జగన్ పెట్టిన చిచ్చు: కేసీఆర్ తో పవన్ కల్యాణ్ వైరం రిపీట్

First Published 21, Nov 2020, 3:39 PM

లోకసభ ఎన్నికలు ముగిసిన తర్వాత కేసీఆర్ తో పవన్ కల్యాణ్ సయోధ్య కుదుర్చుకున్నారు. కేసీఆర్ తో ఆయన పలుమార్లు భేటీ అయ్యారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మధ్య రాజకీయ వైరం పునరావృతమయ్యే అవకాశం ఉంది. 2014 లోకసభ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పనిచేశారు. కేసీఆర్ మీదా, టీఆర్ఎస్ ప్రభుత్వంపైనా విమర్శల జడివాన కురిపించారు అదే స్థాయిలోకేసీఆర్ పవన్ కల్యాణ్ ను ఢీకొట్టారు.

లోకసభ ఎన్నికలు ముగిసిన తర్వాత కేసీఆర్ తో పవన్ కల్యాణ్ సయోధ్య కుదుర్చుకున్నారు. కేసీఆర్ తో ఆయన పలుమార్లు భేటీ అయ్యారు. కేసీఆర్ నిర్ణయాలపై ప్రశంసలు కూడా కురిపించారు. దీంతో పవన్ కల్యాణ్ తెలంగాణలో కేసీఆర్ కు వ్యతిరేకంగా పనిచేయరని భావించారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కల్యాణ్ కు కేసీఆర్ మద్దతు ఉంటుందని కూడా భావించారు.

ఆ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కేసీఆర్ వైఎస్ జగన్ కు మద్దతు ప్రకటించారు. అప్పటి నుంచి కేసీఆర్ కు, పవన్ కల్యాణ్ కు మధ్య దూరం పెరిగిందని అంటారు. తెలంగాణలో పెద్దగా తన బలం లేకపోవడంతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మౌనంగా ఉంటారని అందరూ భావించారు. అయితే, అనూహ్యంగా ఆయన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అభ్యర్థులను రంగంలోకి దించాలని నిర్ణయం తీసుకున్నారు.

అయితే, జాతీయ స్తాయిలో కుదిరిన ఒప్పందం కారణంగా పవన్ కల్యాణ్ తో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బిజెపి పొత్తు ఉంటుందని కూడా అనుకున్నారు. కానీ, జనసేనతో పొత్తు ఉండదని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన పవన్ కల్యాణ్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అభ్యర్థులను దింపాలని నిర్ణయించుకున్నారు. తగిన సమయంలో బిజెపి పెద్దలు రంగంలోకి దిగి పవన్ కల్యాణ్ ఆగ్రహాన్ని చల్లార్చరు. దాంతో పోటీ నుంచి విరమించుకుని బిజెపికి మద్దతు ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నారు.

కాగా, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బిజెపి తరఫున పవన్ కల్యాణ్ ప్చారం చేస్తారా, లేదా అనేది ఇంకా తేలలేదు. ఆయన ప్రచారానికి దిగితే కేసీఆర్ మీద విమర్శల జడివాన కురిపించే అవకాశం ఉంది. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూడా ఆయన విమర్శిస్తారు. ఇదే జరిగితే కేసీఆర్ పవన్ కల్యాణ్ మీద తీవ్రంగా నిప్పులు చెరిగే అవకాశాలు లేకపోలేదు.

రాజకీయాలకు దూరమైన మాజీ పార్లమెంటు సభ్యుడు, మెగాస్టార్ చిరంజీవి కేసీఆర్ కు అనుకూలంగా ఉన్నారు. కరోనా కాలంలో చిరంజీవి రెండు సార్లు కేసీఆర్ ను కలిశారు. ఇది పెద్ద విషయమేమీ కాదు. పవన్ కల్యాణ్ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద పోరాటం చేస్తున్న సమయంలోనే చిరంజీవి జగన్ ను కలిశారు. రాజకీయాల్లో ఏ మాత్రం వేలు పెట్టకూడదని చిరంజీవి నిర్ణయించుకుని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతోనూ సఖ్యతతో మెలుగుతున్నారు.