున్నారు. ఇలా ఐఐటి సీటు సాధించిన పేదబిడ్డ భవిష్యత్ కోసం కలెక్టర్ ఆర్థిక సాయం చేసారు.
Manu Choudary
Siddipet Collector : గొప్ప చదువు, గొప్పు ఉద్యోగమే కాదు తన మనిషి, మనసు గొప్పదేనని నిరూపించుకున్నారు సిద్దిపేట కలెక్టర్ మను చౌదరి. చదువు విలువ తెలిసిన ఆయన జిల్లా పాలనాధికారిగా ఏ బిడ్డా పాఠశాలలకు దూరం కాకుండా చూస్తున్నారు. విద్యాబుద్దులే బంగారు భవిష్యత్ కు బాటలు వేస్తాయంటూ విద్యార్థులకు బడిబాట పట్టిస్తున్నారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలను గాడిలో పెట్టి పేద మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా చూస్తున్నారు కలెక్టర్ మను చౌదరి.
Manu Choudary
జిల్లా పాలనాధికారిగానే కాదు వ్యక్తిగతంగానూ విద్యార్థులకు సాయం చేస్తూ తన గొప్ప మనసును చాటుకుంటున్నారు మను చౌదరి. ఓ నిరుపేద విద్యార్థి ఉన్నత చదువు కోసం ఆర్థిక సాయం చేసి 'శభాష్ కలెక్టర్ సాబ్' అనిపించుకున్నారు. కలెక్టర్ సాయంతో ఓ విద్యార్థి కల నెరవేరబోతోంది... ఓ తల్లి కళ్లలో ఆనందం నిండింది.
Manu Choudary
కలెక్టర్ గారి సాయం :
సిద్దిపేట జిల్లి కోహెడ మండలం నకిరేకొమ్ముల గ్రామానికి చెందిన ఆర్యన్ రోషన్ ది నిరుపేద కుటుంబం. అతడి చిన్నపుడే తండ్రి మృతిచెందాడు. తల్లి రాజమణి దినసరి కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ అతడిని చదివిస్తోంది. చిన్నప్పటి నుండి తల్లి కష్టాలను చూసి పెరిగిన ఆర్యన్ తమ బ్రతుకులను తన చదువే మారుస్తుందని బలంగా నమ్మాడు. దీంతో అతడు ఎంతో పట్టుదలతో చదివి పాఠశాల విద్యను అత్యుత్తమ మార్కులతో పూర్తిచేసుకున్నాడు.
Manu choudary
ఆర్యను చిన్నతనం నుండి ప్రభుత్వ పాఠశాలలోనే చదుతున్నాడు... కోహెడ్ లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల నుండి పదో తరగతి పూర్తిచేసుకున్నాడు. 10/10 జిపి సాధించి జిల్లాస్థాయిలో సత్తా చాటాడు. అంతేకాదు ఎంతో కష్టపడి చదవి ఇంటర్మీడియట్ లోనూ 93.69మార్కులు సాధించాడు. ఆ తర్వాత జేఈఈ రాసిన అతడు ఐఐటి సిటు పొందాడు. తిరుపతి ఐఐటిలో అతడికి సీటు లభించింది.
Manu choudary
ప్రతిష్టాత్మక ఐఐటిలో సీటు వచ్చింది... ఇక ఆర్యన్ లైఫ్ మారిపోయినట్లే అనుకుంటుండగా ఆర్థిక కష్టాలు అడ్డుపడ్డాయి. అతడి చదువుకోసం డబ్బులు అవసరం... కానీ అంత డబ్బులు తల్లివద్ద లేవు. దీంతో దిక్కుతోచని స్థితిలో ఆర్యన్ దాతల సాయంకోసం ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే ఆర్యన్ గురించి జిల్లా కలెక్టర్ మను చౌదరికి తెలిసి వెంటనే సాయం అందించారు.
Manu Choudary
నిన్న(శుక్రవారం) రోషన్ ను సిద్దిపేట కలెక్టరేట్ కు పిలిపించుకున్న కలెక్టర్ మనుచౌదరి. అతడి నుండి పూర్తి వివరాలు తీసుకున్నారు. ప్రస్తుతం తనకు తిరుపతి ఐఐటిలో కెమికల్ ఇంజనీరింగ్ సీటు వచ్చింది... కానీ అందులో చేరాలంటే ఫస్ట్ సెమిస్టర్ ఫీజు కట్టాల్సి వుంటుందని తెలిపాడు రోషన్. దీంతో వెంటనే ఫీజు కట్టేందుకు అవసరమైన రూ.36,750 చెక్కును అందించడమే కాదు రూ.40 వేల విలువైన ల్యాప్ ట్యాప్ ను అందించారు కలెక్టర్.
Manu Choudary
తనకు సాయంచేసిన కలెక్టర్ మను చౌదరికి రోషన్ ధన్యవాదాలు తెలిపారు. కలెక్టర్ మను చౌదరి మాట్లాడుతూ...చదువుకు పేదరికం అడ్డుకాదని రోషన్ లాంటి విద్యార్థులు నిరూపిస్తున్నారని అన్నారు. ఇలాంటి ప్రతిభగల నిరుపేద విద్యార్థులకు ప్రోత్సహించేందుకు తాను ముందుంటానని అన్నారు. కలెక్టర్ మన చౌదరి చేసిన పనికి సిద్దిపేట ప్రజలే కాదు తెలంగాణ ప్రజానీకం ప్రశంసించకుండా వుండలేకపోతోంది.