మీ బ్యాంక్ అకౌంట్లో చిల్లిగవ్వ లేకున్నాసరే ... ఈ ఏటిఎంలో వేలకు వేలు తీసుకోవచ్చు
మీ బ్యాంక్ అకౌంట్లో చిల్లిగవ్వ లేకున్నా సరే... మీ క్రెడిట్ కార్డు కూడా ఉపయోగించకుండానే వేలకు వేలు డబ్బులు ఏటిఎం నుండి తీసుకోవచ్చు. అదెెలాగో తెలుసుకొండి.

Gold Loan ATM
Gold Loan ATM : మనందరం డబ్బుల కోసం ఏటిఎంలను చాలాకాలంగా వినియోగిస్తున్నాం. డబ్బులు అవసరం అయితే వెంటనే డెబిట్ కార్డు తీసుకుని ఏటిఎంకు వెళతాం. అయితే అకౌంట్లో డబ్బులు ఉంటేనే ఏటిఎంలో డబ్బులు తీసుకోగలం... లేకపోతే ఏం చేయలేం. ఇదంతా ఇక గతం...ఇకపై మీ అకౌంట్ లో డబ్బులు లేకున్నా ఏటిఎంలో వేలకు వేలు క్యాష్ తీసుకోవచ్చు.
తెలంగాణలోని వరంగల్ పట్టణంలో ఓ సరికొత్త ఏటిఎంను ప్రారంభించారు. మీ దగ్గరు ఏటిఎం కార్డు కూడా లేకున్నా సరే... బంగారం ఉంటే చాలు. దాన్ని అలా మిషన్లో వేసి ఇలా డబ్బులు తీసుకోవచ్చు. మీ దగ్గర డబ్బులు ఉన్నపుడు తిరిగి మీ బంగారాన్ని తిరిగి పొందవచ్చు. ఇలా అత్యవసరంగా డబ్బులు అవసరమున్నవారు ఈ ఏటిఎంను ఆశ్రయించవచ్చు.

Gold ATM
గోల్డ్ ఏటిఎం ఎలా పనిచేస్తుంది :
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వరంగల్ లో గోల్డ్ ఏటిఎం సేవలు ప్రారంభించింది. ఈ ఏటిఎం ను వినియోగదారులు గోల్డ్ లోన్ కోసం ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం గోల్డ్ లోన్ పొందాలంటే బ్యాంక్ బ్రాంచ్ కు వెళ్లాల్సి వస్తోంది...అంతేకాదు అక్కడ చాలా ప్రాసెస్ ఉంటుంది. కానీ ఈ ఏటిఎం ద్వారా క్షణాల్లో గోల్డ్ లోన్ పొందవచ్చు.
మీ దగ్గరున్న గోల్డ్ ఈ ఏటిఎంలో వేయగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో బరువు, నాణ్యతను నిర్దారిస్తుంది. ఈ బంగారానికి గోల్డ్ లోన్ ఎంత వస్తుందో సూచిస్తుంది. అది మీకు నచ్చితే వెంటనే మీ ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ ను ఎంటర్ చేసి అప్పటికప్పుడు డబ్బులు పొందవచ్చు.
ఇలా బ్యాంకుల చుట్టూ తిరిగి గోల్డ్ లోన్ పొందడంకంటే ఈ ఏటిఎం మిషన్ ద్వారా సులువుగా డబ్బులు పొందవచ్చు. ఎలాంటి పేపర్ వర్క్ అవసరం లేదు. సాంకేతికతను ఉపయోగించి లోన్ ను నిర్దారిస్తారు... ఎక్కడా మనిషి ప్రమేయం ఉండదు కాబట్టి ఎలాంటి అవకతవకలు ఉండవు. బంగారాన్ని ఎటిఎంలో వేసినవెంటనే లోన్ ఎంత వస్తుందో నిర్దారణ అవుతుంది... మీరు అంగీకరిస్తే 10 శాతం డబ్బులు ఈ మిషన్ నుండి అప్పటికప్పుడే పొందుతారు.., మిగతా డబ్బులు మీ అకౌంట్లో జమ అవుతాయి.
ప్రస్తుతం ఈ గోల్డ్ లోన్ ఏటిఎం కేవలం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకే అందుబాటులో ఉంటుందని మేనేజింగ్ డైరెక్టర్,సీఈవో ఎంవీ రావు తెలిపారు. వరంగల్ లో ప్రయోగాత్మకంగా ఈ గోల్డ్ లోన్ ఏటిఎంను ఏర్పాటుచేసామని...సక్సెస్ అయితే దేశవ్యాప్తంగా వీటిని ఏర్పాటుచేయనున్నట్లు ఆయన తెలిపారు.
Gold ATM
హైదరాబాద్ లో గోల్డ్ ఏటిఎం...
వరంగల్ లో గోల్డ్ లోన్ ఏటిఎంకంటే ముందే రాజధాని హైదరాబాద్ లో గోల్డ్ ఏటిఎం సేవలు అందుబాటులోకి వచ్చాయి. గోల్డ్ లోన్ ఏటిఎం బంగారం తీసుకుని డబ్బులు ఇస్తే... ఈ గోల్డ్ ఏటిఎం డబ్బులు తీసుకుని బంగారం అందిస్తుంది. ఇలా అమీర్ పేట మెట్రో స్టేషన్ లో గోల్డ్ సిక్కా లిమిటెడ్ ప్రత్యేక ఏటిఎం ను ఏర్పాటుచేసింది.
ఈ గోల్డ్ ఏటిఎం ద్వారా డెబిట్, క్రెడిట్ కార్డులు లేదంటే యూపిఐని ఉపయోగించి బంగారం,వెండి కొనుగోలు చేయవచ్చు. ఈ మిషన్ ద్వారా 0.5 గ్రాముల నుండి 20 గ్రాముల వరకు బంగారం కొనుగోలు చేయవచ్చు. డబ్బులు చెల్లించగానే బంగారం, వెండి కాయిన్స్ రూపంలో ఆ మిషన్ నుండి బయటకు వస్తాయి. ఇలా జువెల్లర్స్ కు వెళ్లకుండానే చాలా ఈజీగా బంగారం పొందవచ్చు... నాణ్యత విషయంలోనూ ఆందోళన ఉండదు.