మీకు రూ.2 లక్షలకు పైగా లోన్ వుందా..? ఇలా చేసారంటే రుణమాఫీ జరిగిపోతుంది
తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీ ప్రక్రియను పూర్తిచేసింది... ఇచ్చిన మాట ప్రకారం ఆగస్ట్ 15, 2024 లోపు రూ.2 లక్షల లోపు రైతు రుణాలను మాఫీ చేసింది. ఆసక్తికర విషయం ఏమిటంటే ఇకపై రూ.2 లక్షలకు పైగా రైతు రుణాలను కూడా మాఫీ చేస్తారట... అదెలాగో తెలుసా,,?
Rythu Runa Mafi
Rythu Runa Mafi : తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే మూడు విడతల్లో రెండు లక్షల లోపు వ్యవసాయ రుణాలను మాఫీ చేసింది ప్రభుత్వం. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చిన మొదటి స్వాతంత్య్ర దినోత్సవం లోపే పూర్తిచేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రుణమాఫీ ప్రక్రియను చాలా సీరియస్ గా తీసుకుని ఎట్టకేలకు పూర్తిచేసారు.
Rythu Runa Mafi
ప్రారంభించిన నెల రోజుల్లోనే రుణమాఫీ ప్రక్రియను పూర్తిచేసింది ప్రభుత్వం. జూలై 18వ తేదీన లక్ష రూపాయల లోపు రుణాలను, జూలై 30న లక్ష నుంచి లక్షన్నర రూపాయల లోపు రుణాలు మాఫీ చేసింది. ఆగస్టు 15వ తేదీన లక్షన్నర నుంచి 2 లక్షల రూపాయల లోపు రుణాలను మాఫీ చేసింది. ఇలా దాదాపు 22 లక్షల మంది రైతుల రుణ ఖాతాల్లో రూ.18 వేల కోట్లు జమ చేసింది.
Rythu Runa Mafi
రెండు లక్షల లోపు రుణాలన్ని మాఫీ చేసింది... ఇక రుణమాఫీ ప్రక్రియ ముగిసినట్లేనని అందరూ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే వ్యవసాయ శాఖ కీలక ప్రకటన చేసింది. ఇంతటితో రుణమాఫీ ప్రక్రియ ముగియలేదు... ఇకపై రెండు లక్షల పైన రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించింది. కాస్త ఆశ్చర్యకరంగా అనిపించినా వ్యవసాయ శాఖ కాస్త లాజికల్ గా ఈ ప్రకటన చేసింది.
Rythu Runa Mafi
కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ కోసం రూ.31 వేలకోట్లు కేటాయించింది... కానీ ఇప్పటివరకు మాఫీ చేసిన రుణాలు మాత్రం కేవలం రూ.18 వేల కోట్లే. మిగతా డబ్బులు ఏం చేయనున్నారని డౌట్ రావచ్చు... అయితే ఈ డబ్బులు కూడా రైతు రుణమాఫీ కోసమే ఉపయోగించనున్నారు. ఇప్పటివరకు కేవలం రూ.2 లక్షల లోపు రుణాలను మాఫీ చేసిన ప్రభుత్వం ఇకపై రూ.2 లక్షలకు పైగా రుణాలను మాఫీ చేయనుంది.
Rythu Runa Mafi
ప్రభుత్వం ప్రకటించిన విధివిధానాల ప్రకారం కేవలం రూ.2 లక్షలలోపు రుణాలే కాదు అంతకు మించి రుణాలున్న వారికి రుణమాఫీ వర్తిస్తుంది... కానీ రుణమాఫీ మాత్రం కేవలం రూ.2 లక్షలలోపే. ఉదాహరణకు ఓ రైతుకు రూ.2,50,000 వ్యవసాయ రుణం వుందనుకుంటే అతడు రూ.50,000 వేలను చెల్లించాలి. అప్పుడు అతడి రూ.2 లక్షల రుణాన్ని ప్రభుత్వం మాఫీ చేస్తుంది. ఇలా ఇకపై రెండు లక్షల పైగా రుణాలన్న రైతులకు కూడా రుణమాఫీ వర్తించనుంది.
Rythu Runa Mafi
ఇప్పటివరకు రూ.2 లక్షల లోపు రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. బ్యాంకు ఖాతాలు, ఆధార్ నెంబర్లు, పాసు బుక్ సరిగా, స్పష్టంగా ఉన్న ప్రతి రైతు కుటుంబానికి ఈ రుణమాఫీ జరిగింది. కానీ బ్యాంకు ఖాతాలు సరిగా లేనివి, కుటుంబ నిర్ధారణ జరగని ఖాతాలు, ఆధార్ నెంబర్లలో తప్పులున్నవి, పాస్ బుక్ నెంబర్లు లేనివి, బ్యాంకు ఖాతాల్లో ఉన్న పేర్లతో ఆధార్లో ఉన్న పేర్లతో సరిపోని ఖాతాలు పెండింగ్ లో ఉన్నాయి. వీటన్నింటినీ సరి చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. స్థానిక మండల వ్యవసాయ అధికారిని కలిసి, వీటిని సరి చేసుకుంటే వీరి ఖాతాల్లో రైతు రుణమాఫీ నిధులను ప్రభుత్వం జమ చేస్తుంది.