నాగార్జునసాగర్ బైపోల్: గెలుపు కోసం టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల వ్యూహాలివీ....
నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో విజయం కోసం ప్రధాన పార్టీలు వ్యూహాలను రచిస్తున్నాయి.

నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో విజయం కోసం కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీలు వ్యూహాలు రచిస్తున్నాయి.

ఈ ఏడాది ఏప్రిల్ 17వ తేదీన ఈ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. గత ఏడాది డిసెంబర్ 1వ తేదీన నోముల నర్సింహ్మయ్య మరణించడంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది.

గత ఏడాది దుబ్బాక అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో ఈ స్థానంలో విజయం సాధించాలని టీఆర్ఎస్ పట్టుదలగా ఉంది. అంతేకాదు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడ బీజేపీ మెరుగైన ఫలితాలను సాధించింది.ఈ రెండు ఎన్నికల్లో టీఆర్ఎస్ కు బీజేపీ రాజకీయంగా ఇబ్బందులు కల్గించింది.

ఈ స్థానం నుండి విజయం సాధించేందుకు గాను టీఆర్ఎస్ కొంత కాలం నుండి వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 10న హలియాలో బహిరంగ సభ నిర్వహించారు.ఈ సభలో కేసీఆర్ నాగార్జునసాగర్ ప్రజలకు వరాలు కురిపించారు.

ఈ ఎన్నికల్లో చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి కాంగ్రెస్కు నెలకొంది. రాష్ట్రంలో టీఆర్ఎస్ కి ప్రత్యామ్నాయం బీజేపీ యా, తామో తేల్చుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ జానారెడ్డిని బరిలోకి దింపింది. ఈ స్థానం నుండి జానారెడ్డి ఏడు దఫాలు విజయం సాధించాడు. జానారెడ్డికి సమఉజ్జీగా ఉండే అభ్యర్ధిని బరిలోకి దింపేందుకు బీజేపీ, టీఆర్ఎస్ లు ప్రయత్నాలు చేస్తున్నాయి.

నోముల నరసింహయ్య తనయుడు ఈ స్థానం నుండి పోటీకి ఆసక్తిగా ఉన్నారు. అయితే ఇదే నియోజకవర్గంలోని యాదవ సామాజికవర్గానికి చెందిన వారిని టీఆర్ఎస్ బరిలోకి దింపాలని భావిస్తోంది. ఈ విషయమై టీఆర్ఎస్ నాయకత్వం సర్వేలను నిర్వహిస్తోంది. స్థానిక నాయకులతో సీఎం కేసీఆర్ ఫోన్ లో మాట్లాడారు.

సానుభూతి పవనాలు ఈ ఎన్నికల్లో పనిచేయకపోవచ్చనే అభిప్రాయంతో పార్టీలున్నాయి. దుబ్బాక అసెంబ్లీ ఉపఎన్నికల ఫలితాలను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.

నోముల నర్సింహ్మయ్య ఈ స్థానానికి స్థానికేతరుడు. దీంతో ఆయన కుటుంబానికి సీటు ఇవ్వడం కేంటే స్థానికంగా ఉన్న యాదవ సామాజికవర్గానికి చెందిన నేతలకు సీటు ఇవ్వాలని టీఆర్ఎస్ చీఫ్ భావిస్తున్నారు.

నిడమనూరు మండలానికి చెందిన కట్టెబోయిన గురవయ్యను బరిలోకి దింపాలని యోచిస్తున్నట్టుగా సమాచారం. గుర్వయ్యతో పాటు మరో ఇద్దరి పేర్లను కూడ కేసీఆర్ పరిశీలిస్తున్నారని తెలుస్తోంది.

ఈ నియోజకవర్గంలో బీజేపీకి బలమైన అభ్యర్ధి లేరు. దుబ్బాకలో రఘునందన్ రావు లాంటి నేత కారణంగా ఉప ఎన్నికల్లో కలిసివచ్చింది. అయితే టీఆర్ఎస్ లో టిక్కెట్టు దక్కకపోతే అసంతృప్తితో పార్టీ మారే నేతలకు పార్టీ టిక్కెట్టు ఇవ్వాలని బీజేపీ నాయకత్వం ఓ ఆఫ్షన్ గా ఎంచుకొంది.

గత ఎన్నికల్లో పోటీకి దిగిన నివేదిత రెడ్డి కూడ మరోసారి పోటీకి ఆసక్తిగా ఉంది. టీడీపీ నుండి బీజేపీలో చేరిన కడారి అంజయ్య యాదవ్ , డాక్టర్ రవినాయక్ తదితరులు కూడ పోటీకి ఆసక్తిగా ఉన్నారు.

ప్రత్యర్ధులను దెబ్బతీసే విజయం వైపుగా ఎవరు వెళ్తారో అనే విషయమై బీజేపీ నాయకత్వం ప్లాన్ చేస్తోంది.