KCR బస్సు యాత్ర... పార్టీని బలోపేతం చేసే దిశగా గులాబీ బాస్..?
అసెంబ్లీ ఎన్నికల్లో గట్టి దెబ్బ తిన్న కేసీఆర్.. పార్లమెంట్ ఎలక్షన్స్ లో సత్తా చాటాలి అని చూస్తున్నారు. అంతే కాదు చెల్లాచెదురు అవుతున్న పార్టీని కాపాడుకోవడం కోసం తానే స్వయంగా రంగంలోకి దిగుతున్నారు.
ప్రభుత్వంలో ఉండగా... ప్రజలను కలవలేదు అనే అపవాదును మూటగట్టుకున్నారు మాజీ సీఎం కేసీఆర్. కాంగ్రెస్ చేతిలో ఓడిపోయిన తరువాత చాలా కాలం ఇంటికే పరిమితం అయిన గులాబీ బాస్.. ఇప్పుడిప్పుడే యాక్టీవ్ అవుతున్నారు. 39 స్థానాలు గెలిచినా.. పార్టీ కేడర్ చెల్లా చెదురు కావడంతో వరుసగా ఇబ్బందులు పడుతున్నారు బీఆర్ఎస్ నేతలు.
Kalvakuntla Chandrashekar Rao, Revanth Reddy, Congress,KCR, BRS
ఇక అసెంబ్లీ ఎలక్షన్స్ లో దెబ్బతిన్న బీఆర్ఎస్.. పార్లమెంట్ ఎలక్షన్స్ లో సత్తా చాటాలని చూస్తుంది. అందుకోసం ఆ పార్టీ అధ్యక్షుడు.. మాజీ సీఎం కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. తమపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలతో పాటు.. ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత చేస్తానని చేయకుండా... వదిలేసిన వాటిని అస్త్రాలుగా చేసుకుని.. కేసీఆర్ యాత్రకు సిద్దం అవుతున్నారు.
CM KCR Profile
కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతోనే.. బీఆర్ఎస్ గతంలో చేసిన పొరపాట్లను ఎండగట్టడం మొదలు పెట్టింది. దాంతో ఆ పార్టీ నుంచి చాలా మంది కాంగ్రెస్ లోకి జంప్ అవుతున్నారు. అంతే కాదు బయటకు వచ్చి మాట్లాడటానికి కాస్త భయపడుతున్నారు. ఈక్రమంలో బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. దానికి తోడు అనారోగ్యంకారణంగా కేసీఆర్ చాలా కాలం ఇంటికే పరిమితం అవ్వడంతో.. పార్టీ కాస్త డిస్ట్రబ్ అయ్యింది.
CM KCR Profile
ఇక పార్లమెంట్ ఎలక్షన్స్ ప్రచారంతో పాటు.. పార్టీ కేడర్ ను కాపాడుకునేందకు కేసీఆర్ బస్సుయాత్ర చేయబోతున్నారు. ఈ యాత్రకు సబంధించి డేట్ కూడా ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఈనెల 24 నుంచి కేసీఆర్ బస్సు యాత్ర స్టార్ట్ చేయబోతున్నారట.
జాతీయ రాజకీయాలు పక్కన పెట్టి.. ముందు రాష్ట్రంలో ఉనికి కోసం పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ.. రెండు జాతీయ పార్టీలు బలపడుతూ.. బీఆర్ఎస్‌కి ఊపిరాడనివ్వకుండా చేస్తున్నాయి.
KCR
ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ కాస్తయినా సీట్లు సాధించి.. పెర్ఫార్మెన్స్ చూపించకపోతే.. ఆ పార్టీ మనుగడకు ముప్పు వచ్చే అవకాశం ఉంది. దాంతో అలా జరగకూడదని ముందుగానే గమనించిన అధినేత కేసీఆర్.. ప్రజల మధ్య ఉంటూ, పోరాటం చేసి..పార్టీకి జీవం పోయాలని ఫిక్స్ అయ్యారు. అందులో భాగంగానే.. ఏప్రిల్ 24 నుంచి ఆయన బస్సు యాత్రకు రెడీ అవుతున్నారు.