తిరగబడిన కేసీఆర్ అంచనా: కేటీఆర్ ప్రమోషన్ డ్రాప్

First Published 16, Sep 2019, 12:15 PM

హైదరాబాద్: తన ముఖ్యమంత్రి పదవిపై, కేటీఆర్ ను ప్రమోట్ చేసే విషయంపై తెలంగాణ సిఎం, టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర రావు ఆదివారం శాసనసభలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని, తాను అమెరికా వెళ్లి వైద్యం చేయించుకుంటానని ప్రచారం సాగించారని, అందుకు కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేస్తానని ప్రచారం చేశారని ఆయన గుర్తు చేశారు.

తాను దుక్కలాగా ఉన్నానని, మరో రెండు విడతలు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని కేసీఆర్ చెప్పారు. ఈ వ్యాఖ్యలు కేసీఆర్ ఎందుకు చేశారనే ఆసక్తికరమైన చర్చ ప్రారంభమైంది. నిజానికి, కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేసే ఎజెండాతోనే కేసీఆర్ చాలా కాలంగా పనిచేస్తూ వస్తున్నారనేది అందరికీ తెలిసిన విషయమే.

హరీష్ రావును పక్కన పెట్టడం దగ్గరి నుంచి టీఆర్ఎస్ సీనియర్ నేతలను కూడా విస్మరించడం వరకు ఆయన కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేసే ప్రణాళికతోనే పనిచేశారని ప్రచారం సాగుతూ వస్తోంది. ఆ ప్రచారానికి తెర దించడంలో భాగంగానే కేసీఆర్ ఆ విషయాలు మాట్లాడారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు

పార్టీలోని తాజా పరిణామాలను, గతంలో ఎన్నడు లేని విధంగా అసంతృప్తి వ్యక్తం కావడం, బిజెపి దూకుడుగా వ్యవహరిస్తూ టీఆర్ఎస్ నేతలకు గాలం వేయడం ఆయనను ఆ ప్రకటన చేయడానికి పురికొల్పి ఉంటుంది. టీఆర్ఎస్ ను పటిష్టతను కాపాడుకోవడం అందులో ఓ భాగం కూడా. ఆ ప్రకటన చేయడానికి ముందు హరీష్ రావును, కేటీఆర్ ను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. సీనియర్ నేతలకు పదవులు ఇస్తానని అధికారిక ప్రకటన చేశారు.

ఆ విషయాలను పక్కన పెడితే, కేసీఆర్ కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయడానికే శాసనసభకు ముందస్తు ఎన్నికలు జరిగేలా చూసుకున్నారు. లోకసభ ఎన్నికల్లో బిజెపికి కనీసం 60 సీట్లు తక్కువ పడుతాయని, తాను రాష్ట్రంలోని 17 స్థానాల్లో 16 గెలుస్తానని, జగన్ కు, నవీన్ పట్నాయక్, స్టాలిన్ తదితరులకు వచ్చే సీట్లను కలుపుకుంటే దాదాపు 60 సీట్లను కూడగట్టి తాను డిప్యూటీ పిఎం పదవిని అధిష్టించాలని ఆశించారని ఆయన సన్నిహతులు చెబుతారు

బిజెపి లోకసభ ఎన్నికల్లో పూర్తి మెజారిటీ వస్తుందని ఉత్తరాదికి చెందిన తెలంగాణ ఉన్నతాధికారులు చెప్పినా కూడా కేసీఆర్ వినలేదని అంటారు. తన అంచనాయే నిజమవుతుందని ఆయన గట్టిగా నమ్ముతూ వచ్చారని అంటారు. అయితే, కేసీఆర్ అంచనాలు పూర్తిగా తలకిందులయ్యాయి. దానికితోడు, కేంద్రంలో బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన బిజెపి తెలంగాణ రాష్ట్రాంలో పాగా వేయడానికి ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ లో అసంతృప్తి సెగలు రాజుకుంటున్నాయి

ఆ తాజా పరిణామాల నేపథ్యంలో కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయాలనే ఆలోచనను కేసీఆర్ విరమించుకున్నట్లు చెబుతున్నారు. తానే ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పడం ద్వారా పార్టీలోని అసమ్మతి సెగను చల్లార్చడం కూడా ఆయన ఉద్దేశంగా చెబుతున్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటే అసంతృప్తి జ్వాలలు అంతగా ఎగిసిపడకపోవచ్చుననేది అందరికీ తెలిసిన విషయమే.

ఒక డైరెక్టర్ కాబట్టి కెసిఆర్ ఆలా అనుంటాడు, సహజంగానే కెసిఆర్ కవి అవడం, తెలుగు సాహిత్యం పట్ల కెసిఆర్ కి ఉన్న ఆసక్తి వల్ల ఆలా మాట్లాడి ఉండొచ్చు అని సగటు మనిషికి అనిపించడం సహజం. కానీ, ఇక్కడే ఒకసారి ప్రస్తుత రాజకీయ పరిస్థితులను పరిశీలించి వాటికి అన్వయం చేసి చూసుకుంటే, ఒక కొత్త కోణం ఆవిష్కృతమవుతుంది.

loader