MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • హైదరాబాద్‌లో ఆడపిల్లలను కాటేస్తున్న కామాంధులు.. వారం రోజుల్లో వెలుగులోకి ఐదు అత్యాచారాలు..

హైదరాబాద్‌లో ఆడపిల్లలను కాటేస్తున్న కామాంధులు.. వారం రోజుల్లో వెలుగులోకి ఐదు అత్యాచారాలు..

హైదరాబాద్‌లో వెలుగుచూస్తున్న వరుస అత్యాచార ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఐదు రోజుల వ్యవధిలోనే ఐదు అత్యాచార ఘటనలు వెలుగులోకి రావడం.. ఆందోళనకు గురిచేసింది. ఆడపిల్లలు కనిపిస్తే చాలు కాటేయకుండా వదలడం లేదు కామాంధులు. ఇటీవల జూబ్లీహిల్స్‌లోని అమ్నేషియా పబ్ నుంచి బాలికను కొందరు వ్యక్తులు కారులో తీసుకెళ్లి సామూహిక అత్యాచారం జరిపిన ఘటన వెలుగుచూసింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. 

4 Min read
Sumanth K
Published : Jun 07 2022, 11:39 AM IST| Updated : Jun 07 2022, 11:55 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111

ఈ కేసు కాకుండా వారం రోజుల వ్యవధిలో హైదరాబాద్‌లో ఐదు అత్యాచార ఘటనలు వెలుగులోకి రావడం.. నగరవాసులను ఆందోళనకు గురిచేస్తుంది. ఈ విధంగా హైదరాబాద్‌లో రోజుకో దారుణం వెలుగుచూడటం కలకలం రేపుతోంది. 

211

1. బాలికను కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం.. రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న బాలికను ఇంటిదగ్గర దింపుతామంటూ ట్రాప్‌ చేసిన క్యాబ్‌ డ్రైవర్ కలీమ్ అలీ .. డెక్కన్ ప్యాలెస్‌కు వెళ్లి తన స్నేహితుడు లుక్మాన్‌ను కారులో ఎక్కించుకున్నాడు. వీరిద్దరూ కలిసి బాలికను రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ గ్రామంలోని లుక్మాన్ ఇంటికి తీసుకెళ్లి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. మరోవైపు బాలిక కనిపించకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. 

311

అయితే  జూన్ ఒకటో తేదీ తెల్లవారుజామున బాధితురాలు తన ఇంటికి తిరిగి వస్తుండగా పోలీసు పెట్రోలింగ్ బృందం ఆమెను గుర్తించింది. కనుగొంది. వారు గమనించిన బాలిక అదృశ్యమైన బాలిక అని పోలీసులు గుర్తించారు. తర్వాత బాలికను భరోసా కేంద్రానికి తరలించారు. అక్కడ వాంగ్మూలం నమోదు చేసిన అధికారులు.. సామూహిక అత్యాచారం జరిగిన విషయం గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసులో అత్యాచారం సెక్షన్లను చేర్చి నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఖలీం, లుక్మాన్‌లను అరెస్ట్ చేసి.. వారిపై అత్యాచారం ఆరోపణలతో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
 

411

2. కాలపత్తార్‌లో బాలికకు మాయ మాటలు చెప్పి.. ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తున్న 16 ఏళ్ల బాలిక మే 30వ తేదీన పనిని పూర్తి చేసుకుని.. చార్మినార్ సమీపంలోని బస్టాప్ వద్ద వేచి ఉన్న సమయంలో సుఫియాన్  వ్యక్తి ఆమెతో మాటలు కలిపాడు. ఆమెకు మాయ మాటలు చెప్పి తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం జరిపాడు. ఆలస్యమైనందుకు తిడతారేమోనని భయపడిన బాలిక తన స్నేహితురాలి ఇంట్లో పడుకుంటానని తల్లిదండ్రులకు అబద్ధం చెప్పింది. మరుసటి రోజు(మే 31న) ఆ వ్యక్తి ఆమెను దుకాణం తెరిచే సమయంలో అక్కడ దింపేసి.. అతని ఫోన్ నంబర్ ఇచ్చి వెళ్లిపోయాడు. 

511

ఆదివారం మధ్యాహ్నం బాలికకు తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆరా తీశారు. దీంతో బాలిక లైంగికదాడి విషయాన్ని చెప్పింది. దీంతో తల్లి కాలాపత్తర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కిడ్నాప్, లైంగికదాడి కేసులను నమోదు చేసి మహ్మద్‌ సుఫియాన్‌ను అరెస్ట్‌ చేశారు.

611

3. నెక్లెస్ రోడ్డులో కారులో అత్యాచారం.. ఓ అనాథ విద్యార్థి వసతిగృహంలో ఉంటున్న ఇద్దరు బాలికలపై (మైనర్లు) అత్యాచారం జరిగిన వేర్వేరు ఘటనలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనలు ఏప్రిల్‌లో జరిగాయి. ఓ బాలిక జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. హాస్టల్‌కు సమీపంలోని జిరాక్స్‌ షాపులో పనిచేసే సురేష్‌ (23) ఆమెపై కన్నేసి పరిచయం పెంచుకున్నాడు. బహుమతులు ఇచ్చి లోబరుచుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌ 20న ఆ బాలిక, ఆమె స్నేహితురాళ్లు ఇద్దరు హాస్టల్ బయటకు వచ్చారు. తమ ఓ స్నేహితుడు పుట్టిన రోజు వేడుక కోసం నెక్లెస్‌ రోడ్డుకు వెళ్లారు.
 

711

బాధితురాలితో పాటు మరో ఇద్దరు విద్యార్థినిలు, ఆ స్నేహితుడు, సురేష్ కారులో నెక్లెస్ రోడ్డుకు చేరుకున్నారు. అక్కడ బాధితురాలు స్నేహితుడి పుట్టిన రోజు జరిపారు. అనంతరం బాధితురాలితో మాట్లాడదామని కారులోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే బాధితురాలు ప్రవర్తనలో మార్పు గమనించిన హాస్టల్‌ సిబ్బంది ప్రశ్నించడంతో అసలు విషయం వెలుగు చూసింది.దీంంతో ఈ ఘటనపై ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ హుమయూన్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన హుమయూన్‌నగర్‌ పోలీసులు సంఘటన జరిగిన ప్రాంతం రాంగోపాల్‌పేట పరిధిలోకి రావడంతో ఆ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు. ఈ ఘటనకు సంబంధించి సురేష్‌ను అరెస్ట్ చేశారు. 

811

4. సినిమా థియేటర్‌కు తీసుకెళ్లి.. ఇక మరో విద్యార్థినికి... తాను చదువుకుంటున్న కళాశాలలో ఇద్దరు విద్యార్థులు స్నేహితులయ్యారు. ఏప్రిల్‌ 25న ఇంటర్‌ పరీక్షలు పూర్తికాగానే... సినిమాకు వెళ్దామంటూ బాధితురాలి ఓ స్నేహితుడు ప్రతిపాదించాడు. బాధితురాలు ఒప్పుకోవడంతో ముగ్గురు కలిసి అదేరోజు రాత్రి కారులో అత్తాపూర్‌లోని ఓ థియేటర్‌కు సినిమాకెళ్లారు. సినిమా చూస్తుండగా... పక్కనే కూర్చున్న స్నేహితుడు కూల్‌డ్రింక్‌ తాగుదామంటూ చెప్పి బయటకి తీసుకొచ్చాడు. అక్కడ నిర్మానుష్య ప్రాంతంలో బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అయితే వారి నుంచి బెదిరింపులు ఎదురుకావడంతో.. బాలిక ఈ విషయం ఎవరికి చెప్పలేదు. అయితే సంక్షేమశాఖ అధికారులు శుక్రవారం రాత్రి తోటి విద్యార్థిని ప్రశ్నించిన సమయంలో తనపైనా అత్యాచారం జరిగిందని బాధితురాలు చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై కూడా హుమాయూన్ నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. ఈ కేసులో మైనర్ అయిన నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

911

5. బాలికపై అత్యాచారం జరిపి.. వీడియోలు తీసి.. సికింద్రాబాద్ కార్ఖానా పరిధిలో మైనర్‌ బాలికపై ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత బాలికపై కొన్నిరోజులుగా ఇద్దరు మైనర్లు సహా అయిదుగురు సామూహికంగా అత్యాచారానికి పాల్పడ్డారు. ధీరజ్, రితేష్ అనే యువకులతో బాలికకు కొన్ని నెలల క్రితం ఇన్‌స్టాగ్రాంలో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతోనే రోజూ మాట్లాడుతూ బాలికతో చనువు పెంచుకున్నారు.  బాలికకు మాయ మాటలు చెప్పి హోటల్‌కు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ సమయంలో వీడియోలుతీసి.. బెదిరిస్తూ పలుమార్లు అత్యాచారం జరిపారు. వీడియోలు ఇస్తామని నమ్మించి కూడా మరికొందరు స్నేహితులతో కలిసి బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే బాలిక భయపడి ఈ విషయం కుటుంబ సభ్యులకు చెప్పలేదు. 

1011

అయితే బాలిక మానసికంగా కృంగిపోతుండటంతో తల్లిదండ్రులు ఆమెను సైక్రియాటిస్ట్ దగ్గరకు తీసుకెళ్ళారు. అక్కడ బాలిక తనపై జరిగిన అఘాయిత్యానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. దీంతో బాలిక తల్లిదండ్రులు మే 30న కార్ఖానా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఓ మైన‌ర్‌తోపాటు ఐదుగురిని అరెస్ట్ చేశారు.
 

1111

ఇక, 2020‌లో తెలంగాణలో 1934 అత్యాచార ఘటనలు నమోదు కాగా.. 2021లో ఆ కేసుల సంఖ్య 2382గా ఉంది. అయితే ఈ కేసుల్లో 90 శాతానికి పైగా బాధితులకు పరిచయం ఉన్నవారే అత్యాచారాలకు పాల్పడటం ఆందోళనకు గురిచేసే అంశం.  

About the Author

SK
Sumanth K

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved