MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • School Holidays : ఈ నెలలో మరిన్ని సెలవులు ... ఆ స్కూళ్లకు ఎక్ట్రా హాలిడే

School Holidays : ఈ నెలలో మరిన్ని సెలవులు ... ఆ స్కూళ్లకు ఎక్ట్రా హాలిడే

తెలుగు విద్యార్థులకు ఇప్పటికే న్యూఇయర్, సంక్రాంతి అంటూ చాలా సెలవులు వచ్చాయి.  అయితే ఈ నెలలోనే ఇంకో సెలవు రాబోతోంది.. ఎప్పుడో తెలుసా?

2 Min read
Author : Arun Kumar P
| Updated : Jan 21 2025, 03:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
school holidays

school holidays

School Holidays : తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సెలవులు ముగిసాయి. తెలంగాణలో గత శనివారమే స్కూళ్లు ప్రారంభంకాగా ఆంధ్ర ప్రదేశ్ లో నిన్నటి (సోమవారం) నుండి ప్రారంభమయ్యాయి. గతవారం మొత్తం సెలవులతోనే గడిచిపోయింది... పండక్కి సొంతూళ్లకు వెళ్లిన స్టూడెంట్ బాగా ఎంజాయ్ చేసారు. అబ్బాయిలు పతంగులు ఎగరేస్తూ, అమ్మాయిలు రంగురంగుల ముగ్గులు వేసి, పిండివంటలు రుచిచూస్తూ, గంగిరెద్దులు, కోళ్లపందాలు, సినిమాలు... అబ్బో మామూలు ఎంజాయ్ కాదు. 

ఇలా సంక్రాంతి సెలవుల్లో ఆనందంగా గడిపిన స్టూడెంట్స్ స్కూల్ బాట పట్టారు. పండక్కి సొంతూళ్లకు వెళ్లినవారు ఇప్పటికే నగరాలకు చేరుకున్నారు... ఇలా దాదాను వారంరోజులు ఖాళీగా కనిపించిన హైదరాబాద్ మళ్లీ కళకళలాడుతోంది. స్కూల్ బస్సులు మళ్లీ రోడ్డెక్కాయి... విద్యార్థులు ఉసూరుమంటూ స్కూళ్లకు వెళుతున్నారు. సంక్రాంతి సెలవుల్లో చేసిన హంగామాను గుర్తుచేసుకుంటూ మళ్ళీ సెలవులు ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తున్నారు.  

అయితే సంక్రాంతి సెలవుల ముగిసాయన్న బాధను మరిపించేలా ఈ జనవరితో స్కూళ్లకు మరికొన్ని సెలవులు వస్తున్నాయి. తెలంగాణలోని మైనారిటీ విద్యాసంస్థలకు ఓ సెలవు ఎక్ట్రాగా వస్తోంది. ఈ సెలవుల గురించి తెలుసుకుందాం. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
school holidays

school holidays

ఈ నెలలో స్కూళ్లకు ఇంకెన్ని సెలవులు : 

తెలంగాణ ప్రభుత్వం ఈ సంక్రాంతికి విద్యాసంస్థలకు ఐదురోజులే సెలవులు ఇచ్చింది. కానీ రెండో శనివారం, ఆదివారం కలిసిరావడంతో ఏడురోజులు సెలవులు వచ్చాయి. ఇక శనివారం విద్యాసంస్థలు ప్రారంభం కావడంలో ఆరోజు కూడా చాలామంది స్కూల్ కు వెళ్లలేదు. తర్వాత ఆదివారం సెలవురోజు. ఇలా వరుసగా తొమ్మిదిరోజులు సెలవులు తీసుకున్ని విద్యార్థులు నిన్నటి నుండి స్కూళ్లకు వెళుతున్నారు. 

ఇక మార్చి, ఏప్రిల్ మొత్తం ఎగ్జామ్స్ సీజన్. ఈ రెండు నెలలు విద్యార్థులు పుస్తకాలతో కుస్తీ పట్టాల్సిందే. ఇలా చదువు ధ్యాసలో పడి బాగా ఒత్తిడికి గురయ్యే విద్యార్థులు సెలవు వస్తే కాస్త రిలాక్స్ అవుతారు. అయితే సంక్రాంతి పండక్కి భారీగా సెలవులు వచ్చిన ఈ నెలలోనే మరికొన్ని సెలవులు విద్యాసంస్థలకు వస్తున్నాయి. 

జనవరి 26 దేశ గణతంత్ర దినోత్సవం (రిపబ్లిక్ డే) సందర్భంగా నేషనల్ హాలిడే వుంది. కానీ ఇది ఆదివారం వస్తోంది. ఈరోజు ఎలాగూ హాలిడే వుంటుంది...కాబట్టి ఓ సెలవును విద్యార్థలు మిస్సయ్యారు. అయితే ప్రభుత్వ, ప్రైవేట్ హాస్టల్స్ లో వుండే విద్యార్థులు, పదో తరగతి స్టూడెంట్స్ స్పెషల్ క్లాసుల నుండి కాస్త విరామం లభిస్తుంది. 

ఇక సోమవారం ఒక్కరోజు స్కూల్ కి వెళితే మళ్లీ మంగళవారం మైనారిటీ విద్యార్థులకు సెలవు వుంటుంది. జనవరి 28న షబ్-ఏ-మేరాజ్ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం విద్యాసంస్థలకు ఐచ్చిక సెలవు ప్రకటించింది. జనవరి నెలలో ఇదే చివరి హాలిడే. ఫిబ్రవరిలో కూడా స్కూళ్లకు చాలా సెలవులు వున్నాయి. 

33

2025 లో తెలంగాణ విద్యార్థులకు సెలవులివే : 

తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఈ ఏడాది సెలవుల లిస్ట్ ను ప్రకటించింది. 2025 లో జనవరి నుండి డిసెంబర్ వరకు ఏఏ పండగలు, ముఖ్యమైన వేడుకలకు హాలిడేస్ వస్తున్నాయో వెల్లడించారు. ఇలా ఈ ఏడాదిలో మొత్తం 27 సాధారణ సెలవులు, 23 ఆప్షనల్ హాలిడేస్ ను డిక్లేర్ చేసింది రేవంత్ సర్కార్. 

జనవరి 1 న్యూ ఇయర్ తో ప్రారంభమయ్యే ఈ సెలవులు డిసెంబర్ 26 క్రిస్మస్ తర్వాతిరోజు బాక్సింగ్ డే తో ముగుస్తాయి. ఇందులో సంక్రాంతి, దసరా పండగల సమయంలో ఎక్కువరోజులు సెలవులు వస్తాయి. ఇప్పటికే  సంక్రాంతి అయిపోతుంది కాబట్టి ఇక దసరాకే వరుస సెలవులు వచ్చింది. మధ్యలో విద్యార్థులకు సమ్మర్ హాలిడేస్ వస్తాయి. 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
 
3rd TEST • SA vs AUS
Stumps
SASA
329 & 387
AUSAUS
429
Day 4
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Rain Alert: హైద‌రాబాద్‌లో దంచికొట్టిన వ‌ర్షం.. ఈ ప్రాంతాల్లో మ‌రో 3 రోజులు వానలు
Recommended image2
మియాపూర్‌ భూముల వ్య‌హారం ఏంటి? అస‌లు క‌థ ఎప్పుడు మొద‌లైంది? 550 ఎక‌రాలు ఏం చేయ‌నున్నారు?
Recommended image3
PM kisan: పీఎం కిసాన్ 24వ విడత డబ్బులు ఖాతాలో పడలేదా? రైతులు వెంటనే చేయాల్సిన పనులివే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved