MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Telangana
  • School Holidays : రేపు ఒక్కరోజే స్కూళ్లు నడిచేది ... మళ్లీ రెండ్రోజులు సెలవులు

School Holidays : రేపు ఒక్కరోజే స్కూళ్లు నడిచేది ... మళ్లీ రెండ్రోజులు సెలవులు

తెలుగు విద్యార్థులకు గుడ్ న్యూస్. తెలుగు రాష్ట్రాల్లో మంగళవారం ఒక్కరోజే స్కూళ్లు, కాలేజీలు నడిచేది...తర్వాత రెండ్రోజులు సెలవులు వస్తున్నాయి. ఎందుకో తెలుసా? 

2 Min read
Author : Arun Kumar P
| Updated : Feb 24 2025, 10:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
School Holidays

School Holidays

School Holidays : తెలుగు రాష్ట్రాల విద్యార్థులకే కాదు ఉద్యోగులకు గుడ్ న్యూస్. ఆంధ్ర ప్రదేశ్ తో పాటు తెలంగాణలో రేపు (మంగళవారం) ఒక్కరోజే స్కూళ్లు, కాలేజీలు, కార్యాలయాలు నడిచేంది. ఎల్లుండి అంటే ఫిబ్రవరి 26న తెలుగు రాష్ట్రాల్లో అధికారిక సెలవు ఉంది. ఆ తర్వాతిరోజు ఫిబ్రవరి 27న కూడా పలు జిల్లాల్లో విద్యాసంస్థలు మూతపడనున్నాయి... ప్రభుత్వ ఉద్యోగులకు కూడా సెలవు వుండనుంది. ఇలా ఈ నెల చివర్లో వరుసగా రెండురోజులు సెలవు రావడం విద్యార్థులు, ఉద్యోగులు ఎగిరిగంతేస్తున్నారు. 

అంటే రేపు మంగళవారం ఒక్కరోజే తెలుగు రాష్ట్రాల్లో విద్యాసంస్థలు నడిచేది. ఫిబ్రవరి 26న శివరాత్రి సందర్భంగా సెలవు ఉంది. ఆ తర్వాతి రోజు ఫిబ్రవరి 27న ఇటు తెలంగాణ, అటు ఆంధ్ర ప్రదేశ్ లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఉంది. దీంతో ఎన్నికలు జరిగే జిల్లాల్లో ప్రభుత్వ విద్యాసంస్థలు,  ఎమ్మెల్సీ ఓటుహక్కు కలిగిన ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు ఉంటుంది. 

ప్రైవేట్ విద్యాసంస్థల ఉపాధ్యాయులు కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొంటారు... కాబట్టి ఆరోజు క్లాసులు నడిచే అవకాశాలుండవు. కొన్ని విద్యాసంస్థలు తమ ఉద్యోగుల సౌకర్యార్థం సెలవు కూడా ఇచ్చే అవకాశాలున్నాయి. ఇలా ఫిబ్రవరిలో వరుసగా రెండురోజులు సెలవు వస్తోంది... రెండ్రోజులు మళ్ళీ స్కూల్ కి పోతే ఆదివారం వచ్చేస్తుంది. ఇలా ఈ వారం సెలవులతో గడిచిపోతుంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
Shivaratri and MLC Elections

Shivaratri and MLC Elections

తెలుగు రాష్ట్రాల్లోని ఏయే జిల్లాల్లో సెలవు ఉంటుందంటే..: 

తెలంగాణలో మూడు, ఆంధ్ర ప్రదేశ్ లో మూడు... ఇరు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే నోటిఫికేషన్ వెలువడి నామినేషన్ ప్రక్రియ ముగిసింది... ప్రధాన పార్టీల అభ్యర్థులే కాదు ఇండిపెండెంట్ అభ్యర్థులు భారీగా బరిలోకి దిగారు. ఈ క్రమంలో ప్రచారం జోరుగా సాగుతోంది. 

తెలంగాణలో ఉమ్మడి మెదక్-నిజామాబాద్-కరీంనగర్-ఆదిలాబాద్ స్థానానికి గ్రాడ్యుయేట్ తో పాటు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నారు. ఈ నాలుగు జిల్లాల్లోని గ్రాడ్యుయేషన్ పట్టభద్రులతో పాటు ప్రభుత్వ ఉపాధ్యాయులు ఓటుహక్కు వినియోగించుకుంటారు. ఇక ఉమ్మడి నల్గొండ-వరంగల్-ఖమ్మం స్థానానికి టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతోంది... అంటే ఈ మూడు జిల్లాల్లో కేవలం ప్రభుత్వం ఉపాధ్యాయులు మాత్రమే ఓటుహక్కును వినియోగించుకుంటారు. 

ఇలా గ్రాడ్యుయేట్స్, టీచర్లు ఎన్నికల్లో పాల్గొని ఓటింగ్ శాతాన్ని పెంచేలా చూడాలిన ఇప్పటికే ఎన్నికల కమీషన్ ఆయా జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులను ఆదేశించింది. దీంతో ఓటుహక్కు కలిగిన ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక సెలవు ఇస్తున్నారు. అలాగే ప్రైవేట్ సంస్థలు కూడా తమ ఉద్యోగులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకునే వెసులుబాటు కల్పించాలని కలెక్టర్లు ఆదేశించారు. 

ఆంధ్ర ప్రదేశ్ లోనూ మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.  ఉమ్మడి తూర్పు గోదావరి- పశ్చిమ గోదావరి, ఉమ్మడి కృష్ణా-గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంతో పాటు శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు ఉన్నాయి. ఇప్పటికే జోరుగా ప్రచారం సాగుతుండగా ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనుంది.  
 

33
Wines Bandh in Telangana

Wines Bandh in Telangana

తెలంగాణలో వైన్స్ బంద్ :

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో రేపు(మంగళవారం) వైన్స్ మూతపడనున్నాయి. ఫిబ్రవరి 25 సాయంత్రం 4 గంటల నుండి తిరిగి ఫిబ్రవరి 27 సాయంత్రం నాలుగు గంటలవరకు అంటే వరుసగా మూడురోజులు మద్యం అమ్మకాలను నిలిపివేస్తారు. కేవలం ఎమ్మెల్సీఎన్నికలు జరిగే జిల్లాల్లోనే మద్యం అమ్మకాలు బంద్ పెడతారు. 

వైన్స్ లతో పాటు బార్లు, పబ్బుల్లో కూడా మద్యం విక్రయాలపై నిషేదం ఉంటుంది. ఫిబ్రవరి 27న ఉదయం 8 గంటల  నుండి సాయంత్రం 4 గంటలవరకు ఎమ్మెల్సీ పోలింగ్ జరుగుతుంది. ఆ తర్వాత మద్యం విక్రయాలు ప్రారంభించుకోవచ్చు. హైదరాబాద్ పరిధిలోని పలు ప్రాంతాలకు కూడా ఎన్నికల కోడ్ వర్తిస్తుంది...కాబట్టి ఆయా ప్రాంతాల్లో వైన్స్ లు మూతపడనున్నాయి. 

తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రదేశ్ లో కూడా మద్యం విక్రయాలపై ఆంక్షలు ఉండే అవకాశం ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే జిల్లాల్లో మద్యం విక్రయాలు ఉండకపోవచ్చు. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. 
 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Weather Update: తీవ్రమైన ఈదురుగాలులు.. ఏపీ, తెలంగాణలోని ఈ ప్రాంతాలకు భారీ వర్షల హెచ్చరిక
Recommended image2
హైద‌రాబాదీల‌కు అల‌ర్ట్‌.. ఆదివారం ఈ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్ష‌లు, పూర్తి వివరాలు
Recommended image3
రైల్లో ఎవ‌రైనా నీళ్లు ఇస్తే తాగుతున్నారా.? వెలుగులోకి కొత్త ర‌కం మోసం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved