School Holidays : వచ్చేవారం సెలవులే సెలవులు ...మార్చి 14,15,16 మూడ్రోజులు పండగే
తెలంగాణలో వచ్చేవారం లాంగ్ వీకేండ్ వస్తోంది. హోలి పండగ వీకెండ్ సెలవులతో కలిసిరావడంతో వరుసగా మూడురోజులు సెలవులు వస్తున్నాయి.

school holidays
School Holidays : ఈ నెలలో తెలంగాణలో విద్యాసంస్థలకు భారీగా సెలవులు రానున్నాయి. మార్చి నెలంత చదువు ఒత్తిడి, పరీక్షలతోనే సరిపోతుంది... ఈ క్రమంతో విద్యార్థులకు ఈ సెలవులు కాస్త ఉపశమనం కల్పిస్తాయి. అయితే ఇప్పటికే రెండో శనివారం, ఆదివారం సెలవులు రాగా వచ్చేవారం వరుసగా మూడ్రోజులు సెలవులు వస్తున్నాయి.
హోలీ పండగ నేపథ్యంలో మార్చి 14న సెలవు ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అంటే వచ్చే శుక్రవారం గవర్నమెంట్ హాలిడే కాబట్టి విద్యాసంస్ధలకే కాదు ఉద్యోగులకు కూడా సెలవు ఉంటుంది. ఆ తర్వాత రెండ్రోజులు కూడా కార్పోరేట్ సంస్థల ఉద్యోగులు, కొన్ని ప్రైవేట్ విద్యాసంస్ధలకు సెలవులు ఉంటాయి. ఇలా వచ్చేవారం వరుసగా మూడురోజులు సెలవులు వస్తున్నాయి.
కాబట్టి తల్లిదండ్రులు, ఇతర కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి ఈ హోలీ పండగను చిన్నారులు ఘనంగా జరుపుకోవచ్చు. ఎలాగూ తర్వాత హోలీ తర్వాత రెండ్రోజులు కూడా సెలవే కాబట్టి రోజంతా రంగుల్లో మునిగితేలుతూ సరదాగా గడపవచ్చు. ఈ మండువేసవిలో చల్లచల్లగా పండగను జరుపుకోవచ్చు.

Holy Holiday
మార్చిలో సెలవులే సెలవులు :
ఈ నెలలో విద్యార్థులు,ఉద్యోగులకు సెలవులు బాగానే రానున్నాయి. ఇప్పటికే ఓ ఆదివారం, ఇవాళ రెండో శనివారం సెలవులు రాగా రేపు ఆదివారం కూడా సెలవే. ఇక మరో రెండు ఆదివారాలు కూడా ఈ నెలలో ఉన్నాయి. అంటే మొత్తంగా నాలుగు ఆదివారాలు, ఓ రెండో శనివారం కలిపి 5 రోజులు సాధారణ సెలవులే వస్తున్నాయి.
ఇక ప్రత్యేక సెలవుల విషయానికి వస్తే మార్చి 14న హోలీ పండక్కి హాలిడే ప్రకటించారు. ఆ తర్వాతిరోజు ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు నడుస్తాయి... కానీ కొన్ని కార్పోరేట్ కంపనీలు, ప్రైవేట్ స్కూళ్లకు శని, ఆదివారం కూడా సెలవే. అంటే వీరికి లాంగ్ వీకెండ్ కలిసివస్తుంది.
ఈ నెలలోనే ముస్లింలు ఎంతో పవిత్రంగా జరుపుకునే రంజాన్, హిందువుల కొత్త సంవత్సరం ఉగాది ఉన్నాయి. ఈ రెండు పండగలు ఒకేసారి రావడంతో మరో లాంగ్ వీకెండ్ వస్తోంది. మార్చి 30న ఉగాది... ఆ రోజు ఆదివారమే కాబట్టి ఎలాగూ సెలవు ఉంటుంది. మార్చి31 న రంజాన్ సెలవు ఉంది... తర్వాత రోజున కూడా తెలంగాణ ప్రభుత్వం సెలవు ఇచ్చింది. కాబట్టి ఏప్రిల్ 1 మంగళవారం కూడా హాలిడేనే.
మొత్తంగా ఈ మార్చిలో ఎనిమిదిరోజులు సెలవులు వస్తున్నాయి. ఇక ప్రతి శనివారం సెలవు ఉండే కార్పోరేట్ సంస్థల ఉద్యోగులు, స్కూల్ విద్యార్థులకు మరో నాలుగు హాలిడేస్ కలిసివస్తాయి. అంటే వీరికి మార్చిలో 12 రోజులు సెలవులు ఉంటాయి.
Ramdan Holidays
మార్చిలో మరో రెండు ఆప్షనల్ హాలిడేస్ :
ముస్లింలు ఎంతో పవిత్రంగా రంజాన్ మాసం కొనసాగుతోంది... కాబట్టి వారి పవిత్రంగా భావించే మరో రెండ్రోజులు కూడా ఐచ్చిక సెలవు తీసుకునే వెసులుబాటు కల్పించింది తెలంగాణ ప్రభుత్వం. మార్చి 21 శుక్రవారం షాదబ్ హజ్రత్ అలీ, మార్చి28 శుక్రవారం షబ్-ఇ-ఖదీర్ సందర్భంగా ఆప్షనల్ హాలిడే ప్రకటించారు. అంటే ఈరోజుల్లో విద్యాసంస్థల యాజమాన్యాలు సెలవుపై నిర్ణయం తీసుకుంటాయి. ముస్లిం మైనారిటీ విద్యాసంస్థలకు ఈ రోజు కూడా ప్రత్యేకంగా సెలవు ఉంటుంది.
ఇక ఇప్పటికే రంజాన్ ఉపవాసాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ముస్లిం ఉద్యోగులకు ప్రత్యేక వెసులుబాటు కల్పించింది. సాధారణ రోజుల్లో మాదిరిగా కాకుండా ఈ రంజాన్ నెలలో పనిగంటలు తగ్గించింది...గంట ముందుగానే ఉద్యోగులు విధులు ముగించుకుని వెళ్లిపోవచ్చు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కూడా ముస్లిం ఉద్యోగులకు ఈ వెసులుబాటు కల్పించింది.