- Home
- Telangana
- Wines Bandh : ఈ మూడ్రోజులు తెలంగాణోళ్ళకు కష్టమే ... చల్లని బీర్ తాగాలన్నా బార్డర్ క్రాస్ చేయాల్సిందే
Wines Bandh : ఈ మూడ్రోజులు తెలంగాణోళ్ళకు కష్టమే ... చల్లని బీర్ తాగాలన్నా బార్డర్ క్రాస్ చేయాల్సిందే
తెలంగాణలో వరుసగా మూడురోజులు మద్యం అమ్మకాలు క్లోజ్ కానున్నాయి. హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా చాలాప్రాంతాల్లో వైన్స్ బంద్ కానున్నాయి. ఈ ప్రాంతాలేవో తెలుసుకుందాం.

Liquor Shops Bandh in Telangana
Liquor Shops Bandh in Telangana : కొందరు ఫుడ్ లేకుండా అయినా ఉంటారుగానీ మందు లేకుండా ఉండలేరు. కడుపులో చుక్క పడకుంటే వారికి ఏమీ తోచదు... ముఖ్యంగా పల్లెల్లో వ్యవసాయ, దినసరి కూలీలు కల్లు లేకుండా ఉండలేరు. శారీరక కష్టం చేసేవాళ్లు ఒళ్లునొప్పుల నుండి ఉపశమనం కోసం సాయంత్రమైతే చాలు మద్యం సేవిస్తారు. ఇక యువత సరదా కోసం మందు తాగుతారు. కొందరు మద్యానికి బానిసలుగా ఉంటారు. ఇలా నిత్యం మద్యం సేవించే అలవాటున్నవారికి తెలంగాణ సర్కార్ షాక్ ఇస్తోంది.
తెలంగాణలో వరుసగా మూడురోజులపాటు మద్యం దొరకకుండా చర్యలు తీసుకుంది. కేవలం వైన్స్ లే కాదు బార్లు, పబ్ లు ఎక్కడా కూడా మద్యం అమ్మకాలు చేపట్టకూడదని ప్రకటించింది. ఇలా పిబ్రవరి 25 నుండి 27 వరకు మద్యం అమ్మకాలను నిలిపివేయాలని రేవంత్ సర్కార్ ఆదేశాలు జారీచేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఇలా మద్యం అమ్మకాలను నిలిపివేస్తున్నారు.
తెలంగాణలో ఓ గ్రాడ్యుయేట్, రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే అన్నిపార్టీలు జోరుగా ప్రచారం సాగిస్తున్నాయి... ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి కూడా రంగంలోకి దిగి కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేపట్టారు. ఫిబ్రవరి 27న కీలకమైన పోలింగ్ జరగనుంది... ఈ క్రమంలోనే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా, ఓటర్లను ప్రలోభపెట్టే వీలులేకుండా మద్యం అమ్మకాలను నిలిపివేసారు.
Wine Shops Bandh in Telangana
హైదరాబాద్ లో కూడా వైన్స్ బంద్ :
తెలంగాణలోని మొత్తం ఏడు జిల్లాల పరిధిలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఉమ్మడి మెదక్-నిజామాబాద్-కరీంనగర్-ఆదిలాబాద్ స్థానంలో గ్రాడ్యుయేట్ తో పాటు టీచర్ ఎమ్మెల్సీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక ఉమ్మడి నల్గొండ-వరంగల్-ఖమ్మం స్థానంలో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతోంది. ఫిబ్రవరి 27న ఈ మూడు స్థానాలకు పోలింగ్ జరుగుతుంది.
ఇలా ఎన్నికలు జరిగే ఏడు జిల్లాల్లో ఫిబ్రవరి 25 అంటే మంగళవారం సాయంత్రం 4 గంటలకు మద్యం అమ్మకాలు నిలిచిపోతాయి. వైన్స్ తో పాటు బార్లు, పబ్బుల్లోనూ మద్యం అమ్మకాలు చేపట్టడానికి వీల్లేదు. ఫిబ్రవరి 26న పూర్తిగా మద్యం అమ్మకాలు ఉండవు... ఇక ఫిబ్రవరి 27న సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగుస్తుంది. అప్పటివరకు వైన్స్ షట్టర్స్ క్లోజ్ ఉంటాయి.
ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నాయి. కాబట్టి నగరంలోకి కొన్ని ప్రాంతాల్లో కూడా రేపట్నుంచి మద్యం అమ్మకాలు ఉండవు. పటాన్ చెరు, రామచంద్రాపురం, బీరంగూడ, లింగంపల్లి ప్రాంతాలతో పాటు కొల్లూరులోనూ వైన్స్ మూతపడతాయి.
అయితే కేవలం ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే జిల్లాల్లోనే మద్యం అమ్మకాలు నిలిపివేస్తారు. మిగతాజిల్లాల్లో యధావిధిగా మద్యం విక్రయాలు జరుగుతాయి. అంటే ఈ మూడురోజులు ఆ ఏడు జిల్లాల ప్రజలు మద్యం సేవించాలంటే బార్డర్ దాటాల్సిందే. ఫిబ్రవరి 26న శివరాత్రి... ఆ రోజు మద్యం దుకాణాలు మూసివుంచాలన్న ప్రభుత్వ నిర్ణయంపై శివభక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
MLC Elections in Andhra Pradesh And Telangana
ఆంధ్ర ప్రదేశ్ లో ఎమ్మెల్సీ ఎన్నికలు :
తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రదేశ్ లోనూ మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉమ్మడి తూర్పు గోదావరి- పశ్చిమ గోదావరి, ఉమ్మడి కృష్ణా-గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంతో పాటు శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు ఉన్నాయి. ఇప్పటికే జోరుగా ప్రచారం సాగుతుండగా ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనుంది.
ఇలా ఇరురాష్ట్రాల్లో ఎమ్మెల్సీ పోలింగ్ నేపథ్యంలో ఆయా జిల్లాల్లో టీచర్లకు సాధారణ సెలవు ఇవ్వనున్నారు. అలాగే ఎమ్మెల్సీ ఓటుహక్కు కలిగిన ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ప్రత్యేక సెలవు ఇవ్వనున్నారు. ఇక ప్రైవేట్ ఉద్యోగాలు చేసే గ్రాడ్యుయేట్స్ కు ఓటుహక్కు వినియోగించుకునేందుకు ప్రత్యేక అనుమతి ఇవ్వాలని ఆయా జిల్లాల కలెక్టర్లు సూచించారు.
ఫిబ్రవరి 26న శివరాత్రికి తెలుగు రాష్ట్రాల్లో అందరికీ సెలవు ఉంటుంది. ఆ తర్వాతరోజే ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్. అయితే వరుసగా రెండు రోజులు సెలవు వచ్చిందని ఓటుహక్కు కలిగినవారు ఎక్కడికీ వెళ్లకూడదని... ఓటుహక్కును వినియోగించుకోవాలని సూచిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు మీరు ఓటు అనే అస్త్రాన్ని ఉపయోగించాలని ఎన్నికల సంఘం సూచిస్తోంది.