హరీష్ డౌట్: కేసీఆర్ మంత్రివర్గంలోకి కేటీఆర్, సబిత

First Published 8, Jun 2019, 9:49 AM IST

హైదరాబాద్: కాంగ్రెసుకు చెందిన 12 మంది శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)లో చేరిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మంత్రివర్గ విస్తరణ చేపట్టవచ్చుననే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. సిఎల్పీని టీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేయాలని కోరుతూ 12 మంది కాంగ్రెసు సభ్యులు స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డికి లేఖ ఇచ్చారు. అయితే, దాన్ని విలీనంగా కాకుండా చీలికగా పేర్కొంటూ అధికారిక ప్రకటన వెలువడింది.

టీఆర్ఎస్ లో చేరిన ఇద్దరికి కేసీఆర్ మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉంది. తన మంత్రివర్గంలో ఇద్దరు మహిళలకు చోటు కల్పిస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు సబితా ఇంద్రారెడ్డికి మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంది. ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ లేదా ఆలేరు శానససభ్యురాలు గొంగడి సునీతను మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉంది

ప్రస్తుత మంత్రివర్గంలో ఖమ్మం జిల్లాకు ప్రాతినిధ్యం లేదు. దీంతో కాంగ్రెసును వీడి టీఆర్ఎస్ లో చేరిన వనమా వెంకటేశ్వర రావుకు మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. వనమా వెంకటేశ్వర రావు సీనియర్ ఎమ్మెల్యే కూడా.

విస్తరణలో తన తనయుడు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుకు కేసీఆర్ మంత్రివర్గంలో చోటు కల్పిస్తారని తెలుస్తోంది. అయితే, హరీష్ రావును మంత్రివర్గంలోకి తీసుకుంటారా లేదా అనేది తెలియడం లేదు. హరీష్ భవిష్యత్తు ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది.

ఇదిలావుంటే, గుత్తా సుఖేందర్ రెడ్డిని శాసనమండలికి ఎంపిక చేసి, ఆయనకు మంత్రి పదవి ఇస్తారంటూ ప్రచారం సాగింది. అయితే, ఇటీవల నవీన్ రావును ఎమ్మెల్సీగా ఎంపిక చేయించుకున్న కేసీఆర్ గుత్తా సుఖేందర్ రెడ్డిని పక్కన పెట్టారు. అయితే, ఎమ్మెల్సీల అనర్హత అంశం కోర్టులో తేలితే తప్ప గుత్తాకు ఎమ్మెల్సీ అయ్యే అవకాశం లేదు. దీంతో ఆయనను మంత్రివర్గంలోకి తీసుకుంటారా, లేదా అనేది తెలియడం లేదు.

loader