Bank Holidays : డిసెంబర్ లో తెలుగు రాష్ట్రాల్లోని బ్యాంకులు నడిచేది ఎన్నిరోజులో తెలుసా?
ఈ డిసెంబర్ లో దేశవ్యాప్తంగా బ్యాంకులను భారీ సెలువుల వచ్చాయి. మరి తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులకు ఎన్నిరోజులు సెలవులు వచ్చాయో చూద్దామా..!
Bank Holidays
Bank Holidays : ఈ ఏడాది విద్యాసంస్థలకే కాదు బ్యాంకులకు కూడా భారీగా సెలవులు వచ్చాయి. పండగలు, పర్వదినాలు, జాతీయ, ప్రాంతీయ సెలవులు... ఇలా 2024 లో బ్యాంకులు చాలారోజులు నడవలేవు. ఏడాది ముగింపుకు చేరుకున్నా ఇంకా బ్యాంకుల సెలవులు కొనసాగుతూనే వున్నాయి. ఈ నెలలో కూడా బ్యాంకు సెలవులు ఎక్కువగానే వున్నాయి... వీటిని దృష్టిలో వుంచుకుని బ్యాంక్ పనులు, ఆర్థిక లావాదేవీలను ప్లాన్ చేసుకొండి.
దేశవ్యాప్తంగా చూసుకుంటే వివిధ పండగలు, ఆయా రాష్ట్రాల్లోని వేడుకలు, ప్రత్యేక రోజుల నేపథ్యంలో ఈ నెలలో సగంరోజులు బ్యాంకులు నడవడంలేదు. ఏకంగా 17 బ్యాంక్ సెలవులు వస్తున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో మరీ ఈ స్థాయిలో లేకున్నా బాగానే సెలవులు వున్నాయి. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లోని బ్యాంకులకు ఈ నెలలో ఏయే రోజుల్లో సెలవులు వున్నాయో తెలుసుకుందాం.
Bank Holidays
డిసెంబర్ లో బ్యాంక్ సెలవులు :
ఇప్పటికే ఈ నెలలో ఓ బ్యాంక్ సెలవు అయిపోయింది. డిసెంబర్ ఆరంభమే ఆదివారంతో జరిగింది...కాబట్టి రోజు బ్యాంకులకు సెలవు. ఆరంభానికి తగ్గట్లే ఈ నెలలో బ్యాంకులకు సెలవుల పరంపర కొనసాగనుంది. రేపు డిసెంబర్ 8న మరో సెలవు. ఇలా మొత్తం 5 ఆదివారాలు, 2 శనివారాలు(నెలలో రెండోది,నాలుగోది) బ్యాంకులకు సాధారణ సెలవులు వస్తున్నాయి.
ఇక డిసెంబర్ 25 క్రిస్మస్ పండగ వస్తోంది. కాబట్టి ఆరోజు కూడా దేశవ్యాప్తంగా ప్రభుత్వ,ప్రైవేట్ బ్యాంకులకు సెలవు. ఇలా మొత్తంగా ఈ డిసెంబర్ లో తెలుగు రాష్ట్రాల్లోని బ్యాంకులు ఎనిమిది రోజులు పనిచేయడంలేదు.
ఈ నెలలో ఏపీ, తెలంగాణ బ్యాంకులకు సెలవులివే :
డిసెంబర్ 1 - ఆదివారం
డిసెంబర్ 8 - ఆదివారం
డిసెంబర్ 14 - రెండో శనివారం
డిసెంబర్ 15 - ఆదివారం
డిసెంబర్ 22 - ఆదివారం
డిసెంబర్ 25 - క్రిస్మస్
డిసెంబర్ 28 - నాలుగో శనివారం
డిసెంబర్ 29 - ఆదివారం
Bank Holidays
దేశవ్యాప్తంగా బ్యాంక్ సెలవులు :
ఈ డిసెంబర్ లో వివిధ రాష్ట్రాల్లో తెలుగు స్టేట్స్ కంటే చాలా ఎక్కువరోజులు బ్యాంక్ సెలవులు వచ్చాయి. మిజోరాం, నాగాలాండ్, మేఘాలయ వంటి రాష్ట్రాల్లో క్రిస్మస్ కు నాలుగురోజుల సెలవులు వచ్చాయి.వీటికి తోడు నాలుగో శనివారం, ఆదివారం వీకెండ్ కలిసిరావడంతో దాదాపు వారమంతా సెలవులు వస్తున్నాయి.
ఏఏ రాష్ట్రాల్లో ఏ సెలవులు :
డిసెంబర్ 1 (ఆదివారం) - దేశవ్యాప్తంగా సెలవు
డిసెంబర్ 3 (శుక్రవారం) - సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ పండగ - గోవాలో సెలవు
డిసెంబర్ 8 (ఆదివారం) - దేశవ్యాప్తంగా సెలవు
డిసెంబర్ 12 (మంగళవారం) ప టోగన్ నెంగ్మింజా సంగ్మా వర్ధంతి - మేఘాలయలో సెలవు
డిసెంబర్ 14 (రెండో శనివారం) - దేశవ్యాప్తంగా సెలవు
డిసెంబర్ 15 (ఆదివారం) - దేశవ్యాప్తంగా సెలవు
డిసెంబర్ 18 (బుధవారం) యు సోపో థామ్ వర్ధంతి - మేఘాలయలో సెలవు
డిసెంబర్ 19 (గురువారం) గోవా విమోచన దినం - గోవాలో సెలవు
డిసెంబర్ 22 (ఆదివారం) - దేశవ్యాప్తంగా సెలవు
డిసెంబర్ 24 నుండి 27వరకు (మంగళ,బుధ,గురు,శుక్ర) అంటే నాలుగురోజులు మిజోరం, నాగాలాండ్,మేఘాలయ రాష్ట్రాల్లో క్రిస్మస్ సెలవులు (డిసెంబర్ 25న దేశవ్యాప్తంగా బ్యాంకులకు క్రిస్మస్ సెలవు)
డిసెంబర్ 28, 29 (నాలుగో శనివారం,ఆదివారం) రెండ్రోజులు కూడా బ్యాంకులకు సెలవులు
డిసెంబర్ 30 (సోమవారం) - యు కియాంగ్ నంగ్బా జ్ఞాపకార్థం - మేఘాలయలో సెలవు
డిసెంబర్ 31 (మంగళవారం) నూతన సంవత్సర వేడుకలు - మిజోరం, సిక్కింలో సెలవు