అనాధాశ్రమ బాలికలపై అత్యాచారాలు... ఛైల్డ్ వెల్ఫేర్ సభ్యురాలితో నిందితుడికి సంబంధాలు

First Published 14, Aug 2020, 1:56 PM

ఇటీవల లాక్ డౌన్ సమయంలో రెస్క్యూ చేసిన మైనర్లను కూడా అమీన్ పూర్ అనాధాశ్రమానికి పంపాలని నిర్వహకులు ఓ ఛైల్డ్ వేల్పేర్ సభ్యురాలి సాయంతోనే అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది.

హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ లో ఓ అనాథ బాలిక లైంగికదాడికి గురయి మృతిచెందిన దారుణంపై విచారణ జరుపుతున్న పోలీసులు కీలక సమాచారాన్ని సేకరించనట్లు  తెలుస్తోంది. మారుతి అనాథాశ్రమంలో ఈ దారుణాలకు పాల్పడిన నిందితుడు వేణుగోపాల్ రెడ్డికి రంగారెడ్డి జిల్లాకు చెందిన ఛైల్డ్ వెల్ఫేర్ సభ్యురాలితో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల లాక్ డౌన్ సమయంలో రెస్క్యూ చేసిన మైనర్లను కూడా ఇక్కడికి పంపాలని అనాధాశ్రమ నిర్వహకులు ఈమె సాయంతోనే అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకోసం పలుమార్లు నిందితుడు వేణుగోపాల్ రెడ్డి, ఆశ్రమ నిర్వహకులు, సదరు ఛైల్డ్ వెల్ఫేర్ సభ్యురాలు సమావేశమైనట్లు పోలీసుల విచారణలో బయటపడ్డట్లు తెలుస్తోంది.

ఈ అత్యాచార ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకొంది. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కమిటీని ఏర్పాటు చేసింది. హైపవర్ కమిటీ ఈ ఘటనపై విచారణ చేయనుంది. బాలల హక్కుల కమిషన్ అపర్ణ, చైల్డ్ వేల్పేర్ డిపార్ట్ మెంట్ నుండి అన్నపూర్ణ, ఏసీపీ ప్రతాప్, సునందలు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు.హైపవర్ కమిటీ సభ్యులు మైనర్ బాలిక బంధువులను కలిసి విచారిస్తున్నారు. ఈ ఘటనలో ఏం జరిగిందనే విషయమై బాలిక బంధువులను ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో మరికొన్ని విషయాలు బయటపడినట్లు  తెలుస్తోంది.

మృతిచెందిన బాలికపైనే కాకుండా మరో బాలికపై కూడా అత్యాచారం జరిగినట్లు తెలుస్తోంది. తన మాదిరిగానే మరో బాలిక కూడా లైంగిక వేధింపులకు గురైనట్లు కొన్ని రోజుల క్రితం తనతో చెప్పినట్లు మృతురాలి పిన్ని ప్రీతి చెప్పినట్లు సమాచారం. ఆ బాలిక కూడా అస్వస్థతకు గురి కావడంతో ఆమె తల్లిదండ్రులు వచ్చి నిలదీశారని, అనాథాశ్రమం నిర్వాహకురాలు విజయ బెదిరించడంతో వాళ్లు తమ కూతురిని తీసుకుని వెళ్లిపోయారని మృతురాలు చెప్పినట్లు ఆమె చెప్పారు.

బాలిక మృతి కేసులో ప్రధాన నిందితుడు వేణుగోపాల్ రెడ్డి ఓ ప్రైవేట్ ఫార్మా కంపెనీలో సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాడు. అతను అనాథాశ్రమంలోని 14 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడు. అనాథాశ్రమం నిర్వాహకురాలు చెలుకూరు విజయ, ఆమె సోదరుడు సూరపనేని జయదీప్ అతనికి సహకరించారు. రెండో బాలికపై కూడా వేణుగోపాల్ రెడ్డి అత్యాచారం చేశాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా అనాధ బాలికలపై అత్యంత కర్కషంగా వ్యవహరించిన ప్రతి ఒక్కరిని కఠినంగా శిక్షించాలని వివిధ ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు కోరుతున్నాయి.

అత్యాచారానికి గురైన బాలిక మర్మాంగాలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడ ఇన్ ఫెక్షన్ ఏర్పడిందని, అది శరీరానికి పాకడంతో సెప్టిసియాతో మరణించిందని నీలోఫర్ వైద్యులు చెప్పారు. మరో వారం రోజుల్లో పూర్తి స్థాయి నివేదిక వచ్చిన తర్వాతనే అసలు కారణాలు తెలుస్తాయి.

loader