రూ.40,000 పైగా జీతంతో రైల్వే ఉద్యోగాలు : తెలుగు యువతకు లక్కీ ఛాన్స్
రైల్వే శాఖలో ఉద్యోగం కోసం ప్రయత్నించే అభ్యర్ధులకు మంచి అవకాశం. రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డ్ తాజాగా భారీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. విద్యార్హతల నుండి సాలరీ వయరకు ఈ జాబ్స్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకొండి.
Railway Jobs
Railway Jobs : కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ రైల్వేలో మంచి ఉద్యోగాలను పొందే అద్భుత అవకాశం యువతకు వచ్చింది. ఇండియన్ రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డ్ (RRB) భారీ ఉద్యోగ ఖాళీలను గుర్తించింది... వాటి భర్తీకి సిద్దమవుతోంది. ఇలా రైల్వే మంత్రిత్వ శాఖతో పాటు వివిధ విభాగాల్లో ఖాళీగా వున్న 1,036 ఉద్యోగాల భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలతో కూడిన నోటిఫికేషన్ విడుదలచేసింది రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డ్.
Railway Jobs
పోస్టుల వివరాలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా ఏ పోస్టులను ఎన్ని భర్తీచేయనున్నారో తెలుసుకుందాం.
1. వివిధ సబ్జెక్టుల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు - 187 పోస్టులు
2. స్టైంటిఫిక్ సూపర్వైజర్ (ఎర్గోనమిక్స్ ఆండ్ ట్రైనింగ్) - 3 పోస్టులు
3.వివిధ సబ్జెక్టుల్లో ట్రైన్డ్ గ్రాడ్యూయేట్ టీచర్స్ - 338 పోస్టులు
4. చీఫ్ లా అసిస్టెంట్ - 54 పోస్టులు
5. పబ్లిక్ ప్రాసిక్యూటర్ - 20 పోస్టులు
6. ఫిజికల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్(ఇంగ్లీష్ మీడియం) - 18 పోస్టులు
7. సైంటిఫిక్ అసిస్టెంట్ (ట్రైనింగ్) - 2 పోస్టులు
8. జూనియర్ ట్రాన్స్‌లేటర్ (హిందీ) - 130 పోస్టులు
9. సీనియర్ పబ్లిసిటి ఇన్స్పెక్టర్ - 3 పోస్టులు
10. స్టాఫ్ ఆంఢ్ వెల్పేర్ప్ ఇన్క్పెక్టర్ - 59 పోస్టులు
11. లైబ్రేరియన్ - 10 పోస్టులు
12. మ్యూజిక్ టీచర్ (మహిళలు) - 3
13. వివిధ సబ్జెక్టుల్లో ఫ్రైమరీ రైల్వే టీచర్ - 188 పోస్టులు
14. అసిస్టెంట్ టీచర్ (మహిళలు) (జూనియర్ స్కూల్స్) - 2 పోస్టులు
15. ల్యాబోరేటరీ అసిస్టెంట్ (స్కూల్) - 7 పోస్టులు
16. ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 3 (కెమిస్ట్ ఆండ్ మెటలర్జిస్ట్) - 12 పోస్టులు
Railway Jobs
విద్యార్హతలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా రైల్వే శాఖలో భర్తీచేయనున్న ఉద్యోగాలకు కనీస విద్యార్హతలు ఇంటర్మీడియట్. అయితే ఒక్కో పోస్టుకు ఒక్కోలా విద్యార్హతలు వున్నాయి. టీచర్ పోస్టులకు బ్యాచిలర్ ఆఫ్ మాస్టర్స్ డిగ్రీ కలిగివుండాలి. అలాగే బి.ఎడ్, డి.ఎడ్ పూర్తిచేసి టెట్ కు అర్హత సాధించి వుండాలి. అలాగే పబ్లిక్ ప్రాసిక్యూటర్, చీఫ్ లా అసిస్టెంట్ వంటి పోస్టులకు న్యాయశాస్త్రంలో పట్టభద్రులై వుండాలి. లైబ్రెరియన్, మ్యూజిక్ టీచర్, ల్యాబోరేటరీ జాబ్స్ ఆయా విభాగాలకు సంబంధించిన విద్యార్హతలు కలిగివుండాలి.
వయోపరిమితి :
అన్ని ఉద్యోగాలకు జనవరి 1, 2015 నాటికి 18 ఏళ్ల కంటే ఎక్కువ వయసు వుండాలి. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్, ఫిజికల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్, మ్యూజిక్ టీచర్, అసిస్టెంట్ టీచర్, ప్రైమరీ రైల్వే టీచర్,ల్యాబోరేటరీ అసిస్టెంట్ ఉద్యోగాలకు 18 నుండి 48 ఏళ్లలోపు వయసుండాలి. ఇక సైంటిఫిక్ సూపర్వైజర్, సైంటిఫిక్ అసిస్టెంట్ ఉద్యోగాలకు 18 నుండి 38 ఏళ్ల వయసుండాలి. చీఫ్ లా అసిస్టెంట్ ఉద్యోగానికి ప్రయత్నించే అభ్యర్థులకు 18 నుండి 43 ఏళ్ల వయసుండాలి. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉద్యోగానికి 18 నుండి 35 ఏళ్ళ వయసుండాలి.
జూనియర్ ట్రాన్స్‌లేటర్, సినియర్ పబ్లిసిటి ఇన్స్పెక్టర్, స్టాఫ్ ఆఫ్ పబ్లిసిటి ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకు 18 నుండి 36 ఏళ్లలోపు వయసున్న అభ్యర్థులు అర్హులు. ఇక పబ్లిక్ ప్రాసిక్యూటర్ 18-35, లైబ్రేరియన్ 18-33, ల్యాబ్ అసిస్టెంట్ 18-33 ఏళ్లలోపు వయసుండే అభ్యర్ధులు అర్హులు.
Railway Jobs
దరఖాస్తు విధానం :
రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డ్ విడుదల చేసిన ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ వచ్చే ఏడాది 2025 జనవరిలో ప్రారంభం అవుతుంది. దరఖాస్తు ప్రక్రియ 07-01-2025 నుండి 06-02-2025 వరకు కొనసాగుతుంది. అంటే సరిగ్గా నెలరోజుల పాటు దరఖాస్తు చేసుకోడానికి సమయం వుంటుంది. ఎలాంటి సమస్యలు లేకుండా వుండాలంటే చివరిక్షణంలో కాకుండా ముందుగానే దరఖాస్తు చేసుకోవాలి.
అభ్యర్థులు దరఖాస్తూ ఫీజు రూ.500 చెల్లించాల్సి వుంటుంది. ఎస్సి,ఎస్టి, ఓబిసి, ఈడబ్యూ ఎస్, మహిళా, ఎక్స్ సర్విస్ మెన్, పిడబ్ల్యూబిడి అభ్యర్థులు కేవలం రూ.250 దరఖాస్తు చెల్లించాల్సి వుంటుంది. రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డ్ అధికారిక వెబ్ సైట్ https://rrbapppy.gov.in/ దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక ప్రక్రియ :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు వివిధ దశల్లో పరీక్షిస్తారు. పలు పోస్టులకు కంప్యూటర్ బెస్డ్ టెస్ట్ (సిబిటి), స్కిల్ టెస్ట్ వుంటుంది. అలాగే సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇలా పలురకాలుగా పరీక్షించిన ఉద్యోగులకు ఎంపిక చేస్తారు.
Railway Jobs
సాలరీ వివరాలు :
1. వివిధ సబ్జెక్టుల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు - 47,600 రూపాయలు
2. స్టైంటిఫిక్ సూపర్వైజర్ (ఎర్గోనమిక్స్ ఆండ్ ట్రైనింగ్) - 44,900 రూపాయలు
3.వివిధ సబ్జెక్టుల్లో ట్రైన్డ్ గ్రాడ్యూయేట్ టీచర్స్ - 44,900 రూపాయలు
4. చీఫ్ లా అసిస్టెంట్ - 44,900 రూపాయలు
5. పబ్లిక్ ప్రాసిక్యూటర్ - 44,900 రూపాయలు
6. ఫిజికల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్(ఇంగ్లీష్ మీడియం) - 44,900 రూపాయలు
7. సైంటిఫిక్ అసిస్టెంట్ (ట్రైనింగ్) - 35,400 రూపాయలు
8. జూనియర్ ట్రాన్స్‌లేటర్ (హిందీ) - 35,400 రూపాయలు
9. సీనియర్ పబ్లిసిటి ఇన్స్పెక్టర్ - 35,400 రూపాయలు
10. స్టాఫ్ ఆంఢ్ వెల్పేర్ప్ ఇన్క్పెక్టర్ - 35,400 రూపాయలు
11. లైబ్రేరియన్ - 35,400 రూపాయలు
12. మ్యూజిక్ టీచర్ (మహిళలు) - 35,400 రూపాయలు
13. వివిధ సబ్జెక్టుల్లో ఫ్రైమరీ రైల్వే టీచర్ - 188 పోస్టులు
14. అసిస్టెంట్ టీచర్ (మహిళలు) (జూనియర్ స్కూల్స్) - 35,400 రూపాయలు
15. ల్యాబోరేటరీ అసిస్టెంట్ (స్కూల్) - 25,500 రూపాయలు
16. ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 3 (కెమిస్ట్ ఆండ్ మెటలర్జిస్ట్) - 19,900 రూపాయలు