- Home
- Telangana
- Holidays : ఈ నెలలో మిగిలిన 20 రోజుల్లో 10 రోజులు సెలవులే... ఏ రోజు, ఎందుకు హాలిడేనో పూర్తి లిస్ట్
Holidays : ఈ నెలలో మిగిలిన 20 రోజుల్లో 10 రోజులు సెలవులే... ఏ రోజు, ఎందుకు హాలిడేనో పూర్తి లిస్ట్
తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రదేశ్ లో ఈ నెలలో భారీగా సెలవులు వస్తున్నాయి. మార్చిలో ఇంకా మిగిలింది 20 రోజులే... ఇందులో చాలా సెలవులు వస్తున్నాయి. ఈ హాలిడేస్ లిస్ట్ ను ఇక్కడ చూడండి.

Bank Holidays
Bank Holidays : ఈ ఆర్థిక సంవత్సరం మార్చితో ముగుస్తుంది... కాబట్టి ఈ నెలలో ఫైనాన్షియల్ వ్యవహారాలు ఎక్కువగా సాగుతుంటాయి. ఇందుకోసం బ్యాంకులకు వెళ్లాల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలో బ్యాంకులకు వరుస సెలవులు వస్తున్నాయి... కాబట్టి మీకు బ్యాంకులో ఏదయినా పని ఉంటే ముందుగా సెలవుల గురించి తెలుసుకొండి. లేదంటే సెలవు రోజుల్లో బ్యాంకుకు వెళితే పని కాకుండానే వెనుదిరగాల్సి వస్తుంది... దీంతో సమయం వృధా అవుతుంది.
ఈ నెలలో ఇప్పటికే పదిరోజులు గడిచిపోయాయి. ఇక మిగిలింది 20 రోజులే... ఇందులో దాదాపు పదిరోజులు బ్యాంకులకు సెలవులు వస్తున్నాయి. అందువల్లే ముందుగా బ్యాంకులకు ఈ నెలలో ఏఏ రోజుల్లో సెలవు ఉందో తెలుసుకొండి... బ్యాంక్ నడిచే వెళ్లి మీ ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన పనులు చేసుకొండి.
Bank Holidays
ఈవారంలో బ్యాంకులకు ఏఏ రోజు సెలవు :
తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో ఈవారంలో రెండురోజులు బ్యాంకులు మూతపడతాయి. అంటే వచ్చే శుక్రవారం మరియు ఆదివారం (మార్చి 14,16) రెండ్రోజులు తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు. దీన్ని దృష్టిలో ఉంచుకుని బ్యాంక్ పనులను చక్కదిద్దుకోవడం మంచింది.
ఈ శుక్రవారం (మార్చి 14న) హోలి పండగ. హిందువులు ఎంతో ఉత్సాహంగా జరుపుకునే ఈ రంగుల పండక్కి ప్రభుత్వమే అధికారికంగా సెలవు ఇస్తుంది. కాబట్టి బ్యాంకులకు కూడా సెలవు వర్తిస్తుంది. అందువల్ల శుక్రవారం బ్యాంకులు మూతపడనున్నాయి.
తర్వాత ఒక్కరోజే (మార్చి 15న) బ్యాంకులు నడిచేది. మళ్లీ మార్చి 16న ఆదివారం... సాధారణ సెలవు కాబట్టి బ్యాంకులు పనిచేయవు. ఇలా ఈ వారం రెండురోజులు బ్యాంకులు మూసిఉంటాయి.
Bank Holidays in march 2025
మార్చి 2025లో మొత్తం బ్యాంక్ హాలిడేస్ :
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా వివిధ కారణాలతో బ్యాంకులకు సెలవులు ఉంటాయి. అన్నిరాష్ట్రాల్లో స్థానిక పండగలు, ఉత్సవాలకు కూడా సెలవులు ఇస్తుంటారు. ఇలా వివిధ రాష్ట్రాల్లో వివిధ కారణాలతో బ్యాంకులకు సెలవులు వచ్చాయి. ఏ రోజు ఎక్కడ, ఎందుకు సెలవు ఉందో తెలుసుకుందాం.
బ్యాంక్ హాలిడే లిస్ట్ :
మార్చి 13 (గురువారం) : హోలికా దహనం లేదా కామదహనం కారణంగా ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, కేరళలోని బ్యాంకులకు సెలవు ఉంది.
మార్చి 14 (శుక్రవారం) : హోలీ పండగ సందర్భంగా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ తో పాటు చాలా రాష్ట్రాల్లో సెలవు ఉంది. కేవలం త్రిపుర, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, మణిపూర్, కేరళ, నాగాలాండ్ లో సెలవు లేదు.
మార్చి 15 (శనివారం) : అగర్తల, భువనేశ్వర్, ఇంపాల్, పాట్నాలో బ్యాంకులు మూతపడతాయి.
మార్చి 16 (ఆదివారం) : దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు
మార్చి 22 (నాల్గవ శనివారం) : దేశంలోని అన్ని బ్యాంకులకు సెలవు
మార్చి 23 (ఆదివారం) : దేశంలోని అన్ని రాష్ట్రాల్లో సెలవు
మార్చి 27 (గురువారం) : షబ్-ఎ-ఖాదర్ సందర్భంగా జమ్మూ కాశ్మీర్ లో సెలవు
మార్చి 28 (శుక్రవారం) : రంజాన్ మాసంలో చివరి శుక్రవారం. ఈ రోజు జుమాత్-ఉల్-విదా సందర్భంగా జమ్మూ కాశ్మీర్ లో సెలవు.
మార్చి 30 (ఆదివారం) దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు. ఈ రోజు ఉగాది పండగ ఉన్నా ఇది ఆదివారం సెలవుతో కలిసిపోయింది.
మార్చి 31 (సోమవారం) : రంజాన్ సందర్భంగా హిమాచల్ ప్రదేశ్ మినహా దేశవ్యాప్తంగా అన్నిరాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది.