తెలంగాణలోని 457 అంగన్‌వాడీలలో రిలయన్స్ ఫౌండేషన్ ‘కహానీ కళా ఖుషీ’
Reliance Foundation's 'Kahani Kala Khushi' : రిలయన్స్ ఫౌండేషన్ 'కహానీ కళా ఖుషీ' మళ్లీ ప్రారంమైంది. రాబోయే కొద్ది వారాల్లో భారతదేశం అంతటా కథలు చెప్పడం, ఇతర కార్యకలాపాల ద్వారా పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలలోని పిల్లలను ప్రేరేపించడానికి ఈ సంవత్సరం కార్యక్రమం బాలల దినోత్సవం రోజున ప్రారంభించారు.
Reliance Foundation, Kahani Kala Khushi, Children’s Day
Reliance Foundation's 'Kahani Kala Khushi' : రిలయన్స్ ఫౌండేషన్ ఎర్లీ చైల్డ్ హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ (ECCE) కార్యక్రమం ‘కహానీ, కళా, ఖుషీ’ అనే ప్రత్యేక చొరవతో తెలంగాణ వ్యాప్తంగా బాలల దినోత్సవాన్ని జరుపుకుంది. ఈ ప్రచారం కింద కథలు చెప్పడం, కళలు, ఆటలు సహా వివిధ కార్యకలాపాలతో చిన్నారి మనస్సులలో సృజనాత్మక ఆలోచనను ప్రేరేపించడం లక్ష్యంగా పెట్టుకుంది.
Reliance Foundation, Kahani Kala Khushi, Children’s Day
తెలంగాణలోనే కాకుండా రాబోయే కొద్ది వారాల్లో భారతదేశం అంతటా కథలు చెప్పడం, ఇతర కార్యకలాపాల ద్వారా పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలలోని పిల్లలను ప్రేరేపించడానికి ఈ సంవత్సరం కార్యక్రమం బాలల దినోత్సవం రోజున రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, ఛైర్‌పర్సన్ అయిన శ్రీమతి నీతా అంబానీ ప్రారంభించారు.
Reliance Foundation, Kahani Kala Khushi, Children’s Day
తెలంగాణ వ్యాప్తంగా 457 అంగన్‌వాడీ కేంద్రాలు (ఏడబ్ల్యూసీ) నవంబర్ 14 - 16 తేదీల్లో వేడుకల్లో పాల్గొంటున్నాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణలోని దాదాపు 8,000 మంది చిన్నారులు పాల్గొననున్నారు. తెలంగాణలో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ (WD&CW) శాఖ భాగస్వామ్యంతో రిలయన్స్ ఫౌండేషన్ ECCE కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.
Reliance Foundation, Kahani Kala Khushi, Children’s Day
‘కహానీ, కళా, ఖుషీ’ ప్రచారంలోని ముఖ్య కార్యకలాపాలు:
కహానీ: ఊహాశక్తిని రేకెత్తించడానికి, భాషా నైపుణ్యాలను పెంపొందించడానికి కథలు చెప్పే సెషన్‌లు.
కళ: సృజనాత్మకతను ప్రోత్సహించడానికి స్టాంపింగ్, కలరింగ్, డ్రాయింగ్‌తో సహా కళ, క్రాఫ్ట్ కార్యకలాపాలు నిర్వహిస్తారు.
ఖుషీ: సంపూర్ణ అభివృద్ధిని ప్రోత్సహించడానికి సంగీతం, ఆటలు, మెమరీ గేమ్‌లు వంటి ప్లే-ఆధారిత కార్యకలాపాలు ఉంటాయి.
Reliance Foundation, Kahani Kala Khushi, Children’s Day
'కహానీ కళ ఖుషీ' కార్యక్రమం కింద భారతదేశంలోని 1,100 కు పైగా అంగన్‌వాడీ కేంద్రాలలో 18,000 మందికి పైగా పిల్లలతో రిలయన్స్ ఫౌండేషన్ బాలల దినోత్సవ వేడుకలు జరుపుకుంటోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ దాతృత్వ విభాగం అయిన రిలయన్స్ ఫౌండేషన్.. వినూత్న- స్థిరమైన పరిష్కారాల ద్వారా భారతదేశ అభివృద్ధి సవాళ్లను ఎదుర్కోవడంలో తమదైన పాత్ర పోషించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, ఛైర్‌పర్సన్ అయిన శ్రీమతి నీతా అంబానీ నేతృత్వంలో గ్రామీణ పరివర్తన, విద్య, ఆరోగ్యం, అభివృద్ధి కోసం క్రీడలు, విపత్తు నిర్వహణ, మహిళా సాధికారత, పట్టణ పునరుద్ధరణ, కళలపై దృష్టి సారించి అందరి శ్రేయస్సుతో పాటు మెరుగైన జీవన నాణ్యత కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. భారతదేశం అంతటా 60,500 గ్రామాలు, పట్టణాలలో 79 మిలియన్లకు పైగా ప్రజల జీవితాలను రిలయన్స్ ఫౌండేషన్ తాకింది. మరిన్ని వివరాలకు www.reliancefoundation.orgలో రిలయన్స్ ఫౌండేషన్‌ని అనుసరించండి.