అమిత్ షాతో భేటీ: తెలంగాణ నేతలతో రేపు చంద్రబాబు భేటీ, ఏం జరుగుతుంది?
తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబునాయుడు రేపు భేటీ కానున్నారు. తెలంగాణ రాజకీయ పరిస్థితులపై చంద్రబాబు చర్చించనున్నారు.
Chandrababu Naiduఅమిత్ షాతో భేటీ: తెలంగాణ నేతలతో రేపు చంద్రబాబు భేటీ,
తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు నాయుడు ఈ నెల 6వ తేదీన సమావేశం కానున్నారు. తెలంగాణలో రాజకీయ పరిస్థితులపై చంద్రబాబు చర్చించనున్నారు.
అమిత్ షాతో భేటీ: తెలంగాణ నేతలతో రేపు చంద్రబాబు భేటీ,
కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ తర్వాత తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబునాయుడు భేటీ కానుండడం రాజకీయంగా చర్చకు దారి తీసింది. తెలంగాణలో బీజేపీ, టీడీపీ మధ్య పొత్తు ఉంటుందనే ప్రచారం సాగుతుంది
అమిత్ షాతో భేటీ: తెలంగాణ నేతలతో రేపు చంద్రబాబు భేటీ,
ఈ ప్రచారాన్ని బీజేపీ నేతలు తోసిపుచ్చుతున్నారు. కేంద్ర మంత్రి అమిత్ షా ను గతంలో ఇతర పార్టీలకు చెందిన నేతలు , బీజేపీయేతర పార్టీల సీఎంలు కలిసిన విషయాన్ని బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారు. అమిత్ షా ను చంద్రబాబు కలవడంలో తప్పేంటని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు.
అమిత్ షాతో భేటీ: తెలంగాణ నేతలతో రేపు చంద్రబాబు భేటీ,
చాలా రోజుల తర్వాత కేంద్ర మంత్రి అమిత్ షా, జేపీ నడ్డాతో చంద్రబాబు ఈ నెల 3న భేటీ అయ్యారు. ఈ భేటీపై రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరమైన చర్చలు జరుగుతున్నాయి. 2014లో టీడీపీ, బీజేపీ మధ్య పొత్తు ఉంది. తెలంగాణలో 15 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ విజయం సాధించింది.. బీజేపీ ఐదు అసెంబ్లీ స్థానాలను బీజేపీ దక్కించుకుంది.
అమిత్ షాతో భేటీ: తెలంగాణ నేతలతో రేపు చంద్రబాబు భేటీ,
2019 ఎన్నికలకు ముందు బీజేపీ, టీడీపీ మధ్య అగాధం నెలకొంది. పొత్తుకు బ్రేక్ పడింది. 2018 లో తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్, సీపీఐ కూటమిగా పోటీ చేశాయి. తెలంగాణ లో రెండు అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ విజయం సాధించింది. అయితే ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రస్తుతం బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. 2019 ఎన్నికల్లో ఏపీలో టీడీపీ అధికారాన్ని కోల్పోయింది.
అమిత్ షాతో భేటీ: తెలంగాణ నేతలతో రేపు చంద్రబాబు భేటీ,
2019లో ఏపీలో టీడీపీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత బీజేపీపై విమర్శలను చంద్రబాబు తగ్గించారు. తాజాగా అమిత్ షా, జేపీ నడ్డాలతో చంద్రబాబు భేటీ అయ్యారు.
అమిత్ షాతో భేటీ: తెలంగాణ నేతలతో రేపు చంద్రబాబు భేటీ,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన, టీడీపీ మధ్య పొత్తులుండే అవకాశం ఉందని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సంకేతాలు ఇచ్చారు. అయితే బీజేపీ, జనసేన మధ్య పొత్తు ఉంది. అయితే రానున్న ఎన్నికల్లో బీజేపీ, జనసేన, టీడీపీ మధ్య పొత్తు కుదిరే అవకాశం లేకపోలేదనే ప్రచారం కూడా సాగుతుంది. అయితే ఈ ప్రచారాన్ని బీజేపీ కి చెందిన ఏపీ నేతలు ఖండిస్తున్నారు. కుటుంబ పార్టీలకు తాము దూరంగా ఉంటామని సోము వీర్రాజు ప్రకటించారు.