MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • School Holidays : ఈ నెలలో ఇక అన్నీ లాంగ్ వీకెండ్సే... మార్చి చివరివారంలో వరుసగా 5 రోజుల సెలవులు

School Holidays : ఈ నెలలో ఇక అన్నీ లాంగ్ వీకెండ్సే... మార్చి చివరివారంలో వరుసగా 5 రోజుల సెలవులు

ఈ నెల మార్చిలో ఇప్పటికే పది రోజులు గడిచిపోయాయి... మిగిలింది ఇంకా 20 రోజులే. ఇందులో 10 రోజులు సెలవులు వస్తున్నాయి. ఏరోజు ఎందుకు సెలవు ఉందో ఇక్కడ తెలుసుకుందాం. 

Arun Kumar P | Updated : Mar 10 2025, 05:54 PM
3 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
13
Long Weekends in March 2025

Long Weekends in March 2025

Long Weekends in March 2025 : ఈ వార్త చదివి విద్యార్థులే కాదు ఉద్యోగులు సైతం ఎగిరిగంతేస్తారు. పరీక్షల సీజన్ లో విద్యార్థులకు చదువుల ఒత్తిడిని కాస్త తగ్గిస్తూ వరుసగా లాంగ్ వీకెండ్స్ వస్తున్నాయి. ఈ నెలలో ఇక మిగిలిన మూడు వారాలు లాంగ్ వీకెండ్సే. ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ నెల చివరి వీకెండ్ అయితే ఏకంగా ఐదురోజుల సెలవు వస్తున్నాయి. ఇలా రాబోయే 20 రోజుల్లో సగానికి పైగా సెలవులే ఉండనున్నాయన్నమాట. 

మార్చి 15 నుండి ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు ఒకే పూట నడవనున్నాయి. విద్యాశాఖ అధికారికంగా ప్రకటించకున్నా ప్రతిఏటా ఒంటిపూట బడులు మార్చి 15 నుండే ప్రారంభం అవుతాయి... ఈ ఏడాది కూడా అలాగే ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ఇలా ఒంటిపూట బడులు, లాంగ్ వీకెండ్స్ తో ఇక విద్యార్థులు స్కూళ్లలో గడిపేది చాలా తక్కువ సమయమే. 

మార్చి నెలంతా లాంగ్ వీకెండ్స్ తో గడిచిపోగా వచ్చె నెల ఏప్రిల్ లో పరీక్షలతో సరిపోతుంది. ఇలా పరీక్షలు అయిపోగానే వేసవి సెలవులు ప్రారంభం అవుతాయి. ఈ ఏడాది ఏప్రిల్ 24 నుండి వేసవి సెలవులు ప్రారంభమై జూన్ 12 వరకు వుండే అవకాశాలున్నాయి. అయితే త్వరలోనే వేసవి సెలవులపై ప్రభుత్వం అధికారిక ప్రకటన చేస్తుంది. 
 

23
School Holidays

School Holidays

మార్చ్ లో మిగిలిన 3 వారాలు లాంగ్ వీకెండ్సే : 

ఈ నెలలో ఇప్పటికే ఓ వారం గడిచిపోయింది...మిగిలింది ఇంకా మూడువారాలే. అయితే ఈ మూడు వారాలూ లాంగ్ వీకెండ్స్ వస్తున్నాయి... అంటే ప్రతి వారాంతం మూడురోజులు సెలవులు రానున్నాయి. పరీక్షల సమయం కాబట్టి ఈ లాంగ్ వీకెండ్స్ లో టూర్స్ కు వెళ్లడం కుదరదు... కానీ సెలవు రోజుల్లో ఇంటివద్దే ఉండి బాగా చదువుకోవచ్చు.  పరీక్షలకు సన్నద్దం అయ్యేందుకే కాదు చదువు ఒత్తిడిని తగ్గించుకుని సరదాగా గడిపేందుకు ఈ లాంగ్ వీకెండ్స్ ఉపయోగపడతాయి.

వచ్చే శుక్రవారం అంటే మార్చి 14న హోలీ పండగ. ఈ రంగుల పండగ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అధికారిక సెలవు ప్రకటించింది. ఆ తర్వాత శనివారం, ఆదివారం పలు ప్రైవేట్ స్కూళ్లతో పాటు కార్పోరేట్ ఉద్యోగులకు సెలవు. కాబట్టి ఈ మూడ్రోజుల సెలవులో ఓ రోజు పండగ జరుపుకుని మిగతా రెండ్రోజులు సరదాగా గడపవచ్చు. 

ఇక తర్వాత సోమవారం నుండి గురువారం (మార్చి 17 నుండి 20) వరకు నాల్రోజులు స్కూళ్లు నడుస్తాయో లేదో మళ్లీ సెలవులు వస్తాయి. మార్చి 21 శుక్రవారం షహదత్ హజత్ అలి (shahadat HZT ALI (R.A)) సందర్భంగా ఆప్షనల్ సెలవు ఇచ్చారు. ఆ తర్వాత శని, ఆదివారం సెలవు. అయితే ఈ లాంగ్ వీకెండ్ ముస్లిం మైనారిటీ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులకు ఉంటుంది. 

ఇలా రాబోయే రెండువారాలు వరుస లాంగ్ వీకెండ్స్ వస్తున్నాయి. ఇక ఈ నెల చివర్లో తెలుగు సంవత్సరాది ఉగాది, ముస్లింల పవిత్ర పండగ రంజాన్ వరుసగా వస్తున్నాయి. అలాగే రంజాన్ మాసంలో చివరి శుక్రవారం కూడా తెలంగాణలో ఐచ్చిక సెలవు ఉంది. దీంతో ఈ నెలాఖరున అయితే వరుసగా ఐదురోజుల సెలవులు వస్తున్నాయి. 
 

33
Ramzan  Holidays

Ramzan Holidays

ఉగాది, రంజాన్ కు వరుసగా ఐద్రోజులు సెలవు : 

ఈ నెలలో చివరి ఆదివారం అంటే మార్చి 30 ఆదివారం ఉగాది. ఆ తర్వాతిరోజే అంటే మార్చి 31న రంజాన్ పండగ ఉంది. ఈ రెండురోజులే కాకుండా రంజాన్ తర్వాతిరోజు ఏప్రిల్ 1న కూడా ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ మూడురోజులకు మరో రెండు వీకెండ్ కూడా కలిసివస్తుంది. దీంతో మొత్తంగా ఉగాది, రంజాన్ పండక్కి కలిపి ఐదురోజుల సెలవులు వస్తున్నాయి. 

మార్చి 28 రంజాన్ మాసంలో చివరి శుక్రవారం. ఆ రోజును ముస్లింలు ఎంతో పవిత్రంగా భావిస్తారు. అందువల్ల తెలంగాణ ప్రభుత్వం ఆరోజు జుమాతుల్ విదా లేదా షబ్-ఎ-ఖదర్ సందర్బంగా ఐచ్చిక సెలవుగా ప్రకటించింది. అంటే ముస్లిం మైనారిటీ విద్యార్థులు, ఉద్యోగులు ఈ శుక్రవారం సెలవు తీసుకోవచ్చు. 

ఇలా మార్చి చివర్లో శుక్రవారంతో ప్రారంభమై తిరిగి బుధవారం వరకు సెలవులు ఉంటాయి.  మార్చి 28,29,30,31 తో పాటు ఏప్రిల్ 1 న కూడా సెలవులు ఉంటాయి. ఏప్రిల్ 2 న విద్యాసంస్థలు తిరిగి ప్రారంభం అవుతాయి. ఆ తర్వాత ఇక వరుసగా పరీక్షలు జరుగుతాయి... ఈ ఏప్రిల్ నెలాఖరున అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు వేసవి సెలవులు ప్రారంభం అవుతాయి. 

Arun Kumar P
About the Author
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు. Read More...
 
Recommended Stories
Top Stories