ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు: సాగర్‌పై కేసీఆర్ కన్ను, విపక్షాలకు చెక్
నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో విజయం సాధించాలనే పట్టుదలతో టీఆర్ఎస్ వ్యూహరచన చేస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు టీఆర్ఎస్ క్యాడర్ లో జోష్ నింపాయి.

తెలంగాణలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించడంతో నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలపై కేసీఆర్ కేంద్రీకరించారు.

గత ఏడాది డిసెంబర్ 1వ తేదీన నోముల నర్సింహ్మయ్య అనారోగ్యంతో మరణించడంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది.ఈ ఏడాది ఏప్రిల్ 17న నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది.

సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో విజయం సాధించేందుకు గాను కేసీఆర్ వ్యూహారచన చేస్తున్నారు. ఇప్పటికే హాలియాలో నిర్వహించిన బహిరంగ సభలో నియోజకవర్గానికి వరాల జల్లు కురిపించారు.

రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధులు విజయం సాధించడం ఆ పార్టీ క్యాడర్ లో ఉత్సాహం నింపాయి.ఈ రెండు స్థానాల్లో విజయం సాధించడం ద్వారా ప్రభుత్వ వ్యతిరేకత లేదని తేలిందని టీఆర్ఎస్ నేతలు సంతోషంగా ఉన్నారు.

2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ ఎన్నికల వ్యూహంలో కేసీఆర్ కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో పార్టీ గెలుపు బాధ్యతను కేటీఆర్ తన భుజాన వేసుకొన్నారు. అయితే దుబ్బాక అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి పాలయ్యారు.జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ అనుహ్యంగా 48 స్థానాల్లో విజయం సాధించింది.

ఆ తర్వాత జరిగిన రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించాలనే పట్టుదలతో టీఆర్ఎస్ నాయకత్వం పనిచేసింది. ఈ ఎన్నికల్లో విజయం కోసం ప్రతి రోజూ కనీసం 8 గంటల పాటు సీఎం కేసీఆర్ ఎన్నికల వ్యూహాంపై కేంద్రీకరించారు.

ప్రతి రోజూ పార్టీ నాయకులతో నిరంతరం ఆయన మాట్లాడి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం దిశానిర్ధేశం చేశారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బూత్ స్థాయి వరకు టీఆర్ఎస్ ప్రచారాన్ని తీసుకెళ్లారు. ఇది పార్టీకి మంచి విజయాన్ని అందించింది. నాగార్జునసాగర్ ఉప ఎన్నికలపై కేసీఆర్ ప్రస్తుతం కేంద్రీకరించారు.

ఎన్నికలు ముగిసేవరకు పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులను ఆయా మండలాలకు ఇంచార్జీలుగా నియమించారు. నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో యాదవ సామాజికవర్గం ఓటర్లు ఎక్కువగా ఉంటారు. దీంతో ఈ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్ధినే బరిలోకి దింపాలని టీఆర్ఎస్ భావిస్తోంది.

గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగించాలని కూడ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీని సీఎం కేసీఆర్ ప్రకటించారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో విపక్షాలకు చెక్ పెట్టిన తీరులోనే సాగర్ ఉప ఎన్నికల్లో కూడ ప్రత్యర్ధులకు చుక్కలు చూపాలని టీఆర్ఎస్ నాయకత్వం ప్లాన్ చేస్తోంది.

ఇప్పటికే మండలాలు, గ్రామాల వారీగా పార్టీ నేతలకు కేసీఆర్ బాధ్యతలు అప్పగించారు. కొందరు నేతలు ఇప్పటికే ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.