ఉత్తమ్ పద్మావతి అనివార్యత: రేవంత్ రెడ్డికి అధిష్టానం క్లాస్

First Published 30, Sep 2019, 1:26 PM

హుజూర్ నగర్: హుజూర్ నగర్ శాసనసభ ఎన్నికల్లో అనివార్యంగా పద్మావతి పోటీకి దిగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై హుజూర్ నగర్ ఉప ఎన్నిక బాధ్యతను పెడుతూ అధిష్టానం ఆయన భార్యను పోటీకి దింపినట్లు తెలుస్తోంది.

హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి పద్మావతి పెద్దగా ఆసక్తి చూపలేదని సమాచారం. అయితే, పద్మావతి కన్నా మించిన అభ్యర్థి మరొకరు ఉండరని, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆమె విజయానికి అనివార్యంగా పోటీ చేయాల్సి వస్తుందని భావించి అధిష్టానం ఆమెను పోటీకి దింపినట్లు తెలుస్తోంది

కోదాడలో ఓటమి పాలైన తర్వాత పద్మావతి రాజకీయాలకు దూరం జరిగి ఆర్కిటెక్చర్ వృత్తిలోకి మారుదామని భావించినట్లు తెలుస్తోంది. అయితే, అధిష్టానం ఒత్తిడి వల్ల పోటీకి దిగాల్సి వచ్చిందని అంటున్నారు. సాంకేతికంగా పద్మావతి పోటీ చేస్తున్నప్పటికీ అది ఉత్తమ్ కుమార్ రెడ్డి పోటీగానే భావించాల్సి ఉంటుంది. లోకసభ ఎన్నిక కావడం వల్ల ఆయన రాజీనామా చేయడంతో హుజూర్ నగర్ కు ఉప ఎన్నిక జరుగుతోంది

ఇదిలావుంటే, హుజూర్ నగర్ అభ్యర్థి ఎంపిక విషయంలో కాంగ్రెసు వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డితో విభేదించిన విషయం తెలిసిందే. పద్మావతి పేరును ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏకపక్షంగా ఎలా ప్రకటిస్తారని ఆయన ప్రశ్నించారు. తాను నక్రేకల్ కు చెందిన చామల కిరణ్ కుమార్ రెడ్డి పేరును తాను ప్రతిపాదించినట్లు కూడా రేవంత్ రెడ్డి చెప్పారు

ఉత్తమ్ కుమార్ రెడ్డిని వ్యతిరేకించిన రేవంత్ రెడ్డిపై ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన కాంగ్రెసు నాయకులంతా విరుచుకుపడ్డారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నుంచి అందరూ ఆయనను ప్రశ్నించారు. మాజీ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు కూడా రేవంత్ రెడ్డిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.

కాగా, ఉత్తమ్ కుమార్ రెడ్డిని వ్యతిరేకించిన రేవంత్ రెడ్డికి పార్టీ అధిష్టానం క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అధిష్టానం పిలుపు మేరకే రేవంత్ రెడ్డి ఆదివారం ఢిల్లీలో ఉన్నట్లు తెలుస్తోంది. పద్మావతి విజయం కోసం పనిచేయాలని అధిష్టానానికి చెందిన నాయకులు ఆయనను ఆదేశించినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా వేదికగా పద్మావతికి అనుకూలంగా ప్రచారం చేసే బాధ్యతను ఆయనకు అప్పగించినట్లు తెలుస్తోంది.

loader