MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Telangana
  • కొమురవెల్లిలో భక్తులపై కత్తితో అఘోరి దాడి.. ఏం జ‌రిగిందంటే?

కొమురవెల్లిలో భక్తులపై కత్తితో అఘోరి దాడి.. ఏం జ‌రిగిందంటే?

Aghori in Komuravelli: కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం వ‌ద్ద అఘోరి తాను తెచ్చుకున్న‌ కత్తితో పలువురిపై దాడి చేశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి.    

2 Min read
Author : Mahesh Rajamoni
| Updated : Jan 28 2025, 06:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
12
Aghori

Aghori

Aghori in Komuravelli: తెలుగు రాష్ట్రాల్లో కొంతకాలంగా తన వివాద్పద వైఖరితో ఉద్రిక్తతలు సృష్టిస్తున్న అఘోరి మ‌రోసారి వివాదాస్ప‌ద వైఖ‌రీతో వార్త‌ల్లో నిలిచారు. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మ‌ల్లికార్జున స్వామి ఆలయం వ‌ద్ద అఘోరి ప‌లువురిపై త‌నవెంట తెచ్చుకున్న క‌త్తితో దాడి చేశారు. ఈ ఘ‌ట‌న‌లో ప‌లువురు గాయ‌ప‌డ్డారు. ఆల‌య స‌మీపంలో భ‌యాన‌క ప‌రిస్థితుల‌ను అఘోరి సృష్టించారు. దీనికి సంబంధించిన వీడియో దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. 

అఘోరి భ‌క్తుల‌పై ఎందుకు దాడి చేశారు? 

సిద్దిపేట‌లోని కొమురవెల్లి మల్లికార్జున ఆలయంలో వ‌ద్ద‌కు మ‌హిళా అఘోరి వ‌చ్చారు. నగ్నంగా ఆల‌యంలోకి రావ‌డంపై అక్క‌డి అధికారులు అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. అన‌ప్ప‌టికీ దర్శనం చేసుకునేందుకు ప్రయత్నించింది. కానీ దుస్తులు ధ‌రించి ఆల‌యంలోకి రావాల‌ని మ‌రోసారి సూచించారు. దీంతో అఘోరి ఆగ్ర‌హానికి గుర‌య్యారు. 

భారీగా అఘోరి చూడ‌టానికి వ‌చ్చిన జ‌నం

కొమురవెల్లి ఆలయానికి అఘోరి రావ‌డంతో అక్క‌డ‌కు చాలా మంది జ‌నాలు వ‌చ్చారు. ఈ స‌మ‌యంలోనే మ‌హిళా అఘోరి ఆల‌యంలోకి వెళ్లాల‌ని చూశారు. అయితే, పూర్తిగా బ‌ట్ట‌లు ధ‌రించి ఆల‌యంలోకి రావాల‌ని చెప్ప‌డంతో ఆగ్ర‌హానికి లోన‌య్యారు. త‌న వెంట తెచ్చుకున్న క‌త్తితో ప‌లువురిపై దాడి చేశారు. ఆ దాడిలో కొంత‌మందికి గాయాలు అయ్యాయి. ఈ స‌మ‌యంలో అక్క‌డ భ‌యాన‌క ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
22
Aghori Yaga

Aghori Yaga

అఘోరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

అఘోరి దాడి ప‌రిస్థితులు మ‌రింత దిగ‌జార‌కముందే ఆల‌య అధికారులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు వెంట‌నే అఘోరిని అదుపులోకి తీసుకున్నారు. మ‌హిళా అఘోరిపై మర్డర్ అంటెప్ట్ కేసు పెట్టే అవకాశం ఉన్నట్లు స‌మాచారం. ప‌బ్లిక్ లో అశాంతిని క‌లిగించే చ‌ర్య‌ల‌కు సంబంధించి చ‌ర్య‌లు తీసుకోనున్నారు. 

మొద‌టి నుంచి మ‌హిళా అఘోరి వివాద‌స్ప‌ద చ‌ర్య‌లు 

మొద‌టి నుంచి మ‌హిళా అఘోరి చేస్ట‌లు వివాద‌స్ప‌ద‌మ‌వుతున్నాయి. ఇదివ‌ర‌కు ప‌లు ఆల‌యాల్లోకి న‌గ్నంగా ప్ర‌వేశించే స‌మ‌యంలో ఘ‌ట‌న‌లు దుమారం రేపాయి. గత నవంబర్ లో శ్రీకాళహస్తీశ్వర ఆలయంలోకి నగ్నంగా అనుమతించకపోవడంతో పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. అలాగే, వరంగల్  చెరువు వ‌ద్ద పూజలు చేసి ప్రజలను భ‌య‌పెట్టారు. పలు ఆలయాల్లో కూడా పూజలు చేశారు. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
తెలంగాణ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Konda Surekha: పదవి పోయిందని ఇంట్లో కూర్చోం.. కొండా సురేఖ కీల‌క వ్యాఖ్య‌లు
Recommended image2
హైద‌రాబాద్‌లో అత్యంత ఎత్తైన బిల్డింగ్స్ ఇవే.. 59 అంత‌స్తులతో మేఘాల‌ను తాకేలా
Recommended image3
Now Playing
Talasani As Revanth Reddy | Telangana Mock Assembly | KTR | KCR | Asianet News Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved