కొండగట్టుకు పయనమైన అంజనీసుతుడు పవన్... తెలంగాణలోనూ ఆ క్రేజ్ ఏంటయ్యా...! (Photos)
కరీంనగర్ : జనసేన పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ సినీనటుడు పవన్ కల్యాణ్ హైదరాబాద్ నుండి కొండగట్టుకు బయలుదేరారు. జనసేన ప్రచార రథం 'వారాహి' కి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టులో మొదటి పూజ జరిపించాలని పవన్ నిర్ణయించారు. ఈ మేరకు ఇవాళ(మంగళవారం) ఆంజనేయస్వామి సన్నిధిలో వారాహి వాహనానికి పవన్ శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించనున్నారు. ఇందుకోసం హైదరాబాద్ నుండి కొండగట్టుకు బయలుదేరిన పవన్ వెంట అభిమానులు, జనసేన నాయకులు, కార్యకర్తలు భారీగా వున్నారు. మార్గమధ్యలో కూడా పవన్ కోసం అభిమానులు ఎదురుచూస్తూ ఆయన కనిపించగానే కలుసుకునేందుకు, ఫోటోలు తీసుకునేందుకు ఎగబడుతున్నారు.
Pawan Kalyan
కొండగట్టు అంజన్న, ధర్మపురి నరసింహస్వామి దర్శించనానికి హైదరాబాద్ నుండి బయలుదేరిన జనసేన అధినేత పవన్ కల్యాణ్... మార్గమధ్యలో తనను చూడటానికి వచ్చిన అభిమానులు, జనసేన కార్యకర్తలకు పవన్ అభివాదం
Pawan Kalyan
హైదరాాబాద్ నుండి కొండగట్టు వెళుతూ మార్గమధ్యల అభిమానుల కోసం కాన్వాయ్ ఆపిన పవన్... అభిమానులకు అభివాదం చేస్తూ మాట్లాడుతున్న జనసేనాని
Pawan Kalyan
కొండగట్టు అంజన్న సన్నిధిలో జనసేన ప్రచారరథం వారాహి పూజలకోసం వెళుతున్న పవన్ కల్యాణ్ కు మార్గమధ్యలో అపూర్వ సత్కారం... భారీ గజమాల వేస్తున్న అభిమానులు
Pawan Kalyan
పవన్ కల్యాణ్ కు ఆంధ్రాలోనే కాదు తెలంగాణలోనూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ వుందని ఆయన కొండగట్టు ప్రమాణంతో మరోసారి బయటపడింది. పవన్ రాక సందర్భంగా అభిమానులు ఎక్కడా తగ్గకుండా అన్నిఏర్పాట్లు చేసారు.
Pawan Kalyan
కొండగట్టుకు వెళుతున్న తనను చూడటానికి వచ్చిన అభిమానులకు పవన్ అభివాదం... పూలవర్షం, గజమాలలతో పవన్ కు అపూర్వ స్వాగతం పలికిన తెలంగాణ ఫ్యాన్స్, జనసేన కార్యకర్తలు
Pawan Kalyan
కొండగట్టు అంజన్న, ధర్మపురి నరసింహస్వామి దర్శించనానికి హైదరాబాద్ నుండి బయలుదేరిన జనసేన అధినేత పవన్ కల్యాణ్... మార్గమధ్యలో తనను చూడటానికి వచ్చిన అభిమానులు, జనసేన కార్యకర్తలకు పవన్ అభివాదం
Pawan Kalyan
కొండగట్టు అంజన్న, ధర్మపురి నరసింహస్వామి ఆలయాలకు బయలుదేరిన పవన్ కల్యాణ్ ను చూసేందుకు భారీగా తరలివచ్చిన అభిమానులు, జనసేన నాయకులు, కార్యకర్తలు
Pawan Kalyan
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కొండగట్టుకు వెళుతూ మార్గమధ్యలో ముస్లీం సోదరులు అందించిన టోపీ ధరించారు. నుదిటన నిండయని బొట్టుతో, తలపై ముస్లీం టోపీతో పవన్ సరికొత్తగా కనిపించారు.
Pawan Kalyan
కొండగట్టు అంజన్న ఆలయానికి బయలుదేరిన పవన్ కల్యాణ్ కు మార్గమధ్యలో ముస్లీం సోదరులు టోపీ పెట్టి, దట్టి కట్టారు. అభిమానులకు అభివాదం చేస్తూ పవన్ ముందుకు కదిలారు.