అందరి ఫోకస్ సాగర్‌పైనే: కాంగ్రెస్‌కి చావో రేవో,అభ్యర్ధి ఎంపికకు కేసీఆర్ కసరత్తు
నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికపై ప్రధాన రాజకీయ పార్టీలు కేంద్రీకరించాయి. ఈ ఎన్నికల్లో చావో రేవో తేల్చుకోవాలని భావిస్తున్నాయి

:తెలంగాణలో పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయ్యాయి. ఇక నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలపై ప్రధాన రాజకీయపార్టీలు దృష్టిపెట్టాయి.

నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో విజయం సాధించడం టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించాల్సిన అనివార్య పరిస్థితులు కాంగ్రెస్ కు ఉన్నాయి.

రాష్ట్రంలో టీఆర్ఎస్ కు తాము ప్రత్యామ్నాయమని బీజేపీ నేతలు కూడ రాష్ట్రంలో ప్రచారం చేసుకొంటున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారు. దీంతో నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో విజయం సాధించి రాష్ట్రంలో బీజేపీకి తామే ప్రత్యామ్నాయమని చాటి చెప్పాలని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భావిస్తోంది.

నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానం నుండి మరోసారి సీనియర్ కాంగ్రెస్ నేత జానారెడ్డి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ స్థానం నుండి ఆయన ఏడు దఫాలు విజయం సాధించారు. గత ఎన్నికల్లో నోముల నర్సింహ్మయ్య చేతిలో ఓటమి పాలయ్యాడు.

దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో ముందుగానే కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్ధిని ప్రకటించింది. నియోజకవర్గంలో జానారెడ్డి ఇప్పటికే విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.

టీఆర్ఎస్, బీజేపీలు ఇంకా అభ్యర్ధులను ప్రకటించలేదు. ఈ స్థానానికి ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 23న నోటిఫికేషన్ విడుదల కానుంది.

నిడమనూరు మండలానికి చెందిన యాదవ సామాజికవర్గానికి చెందిన గురవయ్యను టీఆర్ఎస్ బరిలోకి దింపే అవకాశం ఉంది. బీజేపీ అభ్యర్ధి వేటలో ఉంది. టీఆర్ఎస్ అసంతృప్తులను తమ వైపునకు తిప్పుకొనేందుకు ఆ పార్టీ నాయకత్వం ప్రయత్నాలు చేస్తోందనే ప్రచారం కూడ రాజకీయ వర్గాల్లో నెలకొంది.

సీపీఐ, సీపీఎంలు ఉమ్మడి అభ్యర్ధిని బరిలోకి దింపాలని భావిస్తున్నాయి. దళిత్ శక్తి ప్రోగ్రాం నేతలు కూడ ఈ నియోజకవర్గంలో పోటీ చేయాలని భావిస్తున్నారు. కొంత కాలంగా నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.

ఈ నియోజకవర్గం నుండి టీడీపీ తన అభ్యర్ధిని బరిలోకి దించింది. అరుణ్ కుమార్ ఈ స్థానం నుండి పోటీ చేస్తున్నట్టుగా ఆ పార్టీ ప్రకటించింది. నియోజకవర్గంలో ఆయన ప్రచారం నిర్వహిస్తున్నారు.

దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికను టీఆర్ఎస్ సీరియస్ గా తీసుకొంది.ఈ కారణంగానే హలియాలో గత మాసంలో ఆయన సభలో పాల్గొన్నారు. ఈ సభలోనే పలు అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను నియోజకవర్గానికి కేసీఆర్ ప్రకటించారు.

దళితుల ఓట్లను లక్ష్యంగా చేసుకొని దళిత్ శక్తి కార్యకర్తలు గత రెండు నెలలుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నియోజకవర్గం నుండి బరిలోకి దిగే అభ్యర్ధులను దళిత్ శక్తి నేతలు ప్రకటించనున్నారు.

ఈ స్థానం నుండి పోటీకి నోముల నర్సింహ్మయ్య తనయుడు భగత్ కూడ ఆసక్తిగా ఉన్నారు. అయితే స్థానికులకే సీటు ఇవ్వడానికే టీఆర్ఎస్ నాయకత్వం మొగ్గు చూపుతోందనే ప్రచారం సాగుతోంది. రెండు మూడు రోజుల్లోనే అభ్యర్ధిని ప్రకటించే అవకాశం ఉంది.