Hyderabad : జేబులో రూ.40 వుంటే చాలు ... హైదరాబాద్ నుండి యాదాద్రి యాత్ర చేయవచ్చు
Hyderabad to Yadagirigutta Journey : ప్రస్తుతం రోడ్డుపక్కన హోటల్లో ఛాయ్ తాగాలన్నా రూ.20 ఖర్చవుతుంది. అలాంటిది ఈ 20 రూపాయలతోనే హైదరాబాద్ నుండి యాదగిరిగుట్టకు ప్రయాణించవచ్చు... త్వరలోనే ఇది సాధ్యం కానుంది.

Hyderabad to Yadagirigutta train
Hyderabad to Yadagirigutta train : తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టకు రవాణా సదుపాయాన్ని మరింత మెరుగుపర్చే ప్రయత్నం చేస్తోంది రైల్వే శాఖ. దాదాపు రూ.650 కోట్ల రూపాయలు ఖర్చుచేసి హైదరాబాద్ శివారులోని ఘట్ కేసర్ నుండి యాదగిరిగుట్టకు రైల్వే లైన్ వేయనున్నారు. త్వరగా ట్రాక్ పనులు పూర్తయ్యేలా చూసి ఎంఎంటీఎస్ సర్వీసులను ప్రారంభిస్తామని సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం అరుణ్ కుమార్ వెల్లడించారు.
ప్రస్తుతం ఘట్ కేసర్ వరకు ఎంఎంటీఎస్ సర్వీసులు నడుస్తున్నాయి. అక్కడినుండి యాదగిరిగుట్ట సమీపంలోని రాయగిరి వరకు ఎంఎంటీఎస్ సర్వీసులు నడపాలని ప్రజలనుండి చాలాకాలంగా డిమాండ్ వస్తోంది. దీంతో ఎట్టకేలకు ఘట్ కేసర్ నుండి రాయగిరికి ఎంఎంటీఎస్ సర్వీసులను పొడిగించేందుకు రైల్వే శాఖ సిద్దమయ్యింది... ఇప్పటికే ఈ మార్గంలో రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించి డిపిఆర్ ను కూడా సిద్దం చేసారు.
రాయగిరివరకు ఎంఎంటీఎస్ సర్వీసులు నడిస్తే యాదగిరిగుట్టకు వెళ్లే భక్తులకు చాలా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఆర్టిసి బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో హైదరాబాద్ ట్రాఫిక్ ను దాటుకుని యాదగిరిగుట్టకు వెళ్లాలంటే ఎంతలేదన్నా రెండుమూడు గంటలు పడుతుంది. కానీ ఈ ఎంఎంటీఎస్ సర్వీస్ అందుబాటులోకి వస్తే కేవలం గంట సేపట్లోనే హైదరాబాద్ నుండి యాదగిరిగుట్టకు వెళ్లవచ్చు.
Hyderabad MMTS
ఛాయ్ పైసలతో యాదగిరిగుట్ట యాత్ర:
ప్రస్తుతం హైదరాబాద్ నుండి యాదగిరిగుట్టకు ఆర్టిసి బస్సులో వెళ్లాలన్నా రూ.100 ఖర్చవుతుంది. రానుపోను ఎంత తక్కువ అనుకున్నా రూ.200 ఖర్చవుతుంది. ఇక కార్లు,ప్రైవేట్ వాహనాల్లో వెళితే వేల రూపాయలు ఖర్చవుతాయి. ఈ ఖర్చులన్నింటిని దూరం చేసి కారుచౌకగా యాదగిరిగుట్ట యాత్ర చేపట్టే అవకాశం ఎంఎంటీస్ ద్వారా కలుగుతుంది.
హైదరాబాద్ నుండి యాదగిరిగుట్టకు ఎంఎంటీస్ రైలు నడిస్తే నగరవాసులకు చాలా ఉపయోగకరంగా వుంటుంది. వివిధ ప్రాంతాలనుండి యాదగిరిగుట్టకు వెళ్లాలనుకునేవారు కూడా ముందు హైదరాబాద్ కు చేరుకుని అక్కడినుండి ఎంఎంటీఎస్ లో వెళ్లవచ్చు. ఇలా ఎంతో ఉపయోగకరంగా ఎంఎంటీస్ సర్వీస్ ప్రారంభమైతే టికెట్ ఎంత వుండనుందో తెలుసా... కేవలం 20 రూపాయలనే అట.
అంటే హైదరాబాద్ శివారులోని ఘట్ కేసర్ నుండి యాదగిరిగుట్ట సమీపంలోని రాయగిరి స్టేషన్ వరకు కేవలం రూ.20 తో చేరుకోవచ్చు.అక్కడినుండి ఆలయానికి చేరుకుని స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఇక తిరిగి ఎంఎంటీఎస్ లోనే హైదరాబాద్ చేరుకోవచ్చు. ఇలా రానుపోను కేవలం రూ.40 మాత్రమే ఖర్చవుతుంది. అంటే హైదరబాదీలు జేబులో 40 రూపాయలుంటే యాద్రాద్రి యాత్ర చేపట్టే రోజు వస్తుందన్నమాట.
Yadagirigutta Temple
యాదాద్రి బోర్డ్ ఏర్పాటు :
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట పాలకమండలి ఏర్పాటుకు రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మాదిరిగానే యాదగిరిగుట్ట దేవస్థాన బోర్డ్ (వైటిడిబి) ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది... ఆర్డినెన్స్ ద్వారా దీన్ని ఏర్పాటుకు అంతా సిద్దంచేసారు. అయితే ఇంతలోనే ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి ఎలక్షన్ కోడ్ అమలవడంతో అదికాస్తా వాయిదాపడింది.
యాదగిరిగుట్ట పాలకమండలిలో ఛైర్మన్ తో పాటు 11 మంది సభ్యులను నియమించనున్నారు. దీంతో ఈ ఆలయ మొట్టమొదటి ఛైర్మన్ గా ఎవరికి అవకాశం దక్కుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. టిటిడి మాదిరిగానే వైటిడిబికి యాదగిరిగుట్ట పాలనా బాధ్యతలన్నీ అప్పగించనున్నారు.