MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Telangana
  • Sankranthi Holidays : తెలంగాణలోనూ రేపు కష్టమే ... ఇక సోమవారమే స్కూళ్లకు విద్యార్థులు

Sankranthi Holidays : తెలంగాణలోనూ రేపు కష్టమే ... ఇక సోమవారమే స్కూళ్లకు విద్యార్థులు

తెలంగాణలో నేటితో సంక్రాంతి సెలవులు ముగిసాయి. రేపు రాష్ట్రంలోని స్కూళ్లన్ని పున:ప్రారంభం కానున్నాయి. అయితే పూర్తిస్థాయిలో విద్యార్థులు హాజరయ్యేది మాత్రం సోమవారమే. 

3 Min read
Author : Arun Kumar P
Published : Jan 17 2025, 07:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Sankranthi Holidays

Sankranthi Holidays

Sankranthi Holidays : తెలంగాణలోనూ నేటితో సంక్రాంతి సెలవులు ముగుస్తాయి. రేపటి నుండి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్ళు పున:ప్రారంభం కానున్నాయి. సరిగ్గా వారం రోజుల కిందట అంటే గత శనివారం ప్రారంభమైన సెలవులు నేటితో (శుక్రవారం) ముగుస్తున్నాయి. అయితే రేపు శనివారం ఒక్కరోజే స్కూల్ నడిచేది... మళ్లీ ఎల్లుండి ఆదివారం సెలవు. కాబట్టి రేపు స్కూల్ కు సెలవు తీసుకుంటే సంక్రాంతి సెలవులకు మరో రెండ్రోజులు కలిసివస్తుందని చాలా మంది విద్యార్థులు అభిప్రాయం. ఇలా చేస్తే సంక్రాంతికి మొత్తం 9 రోజులు సెలవు వచ్చినట్లు అవుతుంది. 

సొంతూళ్లకు వెళ్లిన చాలామంది విద్యార్థుల పేరెంట్స్ ఇదే ఆలోచనలో వున్నారు. ఈ వారంలో కేవలం శనివారం ఒక్కరోజే స్కూల్ నడిచేది... ఈరోజు పిల్లలు స్కూల్ కి వెళ్ళకుంటే రెండ్రోజులు కలిసివస్తుంది. కాబట్టి ఈ రెండ్రోజులు కూడా ఊళ్ళలోనే వుండి కుటుంబసభ్యులతో గడపవచ్చని పేరెంట్స్ ఆలోచన. అందువల్లే ఇవాళ(శుక్రవారం) కాకుండా ఆదివారం సాయంత్రం నివాస ప్రాంతాలను చేరుకునేలా ప్లాన్ చేసుకుంటున్నారు. వచ్చే వారం అరంభంనుండే అంటే సోమవారం ఉదయం ప్రెష్ గా పిల్లలను స్కూల్ పంపవచ్చన్నది వారి ఆలోచన. 

ఇక హైదరాబాద్ లో కొన్ని స్కూళ్లకు సాధారణంగానే శని, ఆదివారం సెలవు వుంటుంది. కాబట్టి అలాంటి స్కూల్స్ తిరిగి సోమవారమే ప్రారంభం కానున్నారు. ఆ స్కూల్స్ విద్యార్థులు ఆదివారం వరకు సొంతూళ్లలో ఎంజాయ్ చేయవచ్చు. మిగతా స్కూల్స్ లో కూడా రేపు(శనివారం)ఎక్కువమంది విద్యార్థులు డుమ్మా కొట్టే అవకాశం వుంది... కాబట్టి పూర్తిస్థాయిలో సోమవారమే క్లాసులు ప్రారంభం అవుతాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
Sankranthi Holidays

Sankranthi Holidays

తెలంగాణలో చదివే ఏపీ విద్యార్థుల పరిస్థితి..: 

తెలంగాణలో మరీ ముఖ్యంగా హైదరాబాద్ లో చదివే ఆంధ్రా విద్యార్థులకు కూడా రేపటి నుండే స్కూళ్ళు పున:ప్రారంభం అవుతాయి. కానీ ఇప్పటివరకు ఆంధ్ర ప్రాంతం నుండి హైదరాబాద్ కు తిరుగు ప్రయాణాలు ప్రారంభంకాలేవు. అంటే ఆ విద్యార్థులు పేరెంట్స్ కూడా సోమవారం నుండే పిల్లలను స్కూళ్ళకు పంపే ఆలోచనలో వున్నట్లు అర్థమవుతోంది. 

ఆంధ్ర ప్రదేశ్ లో అధికారికంగానే ఆదివారం వరకు సంక్రాంతి సెలవులు వున్నాయి. కాబట్టి హైదరాబాద్ లో చదివే విద్యార్థులు కూడా అక్కడి విద్యార్థులతో కలిసి ఆదివారం వరకు సెలవులు ఎంజాయ్ చేయనున్నారు. ఆదివారం రాత్రిలోపు పేరెంట్స్ తో కలిసి నగరానికి చేరుకుని సోమవారం నుండి ఫ్రెష్ గా స్కూళ్ళకు వెళ్లనున్నారు. 

ఆదివారం ఏపీ నుండి హైదరాబాద్ కు ప్రయాణాలు ప్రారంభంకానున్నాయి. సంక్రాంతి సెలవుల సమయంలో ఎలాగైన రద్దీ నెలకొందో ఆదివారం కూడా అదే రద్దీ కొనసాగే అవకాశాలున్నాయి. ప్రజా రవాణా వ్యవస్థలైన ఇరురాష్ట్రాల ఆర్టిసికి చెందిన బస్సులు కిక్కిరిసిపోనున్నాయి. తెలుగు రాష్ట్రాల మధ్య నడిచే రైళ్ల పరిస్థితి కూడా అలాగే వుండనుంది. ఇక సొంత వాహనాల్లో వచ్చేవారు మరింకొందరు. ఇలా ఒకేసారి బస్సులు, ఇతర వాహనాలు రోడ్లపైకి రావడంతో ఏపీ,హైదరాబాద్ రూట్స్ మరోసారి రద్దీగా మారనున్నాయి. 
 

33
Sankranthi Holidays

Sankranthi Holidays

జనవరి 2025 లో ఇంకెన్ని సెలవులు? :

జనవరిలో ఇప్పటికే చాలా సెలవులు వచ్చాయి. న్యూ ఇయర్ మొదలు సంక్రాంతి పండక్కి సెలవులే సెలవులు వచ్చాయి. ఇంకా ఈ నెలలో మరో రెండు అధికారిక సెలవులు వున్నాయి. అయితే అందులో ఒకటి జనవరి 26 గణతంత్ర దినోత్సవం కాగా ఇంకోటి షబ్ ఈ మేరాజ్.  కానీ రిపబ్లిక్ డే ఆదివారం వస్తుంద కాబట్టి విద్యార్థులు ఓ సెలవు మిస్ అయినట్లే. 

ముస్లింల పండగ షబ్ ఏ మేరాజ్ సందర్భంగా జనవరి 28 స్కూళ్లకు ఐచ్చిక సెలవు ప్రకటించారు. అంటే ఆరోజు సెలవుపై స్కూల్ యాజమాన్యాలు నిర్ణయం తీసుకుంటాయి. ముఖ్యంగా ముస్లిం మైనారిటీ విద్యాసంస్థలకు ఆ రోజు సెలవు వుంటుంది. 

ఇలా ప్రతిఏడాది లాగే ఈసారి కూడా జనవరిలో స్కూళ్లకు భారీ సెలవులు వచ్చాయి. ఇకపై మొత్తం ఎగ్జామ్స్ సీజన్... విద్యార్థులంతా చదువులో మునిగిపోయే సమయం. ఈ రెండు మూడు నెలల్లో పరీక్షలన్నీ ముగిసి మళ్లీ సమ్మర్ హాలిడేస్ ప్రారంభం అవుతాయి. అప్పుడు మరో నెల రెండు నెలలు విద్యార్థులు సొంతూళ్లకు వెళ్లి ఎంజాయ్ చేయవచ్చు. 


 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.

Latest Videos
Recommended Stories
Recommended image1
LPG: ఇక‌పై ఇళ్ల‌లో గ్యాస్ సిలిండ‌ర్లు క‌నిపించ‌వా.? కేంద్రం కీల‌క అడుగులు
Recommended image2
పేదలకు ప్రభుత్వం శుభవార్త.. రూ.10 లక్షల కవరేజ్‌తో 1,800కు పైగా చికిత్సలు
Recommended image3
వేగంగా మారుతోన్న తెలంగాణ రాజ‌కీయం.. మిషన్ కొండా సురేఖ మొదలైందా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved