తెలంగాణలో బీజేపీ దూకుడు: టీఆర్ఎస్‌కు చెక్ పెట్టేనా?

First Published 22, Jun 2020, 1:18 PM

తెలంగాణలో బీజేపీ నాయకత్వం దూకుడును మరింత పెంచింది. కేసీఆర్ కు చెక్ పెట్టేందుకు బీజేపీ నాయకత్వం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఆ ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ దూకుడును పెంచింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ను లక్ష్యంగా చేసుకొని బీజేపీ నాయకత్వం విమర్శల దాడిని తీవ్రం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొంటున్న నిర్ణయాలపై కూడ బీజేపీ నేతలు పదునైన విమర్శలు గుప్పిస్తున్నారు.

2023లో తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టాలని బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. గత ఎన్నికల సమయంలోనే బీజేపీ ఈ మేరకు ప్రయత్నాలు ప్రారంభించినా ఆశించిన మేరకు ఫలితాలు రాలేదు. కానీ, కాంగ్రెస్ పార్టీతో పాటు టీడీపీకి చెందిన కొందరు నేతలు తెలంగాణలో బీజేపీ తీర్ధం పుచ్చుకొన్నారు.

గత ఏడాదిలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నాలుగు ఎంపీ స్థానాలను కైవసం చేసుకోవడం కూడ ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహన్ని నింపింది.టీఆర్ఎస్ కు ఆయువుపట్టు లాంటి కరీంనగర్ ఎంపీ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకొంది. కేసీఆర్ కూతురు పోటీ చేసిన నిజామాబాద్ స్థానంలో ధర్మపురి అరవింద్ విజయం సాధించారు.

అంతేకాదు బండి సంజయ్ ను తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపిక చేయడం వెనుక ఆర్ఎస్ఎస్ కీలకంగా వ్యవహరించినట్టుగా ప్రచారంలో ఉంది. పార్టీని బలోపేతం చేయడానికి సంజయ్ పనికొస్తాడని ఆర్ఎస్ఎస్ భావిస్తోంది.వచ్చే ఎన్నికల నాటికి పార్టీని క్షేత్రస్థాయి నుండి బలోపేతం చేసేందుకు ఆర్ఎస్ఎస్ అంతర్గత వ్యూహంతో ముందుకుపోతోంది.

బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన బండి సంజయ్ టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఒంటికాలిపై లేస్తున్నారు. కరోనా నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆరోపిస్తూ ఇవాళ వైద్య ఆరోగ్య కార్యాలయాలతో పాటు ఆసుపత్రుల ముందు బీజేపీ నిరసనలకు దిగింది.

పోతిరెడ్డిపాడు ప్రవాహ సామర్ధ్యాన్ని పెంచాలని ఏపీ ప్రభుత్వం జారీ చేసిన 203 జీవోను నిరసిస్తూ తెలంగాణలో బీజేపీ నేతలు ఆందోళనలకు దిగారు. నదీ జలాల హక్కులను కాపాడడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వైఫల్యం చెందారని బీజేపీ నేతలు ఆరోపించారు.

అయితే ఇదే సమయంలో ఏపీ రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలు మాత్రం పోతిరెడ్డిపాడు ప్రవాహా సామర్ధ్యాన్ని పెంచడాన్ని సమర్ధించడం తెలంగాణ బీజేపీ నేతలకు రాజకీయంగా ఇబ్బందిగా మారింది.

లాక్ డౌన్ సమయంలో విద్యుత్ బిల్లుల రీడింగ్ తీయలేదు. ఈ నెల మొదటి వారంలో మీటర్ రీడింగ్ లు తీశారు. అయితే విద్యుత్ బిల్లులు వేలాది రూపాయాలు వచ్చాయి.

గతంలో వచ్చిన విద్యుత్ బిల్లుల కంటే ఎక్కువ మొత్తంలో బిల్లులు రావడంపై వినియోగదారులు ఆందోళన చెందారు. ఈ విషయమై విద్యుత్ కార్యాలయాల్లో ఫిర్యాదులు చేశారు.విద్యుత్ బిల్లులు ఎక్కువగా వచ్చిన విషయమై కూడ బీజేపీ నేతలు ఆందోళనలకు దిగారు.

పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత సంజయ్ ప్రభుత్వంపై అంది వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. బీజేపీ జాతీయ నాయకత్వం కూడ తెలంగాణ నాయకత్వానికి పూర్తి మద్దతును ప్రకటిస్తోంది.

కరోనా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా  రెండు రోజుల క్రితం తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ విమర్శలపై ఆదివారం నాడు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు.

రానున్న రోజుల్లో బీజేపీ మరింత దూకుడుగా వెళ్లనుంది. ఇతర పార్టీలకు చెందిన నేతలను కూడ ఎన్నికల సమయంలో తమ పార్టీలోకి ఆహ్వానించే అవకాశాలు లేకపోలేదు.

bandi sanjay

bandi sanjay

ఏపీ రాష్ట్రంలో బీజేపీ, జనసేనలు వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకొన్నాయి. తెలంగాణలో కూడ ఇదే రకమైన ఫార్మూలాను అనుసరించాలని ఆ పార్టీ ప్లాన్ చేస్తోంది. ఇటీవలే తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ లను కలిశారు. తెలంగాణ రాష్ట్రంలో కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకొన్నారు.

loader